Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డైలీ హ్యాబిట్సే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతున్నాయా ??
డయాబెటిస్ అనేపదం వినగానే ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే.. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయిందంటే.. చాలా తీవ్రప్రభావం చూపుతుంది. చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నాయి. కొంతమంది చిన్నవయసులో షుగర్ వ్యాధిని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాధి చాలా తీవ్రమైనది ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే ఉంటుంది.
అయితే డయాబెటిస్ కొంతవరకు ప్రమాదం లేకపోయినా.. మరీ ఎక్కువ అయిందంటే.. చాలా ప్రమాదం. అయితే డయాబెటిస్ జెనిటిక్ డిజార్డర్ అయినా కావచ్చు, వారసత్వంగా రావచ్చు, అన్ హెల్తీ లైఫ్ స్టైల్ కారణంగానూ రావచ్చు. హెల్తీ డైట్, వ్యాయామం ఫాలో అవకపోయినా.. డయాబెటిస్ రిస్క్ ఉంది.
రక్తప్రవాహంలో షుగర్ లేదా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువయినప్పుడు డయాబెటిస్ గా చెబుతారు. దీనికి చికిత్స లేదు. కానీ లక్షణాలను కంట్రోల్ చేయవచ్చు. కొన్ని లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావడం వల్ల.. దీన్ని నివారించవచ్చు. రెగ్యులర్ గా మనం ఫాలో అయ్యే అలవాట్లే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా కాఫీ తాగడం
ఒకవేళ షుగర్ లేకుండా కాఫీ తాగినా.. కాఫీలో ఉండే కెపీన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచడానికి కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

హైక్యాలరీ ఫుడ్ తీసుకోవడం
పిజ్జా, ఫ్రైస్, బర్గర్స్, చాక్లెట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఎక్కువగా ఉండే హై క్యాలరీలు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచేస్తాయి. కేవలం స్వీట్స్ మాత్రమే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచవు.

యాంటీ బయోటిక్స్
ఫ్లూ, సైనస్ వంటి వాటిని నివారించడానికి డాక్టర్లు సూచించే.. కొన్ని రకాల యాంటీ బయోటిక్స్, మెడిసిన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచడానికి కారణమవుతాయట. కాబట్టి.. ఇలాంటి మెడిసిన్స్ ని ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది.

ఒత్తిడి
పనిఒత్తిడి, డిప్రెషన్, ఎక్కువగా ఫ్యామిలీ పరమైన సమస్యలు.. హార్మోన్స్ లో ఫ్లక్చ్యూయేషన్ ని క్రియేట్ చేస్తాయి. దీనివల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతాయి. ఎందుకంటే.. వాటిల్లో క్యాలరీలు, షుగర్, కెఫీన్ ఎక్కువగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్ తినడం
డ్రైఫ్రూట్స్ హెల్తీ స్నాక్స్. కానీ.. మరీ ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి మితంగా తీసుకోవాలి.

బర్త్ కంట్రోల్ పిల్స్
బర్త్ కంట్రోల్ పిల్స్ లో ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమవుతాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.



Click it and Unblock the Notifications