Latest Updates
-
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్!
ఎర్లీ మార్నింగ్ ఇలా చేస్తే..ఇక ఆరోజంతా ఉత్సహాం...ఉల్లాసం..
జీవితం అంటే పొద్దున్నే ఆరాటంగా లేవటం..మన వాళ్లకోసం హాడావిడిగా పరుగులు పెట్టడం కానే కాదు. ఇలా చేసేవారు మన చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. కాని మనం నిద్ర లేచిన పద్దతిబట్టే ఆ రోజు ఆధారపడి ఉంటుందట. కాదని ఆదరాబాదరగా రోజును మొదలుపెడితే చేయబోయే పనులపై ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. రోజూ మన జీవితంలోకి తూర్పు కిరణాలతో సూర్యుడు ఉత్సాహంగా గుడ్ మార్నింగ్ చెప్పినట్టుగా మనం అంతే ఉత్సాహంగా ఉండాలి. మరి దానికోసం ఇలా చేయండి. ఉత్సాహవంతమైన వెలుగునే మీ మనసులో నింపుకోండి.

* పొద్దున్నే మేల్కోగానే ఫోన్లలో మాట్లాడడం, ఇమెయిల్స్ చెక్ చేయకండి.ఇవి కొన్నిసార్లు మూడ్‌ని పాడుచేస్తాయి.
* నిద్రలేవగానే ఓ జోక్ చదవడం, అద్దంలో మీ ముఖం చూసుకొని బలవంతంగానైనా 20సెకన్లు నవ్వండి.
* లేవగానే మీ ఇంట్లో వారికి గుడ్ మార్నింగ్ చెప్పడం వంటివి చెయ్యండి.
* నిద్రలేవగానే కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా కళ్లుమూసుకుని కూర్చొని, ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని వదిలితే ఈ అలవాటు శ్వాసక్రియతో పాటు మీ మూడ్స్‌ను ఉత్సాహంగా ఉంచుతుంది.
* రిలాక్సేషన్ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది.
* పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్, ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా ఉంచుతాయి. మనకు కొండంత ఎనర్జీని ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతాయి..
* ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది.
* నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే, ఆ అలవాటును అలవరుచుకోండి.
* రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మెలోడీ, భక్తి సంగీతం వినడం మంచిది. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











