Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
కషాయం(హెర్బల్ డికాషన్ ) తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
'కషాయం' ఈ పదం చాలా పాపులర్. ముఖ్యంగా సౌత్ ఇండియన్ విలేజస్ లో బాగా ప్రసిద్ది. కషాయం అంటే ఇది గొప్ప ఔషధగుణాలున్న పానీయం. నీటిలో ఏదైనా మూలికలు, లేదా మసాలా దినుసులు వంటివి వేసి, కాచి వడపోస్తే వచ్చే చిక్కటి ద్రవాన్ని కషాయం అంటారు. ముఖ్యంగా మందుల తయారీలో ఈ పద్ధతిని వాడతారు. ఉదా: మిరియాల కషాయం. చిక్కగా ఉండడం చేత ఇది చేదుగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. ఉదా: కాఫీ కషాయంలా ఉంది.
రెగ్యులర్ గా వచ్చే చిన్న చిన్న జబ్బులను సీజనల్ గా వచ్చే జబ్బులను నివారించడుకోవడానికి, జలుబు, దగ్గు, జ్వరం వంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం పొందడానికి కషాయాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. పురాతన కాలం నుండి ఇది బాగా వాడుకలో ఉన్న ఒక ఆయుర్వేద ఔషదం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఇది పురాతన కాలం నుండి బాగా పాపులరైనది.
ముఖ్యంగా సీజనల్ గా వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మరియు అనాగరోగ్య సమస్యలను నివారించడంలో ఇది ఒక ప్రాధమిక చిత్సవంటిది. ఈ హోం రెమెడి(కషాయం)ను తయారుచేయడం చాలా సులభం. దీన్ని టీ తయారుచేసినట్లే తయారుచేసుకోవాలి. తులసి, మిరియాలు, అల్లం, ధనియాలు, లవంగాలు, వేపాకు, పసుపు, యాలకలు, యూకలిప్టస్, లవంగాలు, కొన్ని మెడిసినల్ హెర్బ్స్..ఇంకా మరికొన్ని పదార్థాలతోటి, విడివిడిగా తయారుచేసుకుంటారు. వ్యాధిని బట్టి, పదార్థాలను ఎంపికచేసుకుంటారు. వీటితో తయారుచేసే కషాయాలు కొద్దిగా డిఫరెంట్ గా, వగరు లేదా చేదుగా ఉంటాయి. కానీ వీటిలో నయం చేసే గుణాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.
మొదట, పైన తెలిపిన పదార్థాల్లో ఏ ఒక్కదానితో డికాషాన్ లేదా కషాయం చేసుకోవాలన్నా..మొదట వాటిని పొడి చేసుకోవాలి. తర్వాత నీటిలో వేసి గా మరిగించాలి. డికాషన్ చిక్కబడే సమయంలో క్రిందికి దింపుకుని, వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఆయుర్వేదం ప్రకారం కషాయం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం....

1. ఫ్యాక్ట్ #1:
కషాయం ఎలా పనిచేస్తుంది. కషాయం కోసం ఎంపిక చేసుకొనే నేచురల్ లేదా హెర్బల్ పదార్థాల్లో ఉండే న్యూట్రీషియన్స్ ను వాటర్ గ్రహించడం వల్ల వ్యాధులను నయం చేసే గుణాలు పెరుగుతాయి. దాంతో సీజనల్ గా వచ్చే వ్యాధులను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు.

2. ఫ్యాక్ట్ #2:
మరో ప్రయోజనం. ద్రవాలను ప్రేగులు చాలా త్వరగా గ్రహిస్తాయి. మనం తీసుకొనే ద్రవాల్లో ఉండే న్యూట్రీషియన్స్ ను ప్రేగులు త్వరగా గ్రహించడం వల్ల జీవక్రియలను వేగవంతం చేసి, జబ్బులను, ఇన్ఫెక్షన్స్ ను త్వరగా నయం చేస్తుంది.

3. ఫ్యాక్ట్ #3:
ఆయుర్వేద రెమెడీస్ తో తయారుచేసే ఇలాంటి కషాయాలను ఉదయం పరగడుపున తీసుకోవడం మంచి సమయం. పరగడపున తాగడం వల్ల శరీరం న్యూట్రీషియన్స్ ను త్వరగా గ్రహిస్తుంది.

4.ఫ్యాక్ట్ #4:
ఉదయం తీసుకొనే కషాయంలో వెల్లుల్లి, అల్లం, లవంగాలు, లేదా ఇతర ఘాటైన మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల పొట్టకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి, ఇలాంటి వాటితో తయారుచేసే కషాయాలను భోజనం తర్వాత తీసుకోవడం మంచిది .

5. ఫ్యాక్ట్ #5:
మీరు తయారుచేసే ఎలాంటి డికాషన్ కైనా మసాలానలు జోడించాలి . ముఖ్యంగా రెండు పదార్థాలను ఉపయోగించేటప్పుడు సరైన కాంబినేషన్ ఎంపిక చేసి తయారుచేసుకోవాలి . రెండు జతచేయడంలో అనుమానం ఉన్నప్పుడు సింగిల్ పదార్థాలతోనే కషాయం తయారుచేసుకోవచ్చు.

6. ఫ్యాక్ట్ #6:
నేచురల్ పదార్థాలతో తయారుచేసే కషాయం తీసుకోవడం వల్ల సీజనల్ గా వచ్చే సాధారణ జలుబు, దగ్గు మరియు చిన్నపాటి జ్వరాలను నివారించుకోవచ్చు .

7. ఫ్యాక్ట్ #7:
అల్లం, పెప్పర్, జీలకర్ర , ధనియాలు వంటి వాటితో కషాయం చేసి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. జీర్ణ సమస్యలను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications