Latest Updates
-
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి! -
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త డేంజర్.. కేఫ్‌కు వెళ్తే లక్షల్లో బిల్లు, జాగ్రత్త! -
తింటే స్వర్గమే అనిపించేంత రుచి..కేవలం 10 నిమిషాల్లో చేసుకునే టమాటో రైస్..ఇలా చేసుకోండి -
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ!
మీరు ప్రీ-డయాబిటీస్ తో బాధపడుతున్నారా ..?
మీరు ప్రీ- డయాబిటీస్ నుండి బాధపడుతుంటే, మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయి మధుమేహంతో బాధపడుతున్న వారికంటే ఎక్కువ కాకపోయినా సాధారణం కంటే ఎక్కువ స్థాయిని కలిగి ఉంటారు.
మీరు ప్రీ- డయాబిటీస్ నుండి బాధపడుతుంటే, మీ రక్తంలోని గ్లూకోస్ స్థాయి మధుమేహంతో బాధపడుతున్న వారికంటే ఎక్కువ కాకపోయినా సాధారణం కంటే ఎక్కువ స్థాయిని కలిగి ఉంటారు. మీరు దీనికి తగిన చికిత్స తీసుకోకపోతే, ఈ ప్రీ- డయాబిటీస్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి 2 రకాల సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, ప్రీ- డయాబిటీస్ ని పూర్వస్థితికి తీసుకు రావచ్చు. ముందుగా మనం ఈ మధుమేహా౦ రావడానికి కారణాలు ఏమిటి, దీన్ని గుర్తించడం ఎలా అనే విషయాలను అర్ధం చేసుకోవాలి.
ప్రీ- డయాబిటీస్ సంకేతాలు 2 వ రకం మధుమేహ మెల్లిటస్ లానే ఉంటాయి, ప్రీ- డయాబిటీస్ 2 వ రకం మధుమేహానికి పురోగమించినట్టు సూచిస్తుంది.

మీరు ఆహరం తీసుకున్నపుడు మీ శరీరంలోని క్లోమం ఇన్సులిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది, అందువల్ల శరీరంలోని కణాలు రక్తం నుండి చక్కర స్థాయిలను తీసుకుని, శరీర కణాలకు శక్తిని అందచేస్తాయి. ప్రీ- డయాబిటీస్ ఉన్న వారి శరీర కణాలు ఇన్సులిన్ కి సరిగా స్పందించవు.
మాయో క్లినిక్ ప్రకారం, ప్రీ- డయాబిటీస్ అనేది జీవన విధానం, జన్యుశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. అధిక బరువు, ఎప్పుడూ ఒకేచోట కూర్చుని పనిచేసే వారికి మధుమేహం ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రీ- డయాబిటీస్ ఎవరికైనా రావచ్చు; అయితే, అనేక అంశాలు మీ అసమానతలను పెంచుతాయి.

మీరు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారైతే లేదా BMI ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉంటే, మీ వైద్యుడు మిమ్మల్ని ప్రీ- డయాబిటీస్ చికిత్స చేయించుకోమనవచ్చు.
ఖచ్చితమైన విశ్లేషణ కోసం రక్త పరీక్ష చేయాల్సిన అవసరం మీ వైద్యునికి ఉంటుంది.
పరీక్ష కోసం, మీ వైద్యుడు మీకు 8 గంటలు లేదా రాత్రంతా ఉపవాసం ఉండమని చెప్తాడు. డేసిలీటర్ కి 100-125 మిల్లీగ్రాముల బ్లడ్ గ్లూకోస్ స్థాయి ప్రీ- డయాబిటీస్ ని సూచిస్తుంది.

మీ వైద్యుడు రెండుసార్లు మీ రక్తంలోని చక్కర స్థాయిలను పరీక్ష చేస్తాడు, మీరు అతని దగ్గరకు వెళ్ళినపుడు ఒకసారి, మీరు తీపిపదార్ధాలు తీసుకున్న రెండు గంటల తర్వాత ఇంకోసారి. రెండు గంటల తరువాత రక్తంలోని చక్కర స్థాయి 140-199 mg/dL ఉంటే, ఆ పరిక్ష మీకు IGT లేదా ప్రీ- డయాబిటీస్ ఉన్నట్టు సూచిస్తుంది.

మీరు చేయించుకున్న పరిక్షలో రక్తంలోని చక్కర స్థాయి సాధారణంగా ఉంటే, మీరు మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. మీకు ప్రీ- డయాబిటీస్ ఉన్నట్టు తెలిస్తే, మీ వైద్యుడు మీకు పన్నెండు నెలలకు ఒకసారి లేదా అంతకంటే ముందే మీ రక్తంలోని చక్కర స్థాయిని పరీక్ష చేస్తాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.




Click it and Unblock the Notifications