Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
ఫ్లూ వ్యాక్సిన్ వల్ల టైప్ 2 డయాబిస్ పేంషట్స్ లో పక్షవాతం రాదు: స్టడీ రివీల్స్
టైప్-2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్లూ వ్యాక్సీన్ తీసుకుంటే స్ట్రోక్ మరియూ హార్ట్ ఫెయిల్యూర్ల వల్ల హాస్పిటల్లో చేరడాన్ని అరికట్టవచ్చని ఇటీవల ఒక అధ్యయనంలో నిరూపించబడింది.
ఈ వ్యాక్సీన్ తీసుకున్న వారిలో ఫ్లూ వల్ల సంభవించే మరణాల రేటు తీసుకోని వారిలో కంటే 24 శాతం తక్కువగా కూడా ఉందని కూడా ఈ అధ్యనంలో తేలింది.
ఇంపీరియల్ కాలేజీ లండన్ కి చెందిన రచయిత ఎజ్టర్ వామోస్ ఎమంటారంటే, "టైప్-2 డయాబెటీస్ ఉన్నవారిలోనే ఫ్లూ మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి.

ఈ వ్యాక్సీన్ టైప్-2 డయాబెటీస్ ఉన్న వారికి బాగా ఉపయోగరకంగా ఉంటుంది. దీనివల్ల ఫ్లూ సీజన్లో ఫ్లూ వల్ల మరణాల శాతాన్ని తగ్గించడమే కాకుండా స్ట్రోక్ లాంటివి రాకుండా కూడా కాపాడుతుంది.
టైప్-2 డయాబెటీస్ ఉన్న రోగులలో రక్తం లో చక్కెర శాతం అదుపులో ఉండదు.అందువల్ల వారు హృదయ సంబంధిత రోగాలయిన స్ట్రోక్ లాంటి వ్యాధుల బారిన పడే ఆస్కారం ఉంది.రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల రక్త నాళాలు దెబ్బతిని స్ట్రోక్ వస్తుంది.
హృదయ సంబంధిత వ్యాధులున్నవారిలో ఫ్లూ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది.
బ్రిటీష్ దేశానికి చెందిన 124,503 మంది టైప్-2 డయాబెటీస్ ఉన్న పెద్దవారిని ఈ అధ్యయనం కోసం 2003-2010 మధ్యలో పరిశీలించారు.వీరిలో 65 శాతం మందికి ఫ్లూ వ్యాక్సీన్ ఇచ్చారు.వ్యాక్సీన్ తీసుకున్న వారికంటే తీసుకోని వారే 30 శాతం అధికంగా స్ట్రోక్ తదితర హృద్రోగాలతో హాస్పిటల్లో చేరాల్సొచ్చింది.తీసుకున్న వారిలో హార్ట్ ఫెయిల్యూర్ 22 శాతం, నిమోనియా మరియూ ఇన్‌ఫ్లుయెంజా వల్ల హాస్పిటల్లో చేరేవారి శాతం 15 శాతం వ్యాక్సీన్ తీసుకోని వారికంటే తక్కువగా ఉందిట.
ఇంకా వ్యాక్సీన్ తీసుకున్న వారిలో మరణాల శాతం తీసుకోని వారి కంటే 24 శాతం తక్కువగా ఉంది.ఈ అధ్యయన ఫలితాలని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో (సీ.ఎం.ఏ.జే)లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications