Latest Updates
-
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.!
పొట్టలో పేరుకున్న టాక్సిన్స్ తొలగించే.. ఎఫెక్టివ్ రెమెడీ..!
ఫ్లాక్స్ సీడ్స్, వెల్లుల్లి చాలా హెల్తీనే కాదు పొట్టలో పేరుకున్న టాక్సిన్స్ ని న్యాచురల్ గా తొలగిస్తాయి. పొట్టను న్యాచురల్ గా శుభ్రం చేసి ఇది పేగులలో ఉండే మైక్రోబ్స్, బ్యాక్టీరియాను తొలగిస్తాయి.
దుమ్ము, పొల్యూషన్ లో ప్రతిరోజూ తిరుగుతూ ఉంటారా ? బయట ఫుడ్ తింటూ ఉంటారా ? అయితే.. మీ శరీరం మలినాలతో నిండి ఉంటుంది. కాబట్టి.. వెంటనే శరీరాన్ని డెటాక్స్ చేయడం అవసరం. అది కూడా ఎఫెక్టివ్ అండ్ న్యాచురల్ హోం రెమెడీతో టాక్సిన్స్ ని బయటకు పంపవచ్చు.

మనందరికీ తెలుసు వాతావరణంలో.. చాలా మలినాలు ఉంటాయి. పీల్చే గాలి, తాగే నీళ్లు, తినే ఆహారం అన్నింటిలోనూ.. హానికారక మలినాలు ఉంటాయి. కాబట్టి.. అవి శరీరంపై దుష్ర్పభావం చూపుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలి.
టాక్సిన్ లెవెల్స్ ఈ మధ్య చాలా పెరిగాయి. అందుకే రకరకాల వ్యాధులు మనుషులను భయపెడుతూ ఉంటాయి. వంటింట్లో అందుబాటులో ఉండే వాటితోనే.. శరీరంలోని హానికారక టాక్సిన్స్ ని బయటకు తొలగించవచ్చని మీకు తెలుసా ? టాక్సిన్స్ తొలగించడం వల్ల.. మీ శరీరం హెల్తీగా ఉంటుంది. మరి ఈ రెమెడీ ఎలా మీ శరీరంలోని హానికారక టాక్సిన్స్ ని తొలగిస్తుందో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు
2 టీస్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్
2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు
ఫ్లాక్స్ సీడ్స్, వెల్లుల్లి.. చాలా హెల్తీనే కాదు.. ఇది పొట్టలో పేరుకున్న టాక్సిన్స్ ని న్యాచురల్ గా తొలగిస్తాయి. ఇవి పొట్టను న్యాచురల్ గా శుభ్రం చేస్తాయి. ఈ హోం రెమెడీ.. పేగులలో ఉండే మైక్రోబ్స్, బ్యాక్టీరియాను తొలగించి.. మీ పొట్టను హెల్తీగా, క్లీన్ గా ఉంచుతుంది.
ఈ మిశ్రమంలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అవి పొట్టకు పోషణ అందించడమే కాకుండా.. హెల్తీ డైజెస్టివ్ జ్యూస్ లను ఉత్పత్తి చేస్తాయి. మరి ఈ హోం రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

తయారు చేసుకునే విధానం
రెండు పదార్థాలను బ్లెండర్ లో వేసి.. కొన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టాలి. బాగా మెత్తటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకుంటే.. పొట్టలో టాక్సిన్స్ తొలగిపోయి హెల్తీగా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications