Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
మీకు ఐయోడిన్ లోపం ఉందని తెలిపే లక్షణాలు..!
ఐయోడిన్ అనేది చాలా ముఖ్యమైన మైక్రో న్యూట్రియంట్. ఇది థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే.. ఇది థైరాయిడ్ హార్మోన్స్ ని ఎలాంటి సమస్య లేకుండా ఉత్పత్తి చేస్తుంది.
ఐయోడిన్ అనేది చాలా ముఖ్యమైన మైక్రో న్యూట్రియంట్. ఇది థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది. అలాగే.. ఇది థైరాయిడ్ హార్మోన్స్ ని ఎలాంటి సమస్య లేకుండా ఉత్పత్తి చేస్తుంది.

అయితే శరీరం కావాల్సిన మొత్తంలో ఐయోడిన్ ని కలిగి ఉండకపోతే.. ఏమవుతుంది ? సరైన మోతాదులో శరీరంలో ఐయోడిన్ లేకపోతే.. థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా జరగదు. కాబట్టి ఐయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది.
ఈ సమస్య ఉందంటే.. చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి.. ఐయోడిన్ లోపం సూచించే లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం అవసరం. ఐయోడిన్ లోపం ఉందని తెలిపే లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

అలసట
చాలా తరచుగా అలసట సమస్య ఎదురవుతుంది. కానీ రెగ్యులర్ గా ఈ సమస్య వస్తుందంటే.. మీ శరీరంలో ఐయోడిన్ తక్కువగా ఉందని సంకేతం. కాబట్టి.. వెంటనే డాక్టర్ ని సంప్రదించి చెక్ చేయించుకోవడం మంచిది.

కాన్ట్సిపేషన్
ఐయోడిన్ లోపం శరీరంలో వివిధ అవయవాలపై దుష్ర్పభావం చూపుతుంది. ఐయోడిన్ లోపం ఉన్నవాళ్లు.. రెగ్యులర్ గా కాన్ట్సిపేషన్ సమస్యను ఫేస్ చేస్తారు. కాబట్టి.. ఈ లక్షణం మీలో కనిపిస్తుంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

థైరాయిడ్
శరీరానికి కావాల్సిన మొత్తంలో ఐయోడిన్ అందకపోతే.. థైరాయిడ్స్ పెద్దగా మారతాయి. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. మరింత పెద్దగా మారి, కణతిలా ఏర్పడుతుంది. కాబట్టి.. ఇలాంటి సమస్యను మీరు ఫేస్ చేసినట్లైతే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

ఎమోషనల్ ఇంబ్యాలెన్స్
ఐయోడిన్ డెఫిసియన్సీ సమస్యతో బాధపడేవాళ్లు.. తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఒకవేళ మీరు ఎమోషనల్ గా ఇబ్బందిపడుతున్నారంటే.. మీ డైలీ లైఫ్ లో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కామన్ అయితే.. డాక్టర్ ని సంప్రదించాలి.

స్కిన్ ఇన్ల్ఫెక్షన్స్
ఐయోడిన్ డెఫిసియన్సీని సూచించే లక్షణాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఒకటి. చర్మం డ్రైగా, పొట్టు రాలడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయంటే.. ఐయోడిన్ తక్కువగా ఉందని సంకేతం.

ఇమ్యునిటీ తగ్గడం
శరీరంలో ఐయోడిన్ లెవెల్స్ తగ్గితే.. వ్యాధినిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. దీనివల్ల సాధారణ జలుబు, ఇతర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి.

బరువు పెరగడం
హఠాత్తుగా బరువు పెరగడం కూడా.. ఐయోడిన్ డెఫిసియన్సీని సూచిస్తుంది. అనేక భాగాల పనితీరుకి.. ఐయోడిన్ కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి.. వీటిల్లో ఏ లక్షణం కనిపించినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications