Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
ఖచ్చితంగా నివారించాల్సిన బ్రెయిన్ డ్యామేజింగ్ హ్యాబిట్స్..!
జ్ఞాపకశక్తికి ఆధారం మన మెదడు. మేధావికైనా, సామాన్యడికైనా ఉండే మెదడు బరువు1450 గ్రాములు. మెదడును వినియోగించుకునే విధానం మీదే వ్యక్తి ప్రతిభ, జ్ఞాపకశక్తి ఆధారపడి ఉంటుంది. మెదడు నుండి శరీరంలోని వివిధ అవయవాలకు నాడులు కలుపబడి ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో మరొకటి సుమారు 20 వేల అనుసంధానాలు కలిగి ఉంటాయి.పెద్ద టెలిఫోన్ ఎక్చేంజిలో వైర్ల నెట్‌వర్క్ మాదిరిగా మెదడులో నాడులు, నాడీకణాలు అనుసందానించబడి ఉంటుంది. అందుకే కోట్లాది సమాచార యూనిట్లను ఏకకాలంలో గ్రహించి విశ్లేషించగలుగుతుంది.
మానవుని మెదడు, జ్ఝానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని మీకందరికీ తెలిసే ఉంటుంది. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మెదడు చురుగ్గా ఉన్నంత కాలం మన శరీరం చురుకుగా ఉంటుంది. వయస్సుతో మెదడుకు సంబంధంలేదు. ఎదైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మెదడుకు గాయాలైతే మొత్తం శరీరమంతా బాధపడుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎమోషనల్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి.
మెదడు చురుగ్గా ఉండాలి, దాంతో మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెయిన్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరిలో బ్రెయిన్ డ్యామేజింగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇవి మనకు తెలిసి కొన్ని చేస్తే తెలియక కొన్ని చేస్తుంటాము . వీటిని ఖచ్చితంగా మానుకోవల్సి ఉంటుంది. కొన్ని చెడు అలవాట్లును నివారించుకోవాలి. మెదడులో ఏదైనా ఒక భాగం సమస్యాత్మకంగా ఉన్నప్పుడు, నిస్సందేహంగా శరీరంలో జీవక్రియలన్నీసమస్యాత్మకంగా మారుతాయి. కాబట్టి మన మెదడు మీద మనకు శ్రద్దఉండాలి. మెదడుకు ఎటువంటి హానీ కలగకుండా చూసుకొన్నప్పుడే మన శరీరంలో అన్ని అవయవాలు క్రమంగా పనిచేస్తాయి. అప్పుడే మనం అరోగ్యంగా ఉండగలం. మెదడు ఆరోగ్యం ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అవేంటో చూద్దాం.

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం:
ఉదయం అల్పాహారం తీసుకోని వారిలో ఆ రోజు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. అది మెదడు క్షీణత కారణమవుతుంది. మెదడుకు సరైన మోతాదులో పోషకాలు అందకపోవడంతో మెదడు పనిచేసే శక్తి తగ్గుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ కు ఇది కూడా ఒక కారణం.

అతిగా తినడం:
అతిగా తినడం వల్ల మెదడు యొక్క ధమనులను పెరగడంతో మానసిక శక్తి తగ్గుదలకు దారితీస్తుంది. అంతే కాదు ఓబేసిటికి కారణమవుతుంది. ఎక్సెక్స్ ఫుడ్స్ తినడం వల్ల ఇది కొన్ని ముఖ్యమైన పోషకాలు బ్రెయిన్ కు చేరవు, దాంతో బ్రెయిన్ హెల్తీగా ఉండదు. కాబట్టి అతిగా తినకుండా ఉండటం మంచిది.

ఆలస్యంగా నిద్రపోవడం:
ప్రతి రోజూ మన శరీరానికి, మనస్సుకు కనీసం 6నుండి7గంటల సమయం రెస్ట్ అవసరం. రోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఖచ్చితంగా బ్రెయిన్ కు హాని కలుగుతుంది. రోజూ సరిపడా నిద్రపోవడం వల్ల సెరిబెమ్ కు విశ్రాంతి కలుగతుంది, మెదడులో డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేస్తుంది కాబట్టి, త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్రలేవడం చేయాలి.

ఎక్సెస్ షుగర్:
ఎక్సెస్ షుగర్ తీసుకోవడం వల్ల హార్ట్ సమస్యలు అధికమవుతాయి. షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా డయాబెటిస్ కు కారణమవుతుంది. ఎక్కువగా చక్కెర తీసుకోవడం వల్ల పోషకాహారలోపం ఏర్పడుతుంది. దానివల్ల ప్రోటీన్లు మరియు పోషకాలను పీల్చుకొనే అంతరాయం కలుగుతుంది. మరియు మెదడు అభివృద్ధిపై ప్రభావితం చూపుతుంది.

నిద్రించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన డ్రెస్సులు వేసుకోవడం:
ఇది మరో ముఖ్యమైన బ్రెయిన్ డ్యామేజింగ్ హ్యాబిటి. టైస్,సాక్స్, స్కార్ప్స్ లేదా టైట్ గా ఉన్న దుస్తులు వేసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సప్లై సరిగా ఉండదు, ముఖ్యంగా బ్రెయిన్ కు ఆక్సిజన్ సప్లై సరిగా ఉండకపోవడం వల్ల ఆందోళనకు , మతిమరపుకు కారణమవుతుంది. స్మోకింగ్: పొగత్రాగడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమే. పొగ త్రాగడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది వివిధరకాలుగా మెదడు సంకోచాలకు కారణమవుతుంది మరియు అల్జీమర్ వ్యాధికి దారితీయవచ్చు.

ఎక్కువగా మాట్లాడటం:
ఎక్కువగా మాట్లాడటం వల్ల ఆందోళకలుగుతుంది. మనశ్శాంతిని కోల్పోతారు. ఎంత తక్కువ మాట్లాడితే , లైఫ్ అంత బ్యాలెన్స్ గా ఉంటుంది. తక్కువగా మాట్లాడటం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

డీహైడ్రేషన్ :
నీరు తక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్ కు గురౌతారు. ఇది బ్రెయిన్ ఫంక్షన్ కు అంతరాయం కలిగిస్తుంది. వాటర్ ను సమంగా తీసుకోవడం హైడ్రేషన్ లో ఉండవచ్చు. బ్రెయిన్ కూడా హెల్తీగా ఉంటుంది.

ఆలోచించడం:
ఆలోచించడం మెదడుకు పదను పెట్టడం లాంటిది, ఆలోచించక పోవడం వల్ల మెదడు సంకోచానికి కారణం కావచ్చు.



Click it and Unblock the Notifications