Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సెక్స్ లో పాల్గొనకూడదనడానికి 7 రీజన్స్..!
సాధరణంగా ఆడపిల్లల్లో పెరిగేకొద్దీ ఎదురయ్యే సమస్యలే కాదు, జన్మతః వచ్చే మరికొన్ని లోపాల వల్ల ఇన్‌ఫెక్షన్లు కౌమారంలో అమ్మాయిలను ఇబ్బంది పెడతాయి. అలాంటి వాటిల్లో ముందు చెప్పుకోవాల్సింది మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు. సాధారణంగా మూత్ర విసర్జన సమయంలో హానిచేసే క్రిములు బయటకు పోతాయి. అయితే, కొన్నిసార్లు అవి మూత్రాశయంలో చేరిపోయి రెట్టింపు అవుతాయి. ఆ ప్రభావం మూత్రాశయంపై పడుతుంది. దాంతో మూత్రానాళ ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతాయి. దీనికి సరిగ్గా చికిత్స తీసుకోకపోతే ఆ ప్రభావం మూత్రాశయం, గర్భాశయంపైనా పడుతుంది. సమస్య పెరిగేకొద్దీ మూత్రపిండాలపైనా భారం తప్పదు. అయితే బ్యాక్టీరియాకు తోడు.. మరికొన్ని సమస్యలు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ని పెంచుతాయి.
మహిళల్లో జననేంద్రియాల్లో ఫంగస్ చేరడం వల్ల ఇన్‌ఫెక్షన్ తలెత్తుతుంది. దీనిని ఈస్ట్ ఇన్‌ఫెక్షన్(క్యాండిడియాసిస్) అంటారు. జననేంద్రియ భాగం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ భాగంలో ఈస్ట్, బ్యాక్టీరియా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈస్ట్ మోతాదుకు మించీ పెరుగుతుంది. దానికి కారణం లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా లోపించడమే. ఈ బ్యాక్టీరియా ఈస్ట్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఎప్పుడయితే అది లోపిస్తుందో.. అప్పుడు ఈస్ట్ విపరీతంగా పెరుగుతుంది. అది ఎందుకంటే..
కారణాలు: సాధారణ అమ్మాయిల్లోనే కాదు, కొందరు క్రీడాకారిణుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అలాగే జన్మతః లేదా చిన్న వయసులోనే మధుమేహం మొదలైనవారిలోనూ కనిపిస్తుందీ ఇన్‌ఫెక్షన్. ఏదయినా అనారోగ్యం కారణంగా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు లాక్టోబాసిలస్‌బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా ఈస్ట్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. రోగనిరోధకశక్తి తగ్గినప్పుడు కూడా ఈ సమస్య ఎదురుకావచ్చు.
లక్షణాలు.. జననేంద్రియభాగంలో విపరీతంగా దురద ఉంటుంది. దానికితోడు మంట కూడా బాధిస్తుంది. అలాగే మూత్రవిసర్జన సమయంలో మంటగానూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ఎర్రగా వాచి ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంటుంది. ఇటువంటి సమయంలో సెక్స్ లో పాల్గొనడం సురక్షితమేనా...? అని చాలా మంది మహిళలల్లో సందేహం కలుగుతుంది? అలాంటి వారిలో మీరు ఒకరైతే ? ఈ ఆర్టికల్ ఖచ్చితంగా చదవాల్సిందే...ఈస్ట్ ఇన్ఫెక్షన్ సమయంలో సెక్స్ లో పాల్గొనడానికి ముందు కొన్ని ఫ్యాక్ట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

ఫ్యాక్ట్ # 1 :
మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనకూడదని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడైనది. ఎందుకంటే అంతర్గతంగా ఉన్న ఇన్ఫెక్షన్ పార్ట్నర్ వ్యాపించే ప్రమాదం ఉంది. మహిళలో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవుతుంది.

ఫ్యాక్ట్ # 2 :
ఈస్ట్ ఇన్ఫెక్షన్ యోనిలో ఇరిటేషన్, దురద , మంట వంటి లక్షణాలకు గురిచేస్తుంది. అందువల్ల, ఇంటర్ కోర్స్ సమయంలో మరింత నొప్పికి దారితీయవచ్చు.

ఫ్యాక్ట్ # 3 :
ఈస్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు సెక్స్ లో పాల్గొనడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమౌతుంది. గాయం నయం అవ్వడానికి సమయం పడుతుంది. అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ నయమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

ఫ్యాక్ట్ # 4 :
ఈస్ట్ ఇన్ఫెక్షన్ పాట్నర్ కు వ్యాప్తి చెందవచ్చు. కాబట్టి, ఇది ప్రాణాపాయ స్థితికి గురిచేసే పరిస్థితి ఏర్పరుస్తుంది, పార్ట్నర్ కూడా మంట , దురద వంటి లక్షణాలు ఎదుర్కుంటారు.

ఫ్యాక్ట్ # 5 :
సెక్స్ లో పాల్గొన్న తర్వాత పార్ట్నర్ కూడా ప్రైవేట్ పార్ట్స్ లో నొప్పి లేదా రెడ్ నెస్ , దురద ఉన్నట్లు చెప్పినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవడం మంచిది.

ఫ్యాక్ట్ # 6 :
ఈస్ట్ ఇన్ఫెక్షన్ కు డాక్టర్ ను కలిసినప్పుడు, వారిచ్చే యాంటీ ఫంగల్ మెడిసిన్స్ మరియు క్రీములు ద్వారా ఈస్ట్ ఇన్ఫెక్షన్ నయం అవ్వడానికి కనీసం ఒక వారం రోజులు పడుతుంది.

ఫ్యాక్ట్ # 7 :
కొంత మంది మహిళలు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఫెర్టిలిటి మీద ప్రభావం చూపుతుందని అపోహపడతారు. అయితే అందుకు ఎలాంటి నిర్ధారణలు లేవని ఎక్సపర్ట్స్ సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications