Latest Updates
-
పంచదార లేకుండానే అమృతం లాంటి సొరకాయ పాయసం..గిన్నెలు గిన్నెలు లేపేయడం గ్యారెంటీ! -
ఎండలు మండిపోతున్నాయి… పీరియడ్స్ సమయంలో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అసలు కారణం ఇదే! -
సమ్మర్ లో పండ్లు తినడానికి సరైన సమయం ఏది? ఈ తప్పులు చేస్తే గ్యాస్, కడుపు ఉబ్బరం! -
మే 6: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆకస్మిక ధనలాభంతో జీవితం మారిపోనుంది! -
మైసూర్ బోండా గుండ్రంగా, లోపల స్పాంజిలా రావాలంటే ఇలా చేయాల్సిందే! -
శివ-సిద్ధ యోగం: ఈ రాశుల వారికి రాజయోగం.. కెరీర్, ఆదాయంలో భారీ మార్పులు! -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బైరాగి వేషం' ఎందుకు వేస్తారు? ఈ వేషధారణ వెనుక ఉన్న అసలు రహస్యమిదే! -
నేటి శని దృష్టి: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్త.. గ్రహాల హెచ్చరిక ఇదే! -
మేషం, ధనుస్సు, సింహ రాశుల వారికి అద్భుతమైన యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 06 మే 2026 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
బాడీలో వాటర్ రిటెన్షన్ కారణంగా వాపులు, నొప్పులు తగ్గించే అద్భుతమైన హోం రెమెడీస్..!
వాటర్ రిటెన్షన్: శరీరంలో కొన్ని భాగాల్లో వాటర్ నిల్వ చేరడం వల్ల ఆ ప్రదేశంలో వాపు వస్తుంది. ఇలా నీటితో వాపు ఏర్పడటను వాటర్ రిటన్షన్ అని పిలుస్తారు. వాటర్ రిటెన్షన్ కు వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువైతే వాపులు కూడా ఎక్కువ అవుతాయి. దీన్ని ఎడిమా అని కూడా పిలుస్తుంటారు . మడమలు, కాళ్ళు, చేతులు, మరియు ముఖం వంటి భాగాల్లో లింఫాటిక్ సిస్టమ్ భాడీలోని వివిధ భాగాల్లో వాటర్ ను క్లియర్ చేయకపోవడం వల్ల వాపులకు దారితీస్తుంది.
బాడీ డిటాక్సిఫై చేస్తాయి బరువు తగ్గిస్తాయి ఈ డ్యూరిటిక్ ఫుడ్స్
కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, అలర్జీలు, విటిమన్ల లోపం, రక్త ప్రసరణ లోపాలు, హార్ట్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్ శరీరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరంలోని సోడియం నీటిలో కరిగిపోతుంది. దీన్నే డైజెషనల్ హైపోనెట్రీమియా అంటారు. అలాగే మెదడు, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, క్యాన్సర్ల వల్ల 'యాంటీ డయూరిటిక్ హార్మోన్'లో హెచ్చుతగ్గుల వల్ల సోడియంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ హార్మోన్ ఎక్కువైనప్పుడు శరీరంలో సోడియం లెవెల్ పడిపోతుంది. అప్పుడు వాటర్ నిల్వ చేరడం ఎక్కువ అవుతుంది.
గర్భిణీల కాళ్ళు వాపులను నివారించే సులభ చిట్కాలు
వాటర్ రిటన్షన్ కు వివిధ కారణాలు మరియు లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండవు. కొంత మందిలో దురద, వాపు, ఉబ్బరం, నొప్పి, హైబిపి, మరియు బరువు పెరగడం వంటి లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి . వాటర్ రిటెన్షన్ సమస్యను నివారించుకోవడానికి మొదట చేయాల్సింది హైడ్రేషన్, న్యూట్రీషియన్ మరియు వ్యాయామాలు చేయడం వల్ల చాలా వరకూ ఉపశమనం కలుగుతుంది. బాడీలో వివిధ పార్ట్స్ లో వాటర్ రిటెన్షన్ ను తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.జ..

1. రెమెడీ #1 :
ప్రతి రోజూ ఉదయం ఒకటి రెండు ఉల్లిపాయ రెబ్బలు నమిలి తినాలి. ఇది డ్యూరియాటిక్ లా పనిచేస్తుంది మరియు శరీరంలో ఎక్సెస్ వాటర్ ను తొలగిస్తుంది.

2. రెమెడీ #2 :
పార్ల్సే టీని రెగ్యులర్ గా తాగడం మంచిది. ఇందులో క్యాల్షియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ బిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ఎక్సెస్ వాటర్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

3. రెమెడీ #3 :
బార్లీ వాటర్ ఎక్సలెంట్ డ్యూరియాటిక్ జ్యూస్ లేదా గంజి. రెగ్యులర్ గా ప్రతి రోజూ బార్లీ వాటర్ తాగడం వల్ల బాడీలో వాపులు తగ్గిపోతాయి.

4. రెమెడీ #4 :
పైనాపిల్, వాటర్ మెలోన్ మరియు క్రాన్ బెర్రీ జ్యూస్ వంటి కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ డ్యూరియాటిక్స్ గా పనిచేసి ఎక్కువగా మూత్రవిసర్జనకు ప్రేరేపిస్తాయి. దాంతో శరీరంలోని వాటర్ భయటకు నెట్టివేయబడుతాయి. ఇలాంటి ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోవడంతో పాటు, శరీరంలో నీరు చేరకుండా చేస్తుంది.

5. రెమెడీ #5 :
లెమన్ వాటర్ ను తాగడం వల్ల కూడా శరీరంలోని ఎక్సెస్ ఫ్లూయిడ్స్ మరియు టాక్సిన్స్ తొలగిపోవడానికి సహాయపడుతుంది. ఒక కప్పు లెమన్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం మంచిది.

6. రెమెడీ #6 :
ఇది నమ్మడం కష్టమే, వాటర్ తాగడం వల్ల కూడా శరీరంలో ఎక్సెస్ వాటర్ తగ్గుతుందని అంటుంటారు. కొన్ని సందర్భాల్లో బాడీ డీహైడ్రేషన్ కు కారణమైనా కూడా వాటర్ రిటెన్షన్ కు దారితీస్తుంది. కాబట్టి, శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా నీరు తాగాలి.

7. రెమెడీ #7 :
బ్లాక్ బెర్రీస్, ద్రాక్ష, అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలో పొటాషియం లోపించడం వల్ల శరీరంలో వాటర్ రిటన్షన్ కు కారణమవుతుంది. పొటాషియం శరీరంలో వాటర్ మరియు సోడియంను బ్యాలెన్స్ చేస్తుంది.



Click it and Unblock the Notifications