Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
క్యాల్షియం వల్ల ఎముకలకు ఎంత లాభమో...ఎక్సెస్ అయితే అంతే నష్టము..
క్యాల్షియం.. దీని ప్రాధాన్యం గురించి మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఎందుకంటే ఇది లోపిస్తే వచ్చే సమస్యలు మహిళల్లోనే అధికం. ఇటు ఇల్లు, అటు ఆఫీసు- విపరీతమైన పని ఒత్తిడితో అలసిపోతుంటారు. దంత సమస్యలు మరియు కాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటాం. దీనికి కారణం- క్యాల్షియం లోపమే!
క్యాల్షియం మన ఎముకల, దంతాల పటుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగా పనిచేయటానికీ ఇది తోడ్పడుతుంది. మరియు బ్లడ్ ప్రెజర్ కండీషన్ ను పెంచుతుంది. అలాగే హెల్తీ బ్రెయిన్ మరియు కార్డియో వాస్కులర్ సిస్టమ్ ను హెల్తీగా ఉంచుతుంది. క్యాల్షియం లోపించడం వల్ల వివిధ రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా, ఎముకలు, దంత సమస్యలు ఓస్టిరియోఫోసిస్ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.
గర్భిణి స్త్రీలు ఖచ్చితంగా తినాల్సిన కాల్షియం ఫ్రూట్స్
క్యాల్షియం తగ్గిపోవడం వల్ల ముఖ్యంగా ఎముకలు పటుత్వం కోల్పోతాయి. తొందరగా పెలుసుబారిపోతాయి. మరియు దంతసమస్యలు మొదలవుతాయి. ఫలితంగా అవి తొందరగా విరిగిపోయే ప్రమాదం ఉంది. 35 సంవత్సరాలు దాటిన మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే పెద్దవాళ్లు రోజుకి వెయ్యి మిల్లీగ్రాముల క్యాల్షియం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
పెరిగే పిల్లల కొరకు 15 బెస్ట్ క్యాల్షియం రిచ్ ఫుడ్స్
క్యాల్షియం ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే పాలు ఇష్టం లేనివారు, లాక్టోజ్ పడనివారి సంగతేంటి? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరి. వీటితో క్యాల్షియంతో పాటు ఇతరత్రా విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి.
మరి శరీరంలో క్యాల్షియం ఎక్కువైతే ఎమవుతుంది. మన శరీరానికి పరిమితికి మించి ఏది తీసుకొన్నా దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎముకల మీద నెగటివ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా తీసుకొన్నా, మన శరీరానికి ఎంత అవసరం అవుతుందో అంత మాత్రమే ఉపయోగించుకుంటుంది. పరిమితికి మించినప్పుడు అది వేరే విధంగా ఆరోగ్యం మీద సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తుంది. మరి శరీరంలో క్యాల్షియం అధికమైతే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురౌతాయో చూద్దాం...
కండరాల సలుపులు, నొప్పులను నివారించే హెల్తీ ఫుడ్స్...
క్యాల్షియం ఎక్కువతై కలవర పెట్టే విషయాలు....

1.హైపర్ క్యాల్షీమియా:
రక్తంలో క్యాల్షియం అధికంగా ఉన్నప్పుడు హైపర్ క్యాల్షీమియా ఎదురవుతుంది . ఇది ప్యారాథైరాయిడ్ గ్రంథుల యొక్క పనితీరుమీద ప్రభావం చూపుతుంది. ఈ గ్రంథులు రక్తంలో క్యాల్షియం లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ప్యారా థైరాయిడ్ హార్మోన్స్ మీద కొన్ని టెస్ట్ లను జరిపి తెలుసుకుంటారు.

2.ఆకలి:
శరీరంలో క్యాల్షియం లెవల్స్ పెరిగితే , ఆకలికి కారణం అయ్యే ఫాస్ఫేట్ కు,ఆకలికి మద్య సంబంధం ఉంటుంది. ఇది క్యాల్షియం ఫాస్పేట్ ఎముకల్లో స్టోన్ లా మార్పు చెందుతుంది. దాంతో ఎముకలు పెళుసుగా మారడం మరియు సులభంగా బ్రేక్ అవ్వడం జరుగుతుంది.

3.మెగ్నీషియంను తగ్గిస్తుంది:
క్యాల్షియం కూడా పరిమితంగా తీసుకోవాలన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు . అయితే మోతాదుకు మించి తీసుకోవడం శరీరానికి అంత మంచిది కాదు. ఒక రోజుకు 2500మిల్లీగ్రాముల మించి తీసుకోకూడదు. క్యాల్షియం అధికమైతే ఎముకల ఆరోగ్యానికి మంచిదే అయినా, మెగ్నీషియంను తగ్గించడం వల్ల తిరిగి ఎములకు ప్రమాధకరంగా మారుతుంది.

4.ఓస్టిరియోఫోసిస్:
ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం అధికంగా అవసరం అవుతుంది. క్యాల్షియం పరిమితికి మించితే ఓస్టిరియోఫోసిస్ సమస్య ఎదురవుతుంది తగ్గినా ఇదే సమస్య. సాధారణంగా ఇది ఒక జనటిక్ కండీషన్. కొత్త ఎముకల ఏర్పడటం మరియు పాత ఎముకలను విరిగిపోవడం మద్య అంతరాయం కలిగిస్తుంది.

5.విటమిన్ డి:
విటమిన్ డి లోపం వల్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ విటమిన్ లోపం వల్ల క్యాల్షియం ను సరిగా గ్రహించకపోవడం వల్ల ఎముకలు సాప్ట్ గా మారుతాయి. ఫలితంగా పరిస్థితి మరింత రిస్క్ లో పడుతుంది.

6.జాయింట్ పెయిన్స్ :
శరీరంలో క్యాల్షియం అధికంగా ఉన్నప్పుడు ఇది అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా స్కెలిటన్ సిస్టమ్ లో ఎముకల్లో మరియు జాయింట్స్ లో నొప్పి ఉంటుంది. ఎముకల్లో పొడవును, భుజాల క్రిందికి దిగజార్చుతుంది.

7.బ్రెయిన్ డ్యామేజ్:
ఇదే కాకుండా శరీరంలో ఎక్సెస్ క్యాల్షియం కిడ్నీ స్టోన్స్ మరియు బ్రెయిన్ డ్యామేజ్ కు కారణం అవుతుంది. అందువల్ల. అవసరం అయినంత మాత్రమే క్యాల్షియం ను తీసుకోవాలి.



Click it and Unblock the Notifications