Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
మంచంపై కాకుండా.. ఫ్లోర్ పై పడుకుంటే పొందే హెల్త్ బెన్ఫిట్స్ ?
ఒకప్పుడు డబుల్ కాట్ లేదు.. సింగిల్ కాట్ అంతకంటే లేదు. కఠిక నేలపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. పూర్వకాలంలో.. చిన్నా పెద్దా.. అందరూ నేలపైనే పడుకునేవాళ్లు. ఇప్పటికీ చాలామంది పెద్దవాళ్లు నేలపై పడుకోవడానికే ఇష్టపడతారు. ఎందుకో మీకు తెలుసా ?
మన పూర్వీకులు రాగి పాత్రలనే ఎందుకు వాడేవాళ్లు ?
పిల్లో ఉపయోగించి లేదా ఉపయోగించకుండా.. నేలపై పడుకుంటే.. చాలా హెల్తీగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆశ్చర్యంగా ఉందా ? నిజమే.. రాత్రిపూట ఫ్లోర్ పై పడుకుంటే.. శరీరంలోని నరాలు రిలాక్స్ అవుతాయట. అలాగే బాడీ పెయిన్స్, అన్ని రకాల నొప్పులను ఈ నిద్రపోయే విధానం తగ్గిస్తుంది. అది కూడా అరగంట వ్యవధిలోనే నొప్పులన్నీ మాయమవుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
చేతితో తినడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ?
అంతేకాదు రోజూ ఫ్లోర్ పై పడుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు అంటే ఎముకలు, కండరాల నొప్పులు తగ్గించి రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. శరీరానికంతటికీ.. ఆరోగ్యకరంగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. నేలపై పడుకోవడం వల్ల బాడీలో అనేక మార్పులు మీరు గుర్తించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ ఫ్లోర్ పడుకుంటే.. పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

అలసట
చాలా సందర్భాల్లో రాత్రిపూట పడుకున్న తర్వాత.. చాలా ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటాం. చెమట, దుప్పట్ల మెటీరియల్ కారణంగా.. అసౌకర్యంగా ఉంటుంది. కానీ.. ఎప్పుడైతే.. గ్రౌండ్ పై పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. అలాగే ఏ మాత్రం అలసట ఉండదు.

రిలాక్సేషన్
రెడీమేడ్ గా దొరికే మ్యాట్రెస్ పై పడుకుంటే.. శరీరం అడ్జెస్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ మీరు నేలపై పడుకుంటే.. శరీరమంతా చాలా రిలాక్స్ అవుతుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది.

శరీరానికి
ఫ్లోర్ పై పడుకోవడం వల్ల.. అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రధానంగా.. దిండు లేకుండా గ్రౌండ్ పై వెళ్లకిలా పడుకుంటే.. తల, మెడ, వెన్నెముక, హిప్స్.. శరీరం మొత్తం ఉపశమనం పొందుతుంది. అలాగే బాడీ పెయిన్స్ కూడా తగ్గిస్తుంది.

బ్లడ్ సర్క్యులేషన్
శరీరంలో రక్త ప్రసరణ సజావుగా ఉంటే.. గుండెకి సంబంధించిన సమస్యలు రావడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే.. మీ శరీరం ఫిట్ అండ్ యాక్టివ్ గా ఉంటుంది.

భుజాలు
ఫ్లోర్ పై పడుకుంటే.. భుజాల నొప్పులు దరిచేరవు. కనీసం వారానికి మూడుసార్లు ఫ్లోర్ పై పడుకోవడం అలవాటు చేసుకుంటే.. మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

నిద్రలేమి
చాలా మందిలో తరచుగా వినే సమస్య నిద్రలేమి. ఫ్లోర్ పై పడుకుంటే.. నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చని.. ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

వెన్నునొప్పి
చాలామంది మహిళలలు బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడాలంటే.. ఫ్లోర్ పై నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఫ్లోర్ పై పడుకున్నప్పుడు వెన్నెముక నిటారుగా, సరైన భంగిమలో ఉంటుంది. దీనివల్ల నొప్పి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
