Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
డయేరియాను నివారించే 5 జింజర్ హోం రెమెడీస్
జీర్ణ సమస్యల్లో అత్యంత విసుగు కలిగించే సమస్య డయోరియా . ఈ జీర్ణ సమస్యలను తక్కువగా అంచనా వేయడానికి లేదు.
ఈ సమస్యను ఏవయస్సు వారైనా ఎదుర్కుంటారు. అంతేకాదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనుభపూర్వకంగా ఎర్కొన్న సమస్య ఇది . డయోరియా లక్షణాల్లో తరచూ బాత్రూమ్ కు వెళ్ళడం, డీహైడ్రేషన్ కు గురి కావడం మరియు పొట్ట ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి.
డయోరియా వచ్చినప్పుడు ఇటువంటి సాధారణ లక్షణాలు రెండు మూడు రోజుల వరకూ ఉంటుంది . డయోరియా సమస్యకు ఒక ముఖ్య కారణం ఇన్ఫెక్షన్.
డయోరియా నివారించుకోవడానికి మందుల దుకాణంలో ఎన్నో ఉన్నా, వీటి వల్ల కేవలం లక్షణాలను మాత్రమే నివారించుకోగము . కానీ మన వంటగదిలో ఉండే కొన్ని మసాలాలు, పోపుదినుసులతోనే ఈ సమస్యను చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు . జీర్ణ సంబందిత సమస్యలను నివారించడంలో మరియు డయోరియాకు కారణమయ్యే సమస్యలను మరియు ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో ఇవి గొప్పగా సహాయపడుతాయి.
అలాంటి హోం రెమెడీస్ లో ఉండే మసాలాల్లో అల్లం అత్యంత శక్తివంతమైనది . అల్లం అత్యంత విలువైన ఔషధగుణాలు కలిగిన ఒక హెర్బ్ అంతే కాదు ఇందులో థెరపిటిక్ ప్రయోజనాలు కూడా ఎక్కువే . అందుకే దీన్ని హెర్బల్ రెమెడీస్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . మరియు వివిధ రకాల వ్యాధులను నివారించడంలో దీన్ని ఎక్కువగా ఉపోగిస్తుంటారు.
డయేరియా నివారణకు వివిధ రకాల హోం రెమెడిస్ ఉపయోగించినా ఫలితం లేకపోయుంటుంది. అలాంటి వారికోసం ఒకే ఒక్క హేర్బల్ మూలికతో 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఈ క్రింది విధంగా పరిచయం చేస్తున్నాం..

అల్లం మరియు తేనె:
ఫ్రెష్ గా ఉండే అల్లంను తురిమి దానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి. తేనె లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుది. తేనె చేర్చడం వల్ల నేచురల్ స్వీట్ వల్ల తినడానికి రుచిగా ఉంటుంది . అయితే దీన్ని తిన్న తర్వాత 30నిముషాల పాటు నీరు తాగకుండా ఉండాలి.

అల్లం మరియు నిమ్మరసం:
పై రెండు పద్దతులకంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకోసం అల్లంను మెత్గగా పేస్ట్ చేసి,అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. రుచికోసం కొద్దిగా మిరియాలపొడి చల్లుకోవచ్చు . ఈ పేస్ట్ ను రోజుకు రెండు సార్లు తింటే డయేరియా నుండి ఉపశమనం పొందవచ్చు.

అల్లం మరియు దాల్చిన చెక్క:
అల్లం, మరియు దాల్చిన చెక్క అత్యంత ఔషధగుణాలున్న హెర్బల్ రూట్స్.డయేరియాను నివారించడంలో ఈ రెండు మసాలా దినుసులు మంచి కాంబినేషన్ . అల్లం , దాల్చిన చెక్క ను నీటిలో వేసి బాగా మరిగించి టీ తయారుచేసుకొని అందులో కొద్దిగా తేనే మిక్స్ చేసి తీసుకోవడం వల్ల డయేరియా ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

అల్లం మరియు కొబ్బరి నీళ్ళు:
ఈ రెండింటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు . కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శరీరానికి మినిరల్స్, విటమిన్స్ అందుతాయి . కొబ్బరి నీళ్ళుపొట్టకు ఉపశమనం కలిగించి పొట్ట సమస్యలనుండి రిలీఫ్ చేస్తుంది . ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళకు కొద్దిగా అ్లలం చేర్చి రోజుకు రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ హోం రెమెడీస్ ను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. మొదట కొద్దిగా టెస్ట్ చేసి, ఏలాంటి సమస్యా లేకుంటే తర్వాత నేరుగా రెమెడీ ఉపయోగించే పరిమాణం పెంచుకోవచ్చు . ఈ ట్రీట్మెంట్ లో ఫ్రెష్ జింజర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

అల్లం మరియు పంచదార:
బౌల్ సిస్టమ్ ను కంట్రోల్ చేయడానికి మరో ఎఫెక్టివ్ రెమెడీ. అల్లంను సన్నగా ముక్కలుగా కట్ చేసి , మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి రోజుకొక్కసారి తింటుంటే , మంచి ఫలితం పొందుతారు.



Click it and Unblock the Notifications