Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టే ఆయుర్వేదిక్ రెమెడీస్ ..!
రాత్రి నిద్ర సరిగా లేకపోతే, అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పనీ చేయబుద్ధి కాదు. మరి రాత్రి వేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే, మన ప్రవర్తనా తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటినిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. పరిశీలించండి.
సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లైతే.. కారణం లేకుండా నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. పడుకొన్న వెంటనే హాయిగా నిద్రపట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నపుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది.
నిద్రలేమి, లేదా సరిగ్గా నిద్రపట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్య మీ ఆహారంలో మార్పు చేసుకొని, భోజనంలో అమినొ ఆసిడ్ల మోతాదు సరిగ్గా చూసుకొంటే మీకు చక్కగా నిద్రపట్టే మార్గం లభించినట్టే.

చమోమెలీ టీ:
చమోమెలీ టీ ఒక ఫ్లేవరబుల్ టీ , రాత్రి నిద్రించడానికి ముందు ఒక కప్పు చమోమెలీటీ తాగితే నిద్రబాగా పడుతుంది, ఇది ఇరీరంను రిలాక్స్చేస్తుంది. అందుకే దీన్ని స్లీప్ టీ అని పిలుస్తారు.

యాలకలు-పాలు:
గ్రీన్ కార్డమమ్ మరియు పాలలో హెల్త్ బెనిఫిట్స్ అద్భుతంగా ఉన్నాయి. నిద్రపోవడానికి ముందు పాలలో కొద్దిగా యాలకల పొడిని మిక్స్ చేసి తీసుకోవడం వల్ల నిద్రబాగా పడుతుంది. నిద్రించడానికి 15నిముషాలు తాగడం వల్ల గుర క సమస్యలుండవు.

లికోరైస్ పౌడర్:
లికోరైస్ బాడీ స్ట్రెస్ ను తగ్గిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. శరీరంలో కణాలను ఉత్తేజపరుస్తుంది. లికోరైస్ పౌడర్ ను పాలతో మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మంచిగా నిద్రపడుతుంది.

పాలు దాల్చిన చెక్క పొడి:
మరో టేస్టీ డ్రింక్ , నిద్రలేమి సమస్యను నివారించడానికి ఎఫెక్టివ్ రెమెడీ. దాల్చిన చెక్క పౌడర్ తో డికాషన్ చేసి పాలతో మిక్స్ చేసి తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. బాగా నిద్రపడుతంది .

తేనె మిల్క్:
తేనె మరియు పాల మిశ్రమం నిద్రబాగా పట్టేలా చేస్తుంది. బాగా నిద్రపట్టాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. గోరువెచ్చని పాలలో తేనె మిక్స్ చేసి, అంతర్గతంగా బాడీ టెంపరేచర్ ను పెంచుకోవాలి. ఇది బాడీని రిలాక్స్ చేస్తుంది. తేనెలో ఉండే అమినోయాసిడ్స్ స్లీప్ సైకిల్ ను రెగ్యులేట్ చేస్తుంది.

బ్రహ్మి ఆయిల్:
బ్రహ్మీ ఆయిల్లో రిలాక్సింగ్ ప్రొపర్టీస్ ఉన్నాయి. ఇవి మైండ్ ను ప్రశాంతపరుస్తుంది. నిద్రించడానికి ముందు కొద్దిగా బ్రహ్మి ఆయిల్ ను అప్లై చేయడం వల్ల ఇది నిద్ర లేమి సమస్యను నివారిస్తుంది. బాగా నిద్రపట్టించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ రెమెడీ.

మింట్ లీవ్స్:
స్ట్రెస్ తగ్గించి, బాగా నిద్రపట్టడానికి సహాయపడే ఆయుర్వేదిక్ రెమెడీ పుదీనా.మజిల్స్ రిలాక్స్ చేయడంలో నిద్రబాగా పట్టడానికి పుదీనా బాగా సహాయపడుతుంది.

అశ్వగంద పౌడర్:
నిద్ర బాగా పట్టాలంటే ఆశ్వగంద పౌడర్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది నిద్రలేమి సమస్యలను నివారిస్తుంది.

మస్టర్డ్ ఆయిల్:
ఆవనూనెను పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నిద్రబాగా పడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, మజిల్స్ రిలాక్స్ చేస్తుంది. దాంతో రాత్రుల్లో నిద్రబాగా పడుతుంది.

జీలకర్ర:
నిద్రలేమి సమస్యలను నివారించడంలో మరో నేచురల్ రెమెడీ. జీలకర్ర పొడికి కొద్దిగా అరిటిపండు గుజ్జును మిక్స్ చేసి తీసుకుంటే మంచి నిద్రపడుతుంది.



Click it and Unblock the Notifications