Latest Updates
-
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే..
డేంజర్: స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల బాడీలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ..
స్టెరాయిడ్స్ ఆరోగ్యానికి మంచివి కాదని అనేక వైద్య అధ్యయనాలు మరియు ప్రయోగాలు స్పష్టం చేసాయి. అయినప్పటికీ వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచించటానికి కొన్ని పరిస్థితులు ఉంటున్నాయి.
యుక్తవయస్సు మరియు బలహీనమైన టెస్టిక్యులర్ ఫంక్షన్ చికిత్స మరియు కండరాల చికిత్సలో వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నారు. కాబట్టి,శరీరంపై స్టిరాయిడ్స్ దుష్ప్రభావాలు ఏమిటి?
దీనిని చర్చించటానికి ముందు స్టెరాయిడ్స్ గురించి కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. సాదారణంగా స్టెరాయిడ్లు రెండు రకాలు ఉన్నాయి. శరీరాకృతిని పెంచే స్టెరాయిడ్లను కండరాలు నిర్మించడానికి క్రీడాకారులు వాడుతూ ఉంటారు. ఇక రెండోవది కార్టికోస్టెరాయిడ్స్. వీటిని చురుకుగా ఉన్న రోగనిరోధక శక్తి వ్యవస్థ స్పందనను తగ్గించటానికి వాడతారు.
స్టెరాయిడ్స్ శరీరానికి ఎందుకు ఇంజెక్ట్ చేస్తారు? స్టెరాయిడ్ లను నోటి ద్వారా తీసుకుంటే ప్రభావిత ప్రాంతంలోకి వెళ్ళుతుందని నమ్మకం లేదు.
ఇంజెక్షన్ ఖచ్చితంగా నొప్పి ఉన్న ప్రాంతంలోకి చేరుతుంది. అయితే శరీరానికి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ద్వారా దుష్ప్రభావాలు ఉన్నాయి.
వైద్యుడు యొక్క ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ కొనుగోలు మరియు అమ్మకం చట్టవిరుద్ధం. స్టెరాయిడ్ ఇంజక్షన్స్ వలన మొత్తం శరీరం నెగటివ్ ప్రభావానికి గురి అవుతుంది. పురుషులు మరియు స్త్రీల మీద ఈ మందులు ఘోరమైన ప్రభావాన్ని చూపవచ్చు.
ఏ అనారోగ్య సమస్యకు ఎలాంటి ఫుడ్ మెడిసిన్ లా పనిచేస్తుంది ?
AAS (అనబోలిక్-పురుషత్వ ప్రేరణ కలిగించే స్టెరాయిడ్స్) ని ప్రజలు చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తారు. ఇది వ్యాయామం మరియు కండరాల మాస్ నిర్వహించడానికి మరియు వారి సామర్థ్యాన్ని పెంచుతుందని నమ్మకం.
అయితే, వైద్య అధ్యయనాలు శరీరంలో స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ కారణంగా ప్రాణాంతక దుష్ప్రభావాలు ఉన్నాయని నిరూపించారు. శరీరంలో స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ దుష్ప్రభావాలు గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ వ్యాసాన్ని చదవండి.

ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది
ఇది హెపటైటిస్ మరియు HIV వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సైంటిఫిక్ పరిశోధనల ప్రకారం స్టెరాయిడ్ ఇంజక్షన్స్ భాగస్వామ్య సూదుల ద్వారా అంటువ్యాధులు వస్తాయని నిరూపణ జరిగింది. అలాగే స్టెరాయిడ్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

విపరీతంగా జుట్టు రాలుట
శరీరంపై స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ కీలక దుష్ప్రభావాలలో ఇది ఒకటి. పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఇంజెక్ట్ లేదా నోటి ద్వారా తీసుకున్న జుట్టు విపరీతంగా రాలిపోయి బట్టతలగా మారిపోతుంది.

మగవారి శరీరంలో మార్పులు
శరీరాకృతిని పెంచే స్టెరాయిడ్లు టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క సహజత్వంను బలంగా మార్చుతాయి. స్టెరాయిడ్ ఇంజెక్షన్ల కారణంగా పురుషులలో ఛాతీ అభివృద్ధి, బాధాకరమైన అంగస్తంభన, వృషణాలు కృంగిపోవటం, వీర్య కణాల సంఖ్య తగ్గిపోవటం మరియు వంధ్యత్వం వంటి మార్పులు వస్తాయి.

స్త్రీల శరీరంలో వచ్చే మార్పులు
మగవారిలోనే కాకుండా స్త్రీల శరీరం మీద కూడా అనేక స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ దుష్ప్రభావాలు ఉన్నాయి. శరీరాకృతిని పెంచే స్టెరాయిడ్లు తీసుకోవటం వలన ముఖం మరియు శరీరంపై జుట్టు అధికంగా పెరుగుట,స్త్రీగుహ్యాంకురము పెరుగుట,రొమ్ము పరిమాణాలు తగ్గుట,గాత్రంలో మార్పు మరియు మోటిమల వంటి మార్పులు వస్తాయి.

బౌతికపరమైన నష్టం
స్టెరాయిడ్స్ వలన అనేక బౌతికపరమైన ఇబ్బందులు వస్తాయి. యువత విషయంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు పెరుగుదల మీద ప్రభావితం చూపుతాయి. అంతే కాకుండా,కాలేయ కణితి మరియు తీవ్రమైన కాలేయ నష్టానికి గురి అవుతారు. చెడు కొలెస్ట్రాల్ మరియు గుండె వ్యాధులు పెరుగుతాయి.

మానసిక వ్యాధుల రిస్క్ పెరుగుతుంది
అవును, ఇది శరీరంపై స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ కీలకమైన దుష్ప్రభావాలలో ఒకటి. స్టెరాయిడ్ ఉపయోగించడం వలన మానసిక రుగ్మతకు కారణం అవుతుంది. వారిలో మూడ్ స్వింగ్స్,దుడుకు ప్రవర్తన మరియు హింస వృద్ధి పెరుగుతాయి. దాంతో వారు డిప్రెషన్ లోకి వెళ్ళవచ్చు.

వ్యసనం
యువత స్టెరాయిడ్స్ కు బానిస అవుతారు. యువకులకు ఉద్యోగం లేకపోతే స్టెరాయిడ్స్ కోసం నేరాలు చేయటానికి కూడా వెనకాడరు.



Click it and Unblock the Notifications