Latest Updates
-
మహారాష్ట్ర స్టైల్ గుత్తి వంకాయ కూర..ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడటం ఎంత ప్రమాదమో తెలుసా.? -
పెళ్లిళ్ల స్పెషల్.. హైడ్రా పాత్ షాహి రెడ్ చికెన్.. బ్యాచ్లర్స్ సైతం సింపుల్గా చేసుకునేలా.! -
అమర్నాథ్ యాత్రికులకు అలర్ట్.. బడ్జెట్ ఎక్కడ, ఎంతవుతుంది.. పూర్తి వివరాలు.! -
చర్మ సౌందర్యాన్ని ఇట్టే పెంచే పాలకూర.. దాబా స్టైల్లో నోరూరించేలా ఇలా చేయండి.! -
ఇంట్లోకి మురికి రాకుండా చేసే 5 బెస్ట్ డోర్ మ్యాట్లు.. వర్షాకాలంలో బెస్ట్ ఆప్షన్స్.! -
గుండెకి మేలు, ఎముకలకి బలం.. ఇంకా ఎన్నో.. రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.! -
మహిళలు, పిల్లల ఎముకల బలానికి అమృతం లాంటి నల్ల మినపపప్పు చట్నీ..ఇడ్లీ,దోశెలతో సూపర్ టేస్ట్ -
హిందూ ధర్మంలో ‘లోక కల్యాణం’ అనే భావన ఎందుకు అంత గొప్పది? -
ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం? కళ్ళు తెరిచి ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది?
రోజూ ఉదయం పరగడుపున తినే తేనె-ఉసిరికాయ కాంబినేషన్ తో మ్యాజికల్ హెల్త్ బెనిఫిట్స్
ఆమ్లా(ఉసిరికాయ)లోని అద్భుతమైన ఔషధగుణగణాల గురించే మీరు వినే ఉంటారు. దీన్నిఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తాము. అందువల్ల, ఉసిరికాయను నేరుగా అలాగే తినడం వల్ల ప్రయోజనాల కంటే తేనెతో మిక్స్ తినడం వల్ల పొందే ప్రయోజనాలు రెండింతలు ఎక్కువగా ఉంటాయి . అంతే కాదు పుల్లగా ఉండే ఈ ఆమ్లా తేనె తో తినడం వల్ల పుల్లదనం పోయిన, నోటికి ఒక కమ్మని రుచిని అందిస్తుంది . ఉసిరికాయను తేనెలో నానబెట్టడం వల్ల పుల్లని స్వభావం కోల్పోవడం మాత్రమే కాదు , రుచితో పాటు, హెల్త్ బెనిఫిట్స్ ను డబుల్, త్రిబుల్ చేస్తుంది.
బాబోయ్...ఇది ఉసిరి కాయ కాదు...ఆరోగ్యపు సిరిసంపద...!
కొన్ని నెల పాటు ఆమ్లాను తేనెలో ఊరబెట్టుట వల్ల టేస్ట్ బడ్స్ ను మరింత ఊరిస్తుంటుంది . ఎందుకంటే స్వీట్ అండ్ సోర్ కాంబినేషన్ ఒక ప్రత్యేకమైన కమ్మని రుచిని అందిస్తుంది . ఈ హాని అండ్ ఆమ్లా కాంబినేషన్ ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం ద్వారా మరిన్ని ఎఫెక్టివ్ ప్రయోజనాలను పొందవచ్చు. తేనె తో పాటు ఆమ్లాను కూడా అలాగే తినేయవచ్చు.
తేనెతో 20 వైద్యపరమైన ఆరోగ్య ప్రయోజనాలు.!
తేనె మరియు ఆమ్లా కాంబినేషన్ లో , వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి . వాటిని చెప్పకుంటూ పోతే అంత ఉండదు . అంతే కాదు, వీటిన కాంబినేషన్ ప్రయోజనాలతో మ్యాజికల్ రిజల్ట్ ను పొందవచ్చు . అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక చిన్నజార్లో సగం వరకూ తేనె
పోసి అందులో ఆమ్లాను కడిగేసి, తేమ పూర్తిగా తుడిచేసి తేనెలో వేసి కొన్నిరోజులు లేదా నెలల పాటు నానబెట్టాలి. ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు.
పాలు మరియు తేనెలో 10 మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్
కొన్ని రోజుల తర్వాత సాఫ్ట్ గా ఉండే ఆమ్లాను మీరు గమనిస్తారు . ఇది చూడటానికి హోం మేడ్ జామ్ లాగా కనిపిస్తుంది. తేనెలో ఊరించిన ఆమ్లా వల్ల పొందే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలపడం జరిగింది. మరి అవేంటో తెలుసుకుందాం....

లివర్ ను బలోపేతం చేస్తుంది మరియు జాండిస్ ను నివారిస్తుంది:
తేనెలో ఊరించిన ఆమ్లాను ప్రతి రోజూ ఉదయం పరగడపు తీసుకోవడం వల్ల లివర్ హెల్తీగా ఉంచడంతో పాటు జాండిస్ ను నివారిస్తుంది . శరీరంలో మరియు కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్ మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది . దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది.

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది:
తేనెలో ఊరిచిన ఆమ్లాను ప్రతి రోజూ ఒక టీస్పూన్ తీసుకోవడం వల్ల మిమ్మల్ని యంగ్ గా కనబడేలా చేస్తుంది . ఇది శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీని అందవ్వడంతో పాటు శరీరంను కాంతివంతంగా ఉంచుతుంది . మరియు ఇది ముఖంలో ముడుతలు మరియు ఫైన్ లైన్స్ నివారిస్తుంది.

ఆస్తమా నివారిస్తుంది:
ఆమ్లా తినడం వల్ల ఆస్తమా, బ్రొకైటిస్ మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.వీటిలో ఉండే రిచ్ యాంటీయాక్సిడెంట్స్ వల్ల లంగ్స్ లో ఫ్రీరాడికల్స్ మరియు టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఫలితంగా లంగ్స్ కు రక్తప్రసరణ మెరుగుపడుతుంది . దాంతో ఆస్తమా అటాక్ కాకుండా ఉంటుంది.

దగ్గు, జలుబు మరియు గొంతు ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది:
ఒక టేబుల్ స్పూన్ ఆమ్లా అండ్ హని మిశ్రమం దగ్గు మరియు జలుబు నుండి తీవ్ర ఉపశమనం కలిగిస్తుంది . గొంతు నొప్పిని నివారిస్తుంది . ఇందులో కొద్దిగా అల్లం రసాన్ని చేర్చడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఆమ్లా , హాని లో దాగి ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది:
తేనెలో ఊరించిన ఉసిరికాయ కాంబినేషన్ అజీర్తి మరియు ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. అంతే కాదు ఈ కాంబినేషన్ ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హానీ మరియు ఆమ్లా కాంబినేషన్ లో ఊరిన ద్రవాన్ని త్రాగడం ల్ల మలబద్దకం నుండి మరియు పైల్స్ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది .

శరీరంలోని టాక్సిన్స్ ను నివారిస్తుంది:
తేనె మరియు ఉసిరి యొక్క కాంబినేషన్ శరీరలోని టాక్సిన్ ను తొలగించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది . ఇంకా శరీరంలో డ్యామేజ్ అయిన అన్ని ప్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. ఇది బరువు పెరగకుండా మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు గురికాకుండా చేస్తుంది . తేనె ఉసిరి కాంబినేషన్ ద్రవాన్ని తాగడం , తేనె లోఊరించిన ఆమ్లా తినడం వల్ల ప్రేగుల్లో మరియు రక్తంలో ఉన్న వ్యర్థాలన్నింటిని తొలగిస్తుంది.

వంధ్యత్వాన్ని నివారిస్తుంది:
రెగ్యులర్ గా తేనెలో ఊరించిన ఆమ్లా తినడం వల్ల మహిళల్లో పీరియడ్స్ నొప్పిని నివారించి, ఫెర్టిలిటిని పెంచుతుంది . ఈ రెండింటి కాంబినేషన్ ఫలితంగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నవారికి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేలా సహాయపడుతుంది.

జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది:
తేనెలో ఊరించిన ఆమ్లా రసాన్ని జుట్టుకు అప్లై చేసి మాస్క్ లా వేసుకోవడం వల్ల జుట్టు స్మూత్ గా , షైనీగా మెరుస్తుంటుంది మరియు ఒత్తుగా పెరగుతుంది. ఇది జుట్టురాలడం తగ్గించి వీక్ గా ఉన్న జుట్టును మరింత స్ట్రాంగ్ గా మార్చుతుంది . ఈ కాంబినేషన్ ను కండిషనర్ గా కూడా అప్లై చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications