Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
హార్ట్ బర్న్ అండ్ ఎసిడిటికి చెక్ పెట్టే ఆయుర్వేదిక్ రెమెడీస్ ..
గుండె మంట అంటే ఛాతీ భాగంలో వేడిగా వున్నట్టనిపిస్తుంది. సాధారణంగా దీనికి కారణం పొట్టలో అధిక ఎసిడిటీ, గ్యాస్ ఏర్పడటం. హైపర్ ఎసిడిటీ అనేది అనారోగ్య తిండి అలవాట్లు, సరైన జీవన విధానం లేకపోవడంతో వస్తుంది. మనం ఏదైనా తిన్నామంటే, పొట్ట కొన్ని జీర్ణరసాలను విడుదల చేస్తుంది. వీటినే పొట్ట యాసిడ్లు అంటారు. వివిధ రకాల పదార్ధాలు తింటే పొట్ట అధికమైన గ్యాసు విడుదల చేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్య వస్తుంది.

ఎసిడిటీ, గ్యాస్ ల కారణంగా ఈసోఫేగస్ దెబ్బతినకుండా ఒక వాల్వ్ వుంటుంది. ఈసోఫేగస్ పొట్టను ఫేరీక్స్ ను కలుపుతుంది. ఈ వాల్వ్ దెబ్బతిన్నా లేక సరిగా పనిచేయకపోయినా ఎసిడిటీ మరియు గ్యాస్ గుండె వెనుకగల రిబ్స్ వద్ద బ్లాక్ అయి గుండె మంట వస్తుంది. ఈ ప్రక్రియను రిఫ్లక్స్ అంటారు. గుండె మంట సూచనలు సాధారణంగా వికారం, త్రేన్పులు, కొద్దిపాటి గుండె నొప్పి, మొదలైన వాటితో వస్తాయి. ఈ గుండె మంటకు ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలు చూడండి.....

1. పెప్పర్ మింట్ టీ - అధిక యాసిడ్ ను ఉత్పత్తి చేసే పొట్ట కండరాలకు హాయి కలిగించే శక్తి పెప్పర్ మెంట్ లోని మెంధాల్ కు వుంది. పొట్ట కండరాలు సంకోచించటం అరికట్టగలిగితే, అది పొట్టనుండి అధిక యాసిడ్ రావటాన్ని ఆపుతుంది. పెప్పర్ మెంట్ వాడకం ఇంట్లో చేసుకునేటందుకు మంచి చికిత్స.

2. బేకింగ్ సోడా మరియు నీరు - నీళ్ళల్లో ఒక చెంచాడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి తాగండి. గుండె మంటనుండి తక్షణ రిలీఫ్ వస్తుంది. రుచి బాగా లేకపోయనప్పటికి బాగా పని చేస్తుంది. బేకింగ్ పౌడర్ లో వుండే సోడియం బాగా పనిచేస్తుంది.

3. బొప్పాయి పండు- బొప్పాయి పండులో పాపెయిన్ అనే పదార్ధం వుంది. ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టలోని అసౌకర్యాన్ని, గుండెలో వచ్చిన మంటను కూడా తగ్గిస్తుంది.

4. అల్లం- అల్లం కు మంట తగ్గించే శక్తి వుంది. సుమారు 500 మి.గ్రా. అల్లం పచ్చిది లేదా ఇతర ఆహారంతో కలిపి తీసుకోండి. లేదా అల్లం టీ తాగి రిలీఫ్ పొందండి.

5. బాదం పప్పు - గుండె మంట వచ్చినపుడు రెండు బాదం పప్పులు తినండి. వీటిలో వుండే అధికమైన నూనె పొట్టలో ఏర్పడిన ఎసిడిటీని దూరం చేస్తుంది. వెంటనే గుండెమంట తగ్గుతుంది. గుండెమంట త్వరగా పోవాలంటే, గ్యాస్ అంటూ మందులు వాడే కన్నా ఇంటి చిట్కాలను ఫాలో అయిపోండి..
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications