Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వార్నింగ్: మహిళలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని క్యాన్సర్ లక్షణాలు
క్యాన్సర్ !! ఇది ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధి. ఇది ఒక్కసారి ఎటాక్ అయిందంటే.. మరణమే అన్న భావన చాలా మందిలో ఉంది. కానీ.. క్యాన్సర్ ని మొదట్లోనే గుర్తిస్తే.. దాన్ని నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మొదట్లోనే క్యాన్సర్ గుర్తించే లక్షణాలను ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకోవడం చాలా అవసరం.
సూపర్ ఫుడ్స్ : క్యాన్సర్ తో పోరాడుతాయి మరియు నివారిస్తాయి
కొన్నిసార్లు తలనొప్పి కేవలం తలనొప్పే, పుట్టు మచ్చ పుట్టు మచ్చే.. కానీ శరీరంలో జరుగుతున్న మార్పులు, శరీరంలో వస్తున్న కొత్త సమస్యలను గుర్తించడం చాలా అవసరం. అలాగే.. ప్రాణాంతకమైన, భయంకరమైన క్యాన్సర్లకు కారణమవుతాయని తెలుసుకోవాలి. అలాగని ఏ చిన్న సమస్య వచ్చినా.. క్యాన్సరేనేమో అన్న ఆందోళన కూడా మంచిది కాదు. కాబట్టి.. క్యాన్సర్ వస్తుందని హెచ్చరించే కొన్ని వార్నింగ్ సంకేతాలను మహిళలు ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. మరి అవేంటో చూద్దామా..

బ్రెస్ట్ లో మార్పులు
బ్రెస్ట్ లో వచ్చే మార్పులను మహిళలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బ్రెస్ట్ లో లంప్ ఏర్పడితే చెక్ చేయించుకోవాలి. అలాగే వాపు, రెడ్ నెస్, నిపుల్ లో మార్పులు, బ్రెస్ట్ ఇతర సమస్యలు.. క్యాన్సర్ ని సూచించే లక్షణాలని గుర్తించాలి.

ఇర్రెగ్యులర్ బ్లీడింగ్
యూరిన్ లో బ్లడ్ రావడం, మలంలో బ్లడ్ కనిపించడం క్లాట్ కాదని తెలుసుకోండి. ఇవి మీ శరీరంలో ఏదో మార్పు జరుగుతోందని గుర్తించండి. ఒకవేళ రక్తస్రావం ఎక్కువైతే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం.

బ్లోటింగ్
చాలామంది మహిళలు బ్లోట్ అవడాన్ని పీరియడ్ కి సంకేతమని, ఎక్కువగా తినడం వల్ల వచ్చిందని తీసిపారేస్తుంటారు. కానీ.. తరచుగా బ్లోటింగ్ అవడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అది ఒవేరియన్ క్యాన్సర్ కి సంకేతమని గుర్తించండి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించి చెక్ చేసుకోవడం మంచిది.

పుండ్లు మానకపోవడం
చర్మంపై పుండ్లు, గాయాలు కావడం.. అవి తగ్గకపోవడం స్కిన్ క్యాన్సర్ కి సంకేతం. నోట్లో చాలా కాలం నుంచి పుండు అయి మానకపోతే.. అది ఓరల్ క్యాన్సర్ కి సంకేతం. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్మోకింగ్ చేసేవాళ్లు, టొబాకొ నమిలేవాళ్లు, ఆల్కహాల్ తీసుకునేవాళ్లు నోట్లో ఏ చిన్న గాయమైనా.. వెంటనే అప్రమత్తం కావాలి.

వేలి గోళ్లపై గీతలు
చేతివేళ్లు అనేక రకాల వ్యాధుల గురించి వివరిస్తాయి. దాన్ని మొదట్లోనే గుర్తించలేకపోతే.. చాలా ప్రమాదకరంగా మారవచ్చు. గోళ్లపై నల్లగా పొడవాటి గీతలు ఏర్పడితే.. అది చాలా డేంజర్ అని గుర్తించాలి. అయితే ఇది ఎలాంటి నొప్పికి కారణమవదు. కానీ ఇది స్కిన్ క్యాన్సర్ కి సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి.

అలసట
అలసట చాలా చిన్న సమస్యగా చాలామంది భావిస్తారు. కానీ.. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. తరచుగా అలసిపోవడం, చాలా సమయం రెస్ట్ తీసుకున్నా.. అలసిపోతుండటం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

చర్మంలో మార్పులు
సాధారణంగా మనం పుట్టు మచ్చలను శరీరంపై చూస్తుంటారు. మనం పెరిగే కొద్ది వాటి ఆకారం, సైజ్ ఎలా మారిందో అని గమనిస్తూ ఉంటాం. అయితే ఇలాంటి విషయాలు కాకుండా.. మచ్చల దగ్గర మార్పులు కనిపించాయంటే.. కాస్త అలర్ట్ అవ్వాలి. స్కేలింగ్, పీలింగ్, బ్లీడింగ్ స్కిన్, నోట్లో పుండ్లు వంటి లక్షణాలన్నీ క్యాన్సర్ లక్షణాలుగా గుర్తించాలి.



Click it and Unblock the Notifications