Latest Updates
-
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
రక్తప్రసరణ మెరుగుపడేందుకు (హాండ్ స్టాండ్) అధోముఖ వృక్షాసనం
యోగా వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. జలుబు, దగ్గు నుండి కీళ్ళనొప్పులు, మధుమేహం, ఇతర నొప్పులు మొదలైన అన్నిటికీ యోగానే చికిత్స.
మన శరీరంలో రక్తం అత్యంత ప్రధానమైన వాటిలో ఒకటి. మన శరీరం సాధారణ కార్యకలాపాలు నిర్వహించాలి అంటే సరైన, స్ధిరమైన రక్తప్రసరణ చాలా అవసరం. రక్తప్రసరణ లో ఇబ్బంది కలిగితే, రక్తం గడ్డకట్టడం, నరాలకు సంబంధించిన సమస్యలు, కాళ్ళు వాయడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
శరీరంలో రక్తప్రసరణను పెంపొందించుకోవడానికి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అన్ని ఔషధాలతోపాటు, యోగా ప్రత్యేకంగా హాండ్ స్టాండ్ (అధోముఖ వృక్షాసనం) అనేది రక్తప్రసరణను పెంపొందించడంలో అత్యుత్తమమైన అంశాలలో ఒకటిగా నిర్ధారించబడింది.

“అధోముఖ వృక్షాసనం” అనేపదం సంస్కృతం నుండి పుట్టింది. 'ముఖ అంటే ముఖం, 'అదో’ అంటే కిందకి వంగడం, 'వృక్ష’ అంటే చెట్టు, 'ఆసన’ అంటే భంగిమ అని అర్ధం.
మన ముఖం చెట్టులాగా కిందకి వంచి ఉంచాలి, ఈ విధంగా అధోముఖ వృక్షాసనం ని ఆచరిస్తే మన శరీరానికి మంచి రక్తప్రసరణ జరుగుతుంది.
ప్రారంభంలో, ఈ ఆసనం చేసేవారికి కొంచెం కష్టం గానే ఉంటుంది. అయితే, గోడను ఆధారంగా చేసుకుని ఈ ఆసనం చేయవచ్చు, ఇలా చేయడం వల్ల పడిపోతాం అనే భయాన్ని కూడా అధిగమించ వచ్చు. నిదానంగా మీరు ఎటువంటి ఆధారం లేకుండానే ఈ ఆసనాన్ని వేయగలుగుతారు.
ఈ ఆసనాన్ని ఈ క్రింది విధంగా ఒకదాని తరువాత ఒకటి చేయాలి

1. గోడ నుండి కొన్ని అంగుళాల దూరంలో మీ చేతులను నేలపై ఉంచండి.
2. భుజాలు మీ మణికట్టు వైపు ఉండాలి.
3. ఒక మోకాలు వంచి, మరో కాలును పైకి లేపండి. ఒకసారి మీరు సౌకర్యవంతమైన స్థానం లోకి వస్తే, ఆ కాలును కూడా నిలబెట్టండి.
4. చిన్నగా మీ మరో కాలిని కుడా పైకిలేపి మీరు సౌకర్యవంతంగా ఉన్నంత వరకు ఉండండి.

5. మీ తల రెండు మోచేతుల మధ్యలో ఉందొ లేదో గమనించుకోండి.
6. ఈ భంగిమలో ఒకటి లేదా రెండు నిముషాలు ఉండి గట్టిగా గాలి పీల్చండి.
7. నిదానంగా మీ కాళ్ళను ఒకదాని తరువాత ఒకటి కిందకు తీసుకురండి.
ప్రారంభంలో ఈ ఆసనం చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ ఒకసారి చేయగలిగితే ఇది చాలా తేలికగా ఉంటుంది.
ఈ ఆసనం వల్ల ఇతర ప్రయోజనాలు

భుజాలు, మోచేతులు, మణికట్టు బలపడడానికి సహాయపడుతుంది.
వత్తిడి, కంగారు నుండి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
శరీర సామర్ధ్యాన్ని పెంపొందించి సమతౌల్యతను పెంపొందించడంలో సహాయపడుతుంది.
పొట్ట, బానపొట్ట వంచడానికి సహాయపడుతుంది.
నిరాశతో ఉన్నవారికి చికిత్సగా సహాయపడుతుంది.
జాగ్రత్తలు
మెడ, వెన్ను లేదా భుజాలకు దెబ్బతగిలిన వారు ఈ ఆసనం వేయొద్దు. అంతేకాకుండా, గుండె సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నవారు యోగా నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనాన్ని వేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications