Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
లూజ్ మోషన్ కు చెక్ పెట్టే పవర్ ఫుల్ హోం రెమెడీస్ ...
లూజ్ మోషన్ లేదా డయోరియా అంటే స్టూల్ నీళ్ళగా పాస్ చేయడాన్ని లూజ్ మోషన్ లేదా డయోరియాగా పిలుస్తారు. ఈ లూజ్ మోషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనే ఏదో ఒక సమయంలో అనుభవం కలిగి ఉండే ఉంటారు. లూజ్ మోషన్ తో బాధపడే వారు ఆబ్డోమినల్ పెయిన్ మరియు క్రాంప్స్ తో బాధపడుతుంటారు. లూజ్ మోషన్ సమయంలో శరీరంలోని ఇమ్యూనిటిని ఎక్కువగా కోల్పోవడం వల్ల లైఫ్ త్రెట్నింగ్ మారుతుంది . సరైన సమయంలో గుర్తించి శరీరానికి అవసరం అయ్యే ఫ్లూయిడ్స్ ను అందివ్వాలి.
లూజ్ మోషన్ వల్ల శరీరంలో నీరు మరియు ఎలక్ట్రోలైట్స్ పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. ఇలా కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయని ఎడల శరీరం డీహైడ్రేషన్ కు గురి కావడం వల్ల లూజ్ మోషన్ మరింత తీవ్ర స్థితికి గురి చేస్తుంది . కాబట్టి, ఇలాంటి సమయంలో ద్రవాలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) తప్పనిసరిగా తీసుకోవాలి.
స్టూల్ ద్వారా కోల్పోయిన్ ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, మెగ్నీషియం మొదలగునవి )ORS((ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ద్వారా మన శరీరానికి అవసరం అయ్యే ఎలక్ట్రోలైట్స్ ను పుష్కలంగా అందిస్తుంది. పెద్దవారికి మాత్రమే కాదు పిల్లలకు కూడా దీన్ని అందివ్వొచ్చు. పిల్లల్లో డయోరియా లక్షణాలను నివారించి వారిని ప్రాణాపాయ స్థితి నుండి రక్షించవచ్చు.
డయోరియాకు ముఖ్య కారణం ప్రేగుల్లో ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఫుడ్స్, వాటర్ ద్వారా వ్యాప్తి చెందుతుంది . లూజ్ మోషన్ ఫుడ్ అలర్జీ, ఫుడ్ పాయిజన్, మరియు కొన్ని ఇతర యాంటీబయోటిక్స్ కూడా కారణం అవుతాయి.
ఐడియల్ గా చెప్పాలంటే లూజ్ మోషన్ ను వెంటనే స్టాప్ చేసుకోవడం కంటే ఈ నేచురల్ మెకానిజం నుండి శరీరంలోని టాక్సిన్స్ మరియు బ్యాక్టీరియాను పూర్తిగా బయటకు తొలగించాలి. కానీ అందుకు తగినంత ఫ్లూయిడ్స్ మరియు ఆహారాలు తీసుకోవాలి. అందువల్ల వీక్ నెస్ మరియు డీహైడ్రేషన్ ను నివారించుకోవచ్చు.
డయోరియాను నివారించే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఈ క్రింది లిస్ట్ లో అందివ్వడం జరిగింది.

1.అరటి పండ్లు:
లూజ్ మోషన్ సమయంలో అరటి పండ్లు తినడం వల్ల కోల్పోయిన్ పొటాషియం మరియు మెగ్నీషియంను తిరిగి పొందవచ్చు. వీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ అరటిపండ్లు తినడం వల్ల ఆ సమయంలో పొటాషియంతో పాటు ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది.

2.లెగ్యుమ్స్ మరియు పల్స్ :
లెగ్యుమ్స్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం వల్ల డయోరియాలో కోల్పోయిన శక్తిని మాల్ న్యూట్రీషియన్స్ ను తిరిగి పొందవచ్చు. లెగ్యుమ్స్ తో తయారుచేసిన సూప్స్ తీసుకోవడం మంచిది.

3.తేనె:
ఆరోగ్యపరంగా తేనెలో ఉండే ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, డయోరియా నుండి ఉపశమనం కలిగిస్తాయి. తేనెలో అర చెంచా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి గ్లాసు నీటిలో మిక్స్ చేసి తీసుకోవాలి. రోజులో రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

4.కోకనట్ వాటర్:
డయోరియా వల్ల వచ్చిన డీహైడ్రేషన్ నివారించడంలో కోకనట్ వాటర్ దిబెస్ట్ అని చెప్పవచ్చు . డయోరియా సమయంలో శరీరం నుండి కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను శరీరంలో తిరిగి భర్తీ చేయడం వల్ల కోకనట్ వాటర్ లోని ఎలక్ట్రోలైట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి

5.పెరుగు:
పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటేంది. వీటినే ప్రోబయోటిక్స్ అని పిలుస్తారు . ఈ మంచి బ్యాక్టీరియా గౌట్ ను హెల్తీగా ఉంచుతుంది మరియు డయోరియా నుండి ఉపశమనం కలిగిస్తుంది . పెరుగులో ఎక్కువ విటమిన్స్, మినిరల్స్ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి.

6.బట్టర్ మిల్క్ :
డైజెస్టివ్ సిస్టమ్ ను స్మూత్ చేస్తుంది . ఇందులో ఉండే అసిడిక్ నేచర్ వల్ల బ్యాక్టీరియా నాశనం అవుతుంది. మరియు బట్టర్ మిల్క్ వల్ల డీహైడ్రేషన్ తగ్గించుకోవచ్చు . అందులో కొద్దిగా సాల్ట్ మరియు పుదీనా వేసి తాగడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు.

7.వెజిటేబుల్ సూప్:
వివిధ రకాల వెజిటేబుల్స్ తో తయారుచేసిన వెజిటేబుల్ సూల్ లో విలువైన పోషకాలున్నాయి . ఇవి శరీరానికి ఎంతో అవసరం. ముఖ్యంగా డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఇవెంతో అవసరం . ఆరోగ్యం బాగోలేప్పుడు విటమిన్స్ మరియు మినిరల్స్ ఎంతో అవసరం అవుతాయి.

8.దానిమ్మ:
డయోరియాను ట్రీట్ చేయడంలో దానిమ్మ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. డయోరియా సమయంలో కోల్పోయిన విటమిన్స్ మరియు మినిరల్స్ దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి. . ఈ సమయంలో దానిమ్మగింజలు తినడం లేదా దానిమ్మ జ్యూస్ త్రాగడం చాలా అవసరం.

9.మెంతులు:
మెంతులను మెత్తగా పేస్ట్ చేసి వాటర్ లో మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు త్రాగడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది.

10.నిమ్మరసం:
250 గ్రాముల నీటిలో ఒక నిమ్మకాయ రసం కలిపి ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించి వడబోసి రోజుకు మూడుసార్లు తాగాలి. ఇలా చేస్తుంటే విరేచనాలు తగ్గిపోతాయి.

11.ఉల్లిపాయ:
ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగుతో కలిపి ఉదయం మూడుసార్లు, మధ్యాహ్నం మూడుసార్లు తినిపించాలి.

12.ఉసిరికాయ:
ఉసిరికాయలను నీటిలో మెత్తగా నూరి బొడ్డు చుట్టూ గుండ్రంగా అడ్డుకట్టగా వేసి దాని మధ్యలో అల్లంరసం నింపి కొంతసేపు ఉంచితే ఎడతెరిపి లేకుండా అయ్యే విరేచనాలు వెంటనే తగ్గుతాయి.

13.బచ్చలాకులను పెరుగు, దానిమ్మరసం:
బచ్చలాకులను పెరుగు, దానిమ్మరసంతో కలిపి కొంచెం ఎక్కువ నెయ్యిని వాటికి చేర్చి వండి తినిపించాలి. ఇలా చేయటం వల్ల నొప్పితో కూడిన బంక విరేచనాలు త్వరగా తగ్గిపోతాయి.

14.మెంతులను పెరుగుతో:
ఒక టేబుల్ స్పూన్ మెంతులను పెరుగుతో నానబెట్టి తాగితే అన్ని రకాల విరేచనాలు తగ్గిపోతాయి.

15.కరివేపాకు:
కరివేపాకులను ముద్దగా నూరి 1-2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.



Click it and Unblock the Notifications