Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు
క్యాన్సర్ అన్న పేరు వినగానే అందరిలోనూ వెన్నులో వణుకు పుడుతుంది. క్యాన్సర్ అనేదానిపై మనందరిలో ఒక అవగాహన ఉంది. ఇది మనుషులకు వచ్చే.. ఒక ప్రాణాంతకమైన డేంజర్ వ్యాధి. రోజు రోజుకీ క్యాన్సర్ పేషంట్స్ కూడా పెరుగుతూనే ఉన్నారు. అందుకే.. క్యాన్సర్ అంటే.. మరింత ఆందోళన ఎక్కువ అవుతోంది.
క్యాన్సర్ అరికట్టడానికి, నివారించడానికి మిరాకిల్ రెమిడీస్ చాలా అందుబాటులో ఉన్నాయని మనం నమ్ముతాం. అవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని ఎవరూ పక్కాగా.. నిరూపించలేదు. ప్రతి ఏడాది వేలాదిమంది క్యాన్సర్ తో చనిపోతున్నారు. మెడిసిన్స్ లో చాలా డెవలప్ అయినా క్యాన్సర్ కి మాత్రం సరైన మందు కనిపెట్టలేకపోతున్నారు.
కణాలు అసాధారణంగా ఏర్పడటం వల్ల.. టిష్యూస్, ముఖ్యమైన అవయవాల డ్యామేజ్ కి కారణమవుతాయి. దీని వల్ల క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ని సూచించే రకరకాల లక్షణాలున్నాయి. అలాగే అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ లలో బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టెట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఒకటి. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం..

బ్లడ్ సెల్స్
బ్లడ్ క్యాన్సర్ అనేది బ్లడ్ సెల్స్ పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తెల్ల రక్తకణాలు, బోన్ మ్యారోలో ఉండే రక్త కణాలపై ప్రభావం చూపుతుంది.

రెండు రకాలు
బ్లడ్ క్యాన్సర్ రెండు రకాలుగా ఉంటుంది. క్రోనిక్, అక్యూట్ అనే రెండు రకాలు. ఈ రెండింటికీ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది.

మగవాళ్లకు
బ్లడ్ క్యాన్సర్ ఎక్కువగా ఆడవాళ్లతో పోల్చితే మగవాళ్లలోనే కనిపిస్తుంది. మగవాళ్లకు 31 శాతం ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

అరుదుగా వచ్చే క్యాన్సర్
బ్లడ్ క్యాన్సర్ చాలా సాధారణంగా చూసే క్యాన్సర్ ల లాంటిది కాదు. 10 లక్షల మందిలో 35 మందికి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. 35 మందిలో 5 మందికి అన్నమాట. పిల్లల్లో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి.

పిల్లలకు
14 ఏళ్లలోపు పిల్లలు క్యాన్సర్ తో చనిపోతుంటే వాళ్లలో ఎక్కువ మంది బ్లడ్ క్యాన్సర్ వల్ల చనిపోయితునట్టు తాజా అధ్యయనాలు తేల్చాయి.

స్మోకింగ్
పెద్ద వాళ్లలో బ్లడ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం.. స్మోకింగ్ చేసే అలవాటు ప్రధానమైనది.

గుర్తించడం
చాలా సందర్భాల్లో బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు కనిపించవు. ఫైనల్ స్టేజ్ కి చేరేవరకు కూడా దీన్ని గుర్తించడం, ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం.

కెమికల్స్
కెమికల్స్ తో పనిచేసేవాళ్లు.. కొన్ని రకాల రేడియేషన్స్ ని రెగ్యులర్ గా పొందాల్సి ఉంటుంది. ఇలాంటి వాళ్లకు.. బ్లడ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications