Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న వాస్తవాలు
ప్రపంచాన్నే వణికిస్తున్న మహమ్మారి క్యాన్సర్. ఎవరికి, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎలాంటి లక్షణాలు లేకుండా.. హఠాత్తుగా బయటపడుతుంది. అది కూడా ఈ అవయవం, ఆ భాగం అని కాదు.. శరీరంలో ఎక్కడైనా వచ్చే అవకాశాలున్నాయి. చర్మం నుంచి కాలేయం వరకు మానవ శరీరంలోని ప్రతి భాగానికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది.
READ MORE: వరల్డ్ క్యాన్సర్ డే 2016: క్యాన్సర్ మహమ్మారిని హాంఫట్ చేసే ఆహారం...
ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మహిళలు, పురుషులు ఎవరికైనా ఈ క్యాన్సర్ ముప్పు ఉంది. అయితే ముందుగా సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నిద్ర ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు ఎక్కువమందితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం కూడా క్యాన్సర్ కి కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇండియాలో క్యాన్సర్ వ్యాధి ఎలా ప్రభలుతోంది, ఎలాంటి క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి వంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
ఒక్క ఇండియాలోనే 2014లో దాదాపు 11.2 లక్షల కేసులు గుర్తించారట.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
2014లోనే 4.91 లక్షల మంది క్యాన్సర్ తోనే చనిపోయినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
2012 నుంచి 2014 మధ్యలో క్యాన్సర్ మరణాలు 6 శాతం పెరిగినట్లు స్టడీస్ చెబుతున్నాయి.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
పురుషుల్లో ఎక్కువగా తల నుంచి మెడ భాగాలలో వస్తాయి. ఆ తర్వాత స్థానం లంగ్ క్యాన్సర్ ఎక్కువగా మగవాళ్లలో కనిపిస్తోందట.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
మహిళల్లో ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ వస్తున్నట్లు అధ్యయనాలు నిరూపించాయి. ఆ తర్వాత రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇది రెండో స్థానంలో ఉంది.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
ఎక్కువ క్యాన్సర్ కేసులు 30 నుంచి 70 ఏళ్ల వయసు మధ్యలో ఉంటున్నాయి.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
నాలుగేళ్ల నుంచి ఇండియాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఏడాదికి ఏడాది అంతకంతకూ క్యాన్సర్ పేషంట్స్ పెరుగుతున్నారు.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
2011లో 10 లక్షల 28 వేల 503 క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 2012లో 10 లక్షల 57 వేల 204 కేసులు, 2014లో 11 లక్షల 17 వేల 269 క్యాన్సర్ కేసులు గుర్తించారు.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
ఇండియాలో ప్రతి నిమిషానికి 2 కొత్త క్యాన్సర్ కేసులు గుర్తిస్తున్నారట. అంటే ఇండియాలో క్యాన్సర్ మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
ఇండియాలో రోజుకి 13 వందలకు పైగా పేషంట్స్ క్యాన్సర్ తో చనిపోతున్నారు.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
క్యాన్సర్ కి వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణం. హెచ్ పీవీ, ఈబీవీ, హెచ్ఐవీ, హెచ్ఎస్ వీ వంటి ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ కి ప్రధాన కారణాలు.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
కొంతమందికి వారసత్వ కారణాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇలా జెనెటిక్ రీజన్స్ ద్వారా బ్రెస్ట్, కోలన్, ఓవరీ క్యాన్సర్స్ వస్తాయి.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కి ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులు, వక్కపొడి కారణమవుతాయి.

క్యాన్సర్ గురించి ఇండియాను కంగారు పెడుతున్న ఫ్యాక్ట్స్
ఎక్కువమందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు ప్రొటెక్షన్ తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి.
చూశారుగా ఇండియాలో క్యాన్సర్ ఏ స్థాయిలో పెరుగుతోందో. కాబట్టి.. క్యాన్సర్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Click it and Unblock the Notifications