Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
గోళ్లు తెల్లగా, పసుపు రంగులో ఉంటే.. ప్రాణాంతక వ్యాధులకు సంకేతమా?
గోళ్లు పేళవంగా మారితే..భయంకరమైన వ్యాధులకు సంకేతమా?
కొద్దిగా పింకిష్, తెలుపు రంగుల్లో కనిపిస్తుంటాయి మన గోళ్లు. కానీ గోళ్లలో కొద్దిగా మార్పు కనిపించినా.. కలర్ లో అయినా, గోళ్ల రూపంలో అయినా మార్పులు ఉన్నాయంటే.. వెంటనే గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు.. అనేక ప్రాణాంతకమైన వ్యాధులకు సంకేతాలు.
చాలామంది గోళ్లను చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. శరీరంలో మిగిలిన భాగాల్లాగే.. గోళ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. గోళ్లు కలర్ లెస్ గా మారతాయి, అలాగే పసుపు, తెలుపు రంగుల్లోకి మారుతుంటాయి. అంతేకాదు.. షేప్ లెస్ కూడా కనిపిస్తుంటాయి. ఒకవేళ మంచి షేప్ లో కట్ చేసినా కూడా సరిగ్గా కనిపించవు.
సాధారణంగా మనకు జ్వరం వచ్చినప్పుడు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు.. గోళ్ల రూపంలో, రంగులో కాస్త తేడా వస్తుంది. ఇది చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి సంకేతం. గుండె, థైరాయిడ్, లివర్, లంగ్స్, ఇమ్యునిటీ, అనీమియాకి సంకేతాలని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
మరి గోళ్ల రంగు ఎలా ఉంటే దేనికి సంకేతం. గోళ్లలో ఎలాంటి మార్పులను నిర్లక్ష్యం చేయకూడదో చూద్దాం.

ఎల్లో నెయిల్స్
మీ గోళ్లు లేత పసుపు రంగులోకి మారితే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కి మాత్రమే కాదు.. థైరాయిడ్ సమస్య, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్ కి సంకేతం.

వైట్ నెయిల్స్
మీ గోళ్లు తెల్లగా మారడం గమనించారంటే.. ముఖ్యంగా గోళ్ల చుట్టూ ఉండే చర్మం కూడా తెల్లగా మారిందంటే.. శరీరంలో ప్రొటీన్ తక్కువగా ఉందని సంకేతం. అలాగే.. కాలేయ వ్యాధులకు సంకేతం.

గోళ్లు చీలిపోవడం
కొన్నిసార్లు గోళ్లు చిట్లిపోవడం, చీలినట్టు కనిపించడం వంటి లక్షణాలు చూస్తుంటాం. ఇలాంటి సంకేతాలు.. థైరాయిడ్ వ్యాధికి సంకేతం. లేదా డయాబెటిస్ మరింత ముదిరిపోయినప్పుడు లేదా బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా లేనప్పుడు కనిపిస్తాయి.

గోళ్లపై బ్లూ లేదా బ్లాక్ లైన్స్
గోళ్లపై బ్లాక్ లేదా బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయంటే.. కాస్త అలర్ట్ అవ్వాల్సిందే. ఇది ఊపిరితిత్తుల సమస్య లేదా మెలనోమా లేదా స్కిన్ క్యాన్సర్ కి సంకేతం. చాలామంది ఇలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారు.

స్పూన్ షేప్ లో నెయిల్స్
ఒకవేళ మీరు ఐరన్ లోపం లేదా అనీమియాతో బాధపడుతుంటే.. గోళ్లు స్పూన్ రూపంలోకి అంటే పైకి లేచినట్టు మారతాయి. రక్తప్రసరణ చేతులకు సరిగా అందనప్పుడు ఇలాంటి సమస్య వస్తుంది. అలాగే.. థైరాయిడ్ లేదా గుండె సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా.. ఇలాంటి సమస్య కనిపిస్తుంది.

గోళ్లు పైకి ఉబ్బినట్టు
కొన్నిసార్లు గోళ్లు.. పైకి ఉబ్బినట్టు.. ఏర్పడతాయి. ఫింగర్ టిప్స్ చూట్టూ వంకరగా ఏర్పడతాయి. ఇలాంటి సంకేతం.. ప్రాణాంతకమైన లంగ్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లమ్, లివర్ డిసీజ్ లు, ఎయిడ్స్ కి హెచ్చరిక.

గోరంతా లైన్స్
గోరంతా.. లైన్స్ మాదిరిగా ఏర్పడి ఉంటాయి. ఇలాంటి లక్షణం జింగ్ లోపంతో బాధపడుతున్నారని సూచిస్తుంది. ఇలాంటి సమస్య జుట్టు రాలడానికి, తీవ్ర కంటి సమస్య, బరువు తగ్గడానికి, మానసిక సమస్యలకు సంకేతం.



Click it and Unblock the Notifications