Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
దంతాలు తెల్లగా మెరవడానికి ఫాలో అవ్వాల్సిన హైజీనిక్ టిప్స్..!
దంతాలు అందంగా...ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఉదయం మరియు రాత్రి నిద్రించడానికి ముందు బ్రెష్ చేస్తే సరిపోదు. దంతాలు ఆరోగ్యంగా ఉండటం కోసం మరో హైజీనిక్ టిప్ ఏంటంటే ఇది వ్యాయామం. దీన్ని రెగ్యులర్ గా , డైలీ హ్యాబిట్స్ లో ఒకటిగా చేర్చుకుంటే సులభంగా ఉంటుంది.
ఫలితం ఎక్కువగానే ఉంటుంది. డెంటల్ హైజీన్ వల్ల దంత, చిగుళ్ల సమస్యలను మరియు దంతక్షయాన్ని నివారిస్తుంది.. దంతాలనొప్పి, వాపు, రూట్ కెనాల్ పెయిన్, ఇతర దంత సమస్యలను నివారించడంలో శుభ్రత పాటించడం చాలా అవసరం . మీ దంతా గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి . దంతాల మీద చూపించే నిర్లక్ష్యం వల్ల దంతాల నొప్పివాపులను ఇతర సమస్యలకు కారణమవుతుంది.దంత సమస్యలు లేకుండా ఉండాలంటే కొన్ని హైజీనిక్ టిప్స్ ఈక్రింది విధంగా..

టూత్ బ్రష్ ను రెగ్యులర్ గా మార్చాలి. దంతాల మద్యపాచి తొలగించాలి, ముందర పళ్ళు మాత్రమే కాదు, పోలిపళ్ళు కూడా శుభ్రం చేయాలి. భోజనం చేసిన ప్రతి సారి బ్రష్ చేయడం మర్చిపోకూడదు . అలాగే మౌత్ వాష్ ఉపయోగించాలి. దీని వల్ల నోట్లో..దంతా మద్య చిక్కుకున్న ఆహారాలను పూర్తిగా తొలగిస్తుంది.

పౌష్టికాహారాలను తీసుకోవాలి: న్యూట్రీషియన్స్ క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. హెల్తీ సలాడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ మంచి వని చాలా మంది అనుకుంటారు. సాప్ట్ డ్రింక్స్ మంచిది కాదు. స్వీట్స్ ను పూర్తిగా తగ్గించాలి. భోజనానికి ముందు నీరు తాగడం మంచిది.

షుగర్ ఫుడ్స్ కు దూరంగా: స్వీట్స్, క్యాండీబార్స్, బిస్కెట్స్, పాస్ట్రీ ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్న దంతాలకు ఎనిమీస్ . మీల్స్ కు మద్య స్నాక్స్ తినాలనిపిసతే వెజిటేబుల్స్, లోషుగర్ ఫుడ్స్, లోసోడియం క్రాకర్స్ తీసుకోవాలి.

పసుపుపచ్చని దంతాలు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. దంతాల మీద మరకలు చూడటానికి చాలా బ్యాడ్ గా కనిపిస్తాయి. ఈ సమస్యలను నివారించుకోవడానికి బేకింగ్ పౌడర్ తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. టూత్ పేస్ట్ కు ఉప్పు చేర్చి బ్రెష్ చేయాలి.

సంవత్సరానికొకసారైనా డెంటిస్ట్ ను కలిసి దంతాలను శుభ్రం చేయించుకోవాలి. డెంటిస్ట్ పాచిని తొలగించి, వేరే ఇతర సమస్యలుంటే చికిత్సనందిస్తారు. ఇంకా దంతాలకు పాలిష్ పెట్టవచ్చు . దాంతో దంతాల్లో మరింత తెల్లగా మిళమిళ మెరుస్తుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications