Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
ఎలాంటి అలర్జీనైనా నివారించే మెడిసినల్ ఫుడ్స్ ..!
సహజంగా కొంత మంది తరచూ అలర్జీలకు గురి అవుతుంటారు. అలర్జీలు కూడా వివిధ రకాలుగా అటాక్ అవుతుంటాయి. అలర్జీ అంటే ఏమి? ఎందుకొస్తాయి ? అలర్జీలు అంటే మన శరీరానికి వంటనివి, మన శరీరం కొన్నియాక్టివిటిస్ కు రియాక్ట్ అవ్వవు. దీన్నే అలర్జెన్స్ గా పిలుస్తారు. కొన్ని అలర్జీలు మెడికల్ పరంగా అయితే, కొన్ని అలర్జీలు కీటకాలు కుట్టినప్పుడు, కొన్ని ఆహారాలు పడనప్పుడు, లాటెక్స్ , పెంపుడు కుక్కల బొచ్చు, మోల్డ్స్ , దుమ్ము మరియు ధూళి ఇవన్నీ కూడా అలర్జీలకు కారణమవుతుంది.
అలర్జీల యొక్క లక్షణాలు కొన్ని చర్మం మీద చూపెడితే మరికొన్ని ముక్కు, కళ్ళ మీద చూపెడుతాయి. స్కిన్ రాషెస్, వాపులు కూడా అలర్జీ లక్షణాలే.. . అలర్జీలకు కారణమేదైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సాధారణ అలర్జీలను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అవేంటో ఒక సారి తెలుసుకుందాం...

వెల్లుల్లి:
అలర్జీలకు కారణమయ్యే కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ను ఎదుర్కొనే గుణాలు వెల్లుల్లిలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, వెల్లుల్లి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇది అలర్జిక్ రియాక్షన్ తగ్గిస్తుంది. ఇంకా వెల్లుల్లిలో యాంటీ బయోటిక్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి .

పసుపు:
పసుపులో కుర్కిమిన్ అనే కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇది అలర్జీల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు కలిపిన పాలను తాగడం వల్ల అలర్జీ నుండి ఉపశమనం పొందవచ్చు . ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అలర్జీలకు వ్యతిరేఖంగా పనిచేస్తాయి.

అల్లం:
అలర్జీలకు వ్యతిరేకంగా పనిచేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఒక కప్పు జింజర్ టీ తీసుకోవాలి.

స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటోలో విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం మరియు బీటా కెరోటిన్ లు అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. బాగా మెత్తగా ఉడికించిన స్వీట్ పొటాటోను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

ఫిష్ :
చేపల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉన్నాయి. సాల్మన్ తినడం వల్ల కొన్ని బ్రీతింగ్ సమస్యలను మరియు లక్షణాలను నివారించుకోవచ్చు.

లెమన్ :
నిమ్మరసం శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది, ఇమ్యూనిటి పెంచుతుంది. అలర్జీలను నివారిస్తుంది. రెగ్యులర్ డైట్ లో ఒక గ్లాసు లెమన్ జ్యూస్ తీసుకోవాలి.

గ్రీన్ టీ :
తరచూ అలర్జీలకు గురౌతుంటే ప్రతి రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవచ్చు.

ఆపిల్స్ :
ఆపిల్స్ లో క్విర్సిటిన్ అధికంగా ఉంటుంది. దీన్నే ఫ్లెవనాయిడ్స్ అని పిలుస్తాము. అలర్జీలకు వ్యతిరేఖంగా పోరాడే గుణాలు కలిగినది. కాబట్టి రెగ్యులర్ డైట్ రోజుకు ఒక్క ఆపిల్ చేర్చుకుంటే అలర్జీలను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications