Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించే హోంరెమిడీస్..
కండరాల నొప్పి ఉన్నప్పుడు నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేవరకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా అసౌకర్యంగా ఉంటుంది. కండరాల నొప్పికి కఠినమైన వ్యాయామం, ఇన్ఫెక్షన్, కండరాల్లో టెన్షన్ వంటివి కారణమవుతాయి. కండరాల నొప్పి ఉన్నప్పుడూ రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది.
కండరాల నొప్పి చాలా కాలం నుంచి వేధిస్తుంటే.. అంతర్లీన అనారోగ్య సమస్యకు వార్నింగ్ సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి వర్ణణాతీతంగా ఉంటుంద.ి అలాంటప్పుడు న్యాచురల్ రెమిడీస్ ఉపయోగించే తక్షణ ఉపశమనం పొందవచ్చు. కండరాల నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం కలిగించే సింపుల్ హోం రెమిడీస్ ఇవాళ పరిచయం చేయబోతున్నాం.

కండరాల నొప్పి నుంచి ఇవి ఎఫెక్టివ్ రిలీఫ్ ని అందిస్తాయి. పూర్వకాలంలో ఉపయోగించే ఎఫెక్టివ్ ఫలితాలు పొందిన వాటిని ఇప్పుడు మీకు అందించబోతున్నాం. అంతేకాదు వీటిని ఉపయోగించం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పెయిన్ కిల్లర్స్ కంటే చాలా ఎఫెక్టివ్ గా ఫలితాలు ఇస్తాయి. మరి న్యాచురల్ రెమిడీస్ ఏంటో చూద్దాం..

యాపిల్ సైడర్ వెనిగర్
కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించే వాటిలో ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలుపుని తాగచ్చు. లేదా కండరాల నొప్పి ఉన్న ప్రాంతంలో వెనిగర్ తో స్క్రబ్ చేయవచ్చు. మీకు నచ్చిన పద్ధతి ఉపయోగించవచ్చు. వెనిగర్ లో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు.. న్యాచులర్ గా కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

కోల్డ్ కంప్రెస్
పూర్వ కాలంలో ఉపయోగించిన ఈ ట్రీక్ కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో వండర్ చేస్తుంది. కేవలం కొన్ని ఐస్ క్యూబ్స్ ని క్లాత్ చుట్టు కండరాల నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాదు.. ఇన్ల్ఫమేషన్ ని తగ్గిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ బాత్
ఎప్సమ్ సాల్ట్ లో ఎక్కువ మోతాదులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పి నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎప్సమ్ సాల్ట్ బాత్ లేదా ఎప్సమ్ సాల్ట్ సోక్.. ఏది చేసినా.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
ఈ రెమిడీస్ తో పాటు.. కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ లు, ఎసెన్షియల్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ నొప్పి చాలా రోజులుగా తగ్గకపోతే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications