Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలర్ట్ : బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఇలా ఉంటాయి..స్వయంగా మీరే చెక్ చేసుకోండి..!!
ప్రతి ఒక్క మహిళ క్యాన్సర్ కు కారణమయ్యే లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించుకోవాలి. క్యాన్సర్ సెల్స్ ను ట్రీట్మెంట్ లేదా సర్జరీ ద్వారా శరీరం నుండి దూరం చేసుకోవాలి.అయితే ఈ విషయంలో అందరూ అద్రుష్ట
మహిళలకు వచ్చే డిజార్డర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొంత మంది మహిళల్లో మాత్రమే వస్తుంది. కొంత మంది మహిళలకు అందించిన చికిత్స వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ నివారణలో సక్సెస్ ఫుల్ గా నివారించుకోగలిగారు . అయితే దురద్రుష్టవశాత్తు అదే గ్రూప్ లో కొంత మంది బ్రెస్ట్ క్యాన్సర్ ను నయం చేసుకోలేకపోయారు . వీరు రికరెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సారి నయం అయిన తర్వాత తిరిగి వస్తుందని తెలుసుకోవడం ఎలా ? రికరెర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కు కొన్ని లక్షణాలున్నాయి. ఈలక్షణాల బట్టి, పేషంట్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా తిరిగి వస్తుందని తెలిపే లక్షణాలు కొన్ని ఉన్నాయి.
కాబట్టి, ప్రతి ఒక్క మహిళ క్యాన్సర్ కు కారణమయ్యే లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించుకోవాలి. క్యాన్సర్ సెల్స్ ను ట్రీట్మెంట్ లేదా సర్జరీ ద్వారా శరీరం నుండి దూరం చేసుకోవాలి.అయితే ఈ విషయంలో అందరూ అద్రుష్టవంతులు కాలేకపోవచ్చు. కొంత మంది మహిళల్లో సర్జరీ తర్వాత తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది . ఇటువంటి పరిస్థితి మరింత బాధకరమైనది.
ఇది కేవలం ఫిజికల్ పెయిన్ మాత్రమే కాదు, మానసికంగా దెబ్బతీస్తుంది. చికిత్సలో ఉన్నప్పుడే మరింత హానికలిగిస్తుంది. కాబట్టి, బ్రెస్ట్ క్యాన్సర్ (మాస్టెక్టమీ లేదా లపెక్టమీ) కు సర్జరీ చేయించుకున్న తర్వాత డాక్టర్ వద్దకు రెగ్యులర్ గా వెలుతుండాలి. డాక్టర్ చెకప్ తో పాటు, సరైన డైట్ , వ్యక్తిగత పరిశీలను ఇక ముందు తిరిగి రాకుండా నివారించుకోవచ్చు.
బ్రెస్ట్ క్యాన్సర్ నివారించుకోవడానికి ముందుగా గుర్తించదగిన కొన్ని సాధారణ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. బ్రెస్ట్ లో కొత్త కణతులు:
బ్రెస్ట్ క్యాన్సర్ ముందు చికిత్స లేదా సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రారంభ దశలో క్యాన్సర్ గడ్డ లేదా కణితి కొత్తగా ఏవైనా ఏర్పడినాయో లేదో మహిళ సెల్ఫ్ ఎగ్జామినేషన్ తో తెలుసుకోవాలి.

2. క్యాన్సర్ గడ్డలున్న రొమ్ముల మీద చర్మం మార్పు:
మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ఫ్ ఎక్సామిన్ చేసుకునే సమయంలో గమనించాల్సిన విషయం బ్రెస్ట్ మీద చర్మ రంగులో ఏవైనా మార్పులున్నట్లైతే, చాలా జాగ్రత్తగా గమనించి వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కు ఒక ప్రధాన లక్షణం.

3.నిప్పల్ డిశ్చార్జ్:
సర్జరీ తర్వాత చను మొనల్లో ద్రవాలు శ్రవించడం అత్యంత ప్రమాదకరం. దీన్ని వెంటనే గమనించి డాక్టర్ ను కలవాలి.

4. భుజాల క్రింది బాగంలో వాపు:
క్యాన్సర్ కణితులున్న రొమ్ముకు దగ్గరలో ఉండే భుజం క్రింద వాపు కనిపిస్తుంది. వాపులను జాగ్రత్తగా గమనించాలి .

5. మెడ మీద వాపు:
కొన్ని నెలల తర్వాత మెడ మీద వాపు లేదా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెడ మీద వాపు గమనించినట్లైతే చాలాజాగ్రత్తగా ఉండాలి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కు మరో లక్షణంగా గుర్తించి వెంటనే డాక్టర్ ను కలవాలి.

6. దగ్గు:
బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స తీసుకునే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ దగ్గుతున్నట్లైతే ఇది అత్యంత ప్రమాదకరం.

7. శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండటం:
మొదట ఒక సారి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదా సర్జరీ చేయించుకున్న తర్వాత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంటే, వెంటనే వైద్యులను కలవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి రావడానికి ఇది మరో లక్షణం కావచ్చు.

8. బరువు తగ్గడం:
బ్రెస్ట్ క్యాన్సర్ కు మరో లక్షణం బరువు తగ్గడం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో అకస్మాత్ గా క్రమంగా బరువు తగ్గిపోతారు.

9. తీవ్ర తలనొప్పి:
బ్రెస్ట్ క్యాన్సర్ కు మరో కామన్ లక్షణం తీవ్ర తలనొప్పితో బాధపడుతారు. తలనొప్పి ఎలాంటిదైనా నిర్లక్ష్యం చేయకూడదు.

10. ఆకలి తగ్గిపోతుంది:
ఆకలి అనిపించదు. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారిలో సెడన్ గా ఆకలి తగ్గిపోతుంది. కాబట్టి, ఇటువంటి లక్షణాలు కనబడిన వెంటనే వైద్యుడిని కలవడం మంచిది.



Click it and Unblock the Notifications