Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
బ్యాక్ బోన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే (తేలిక భంగిమ) సుఖాసనం
వెన్నునొప్పి, ఇది ముందు వృద్ధులకు వచ్చే ప్రధానమైన ఆరోగ్య సమస్య, ఇది ఇప్పుడు మధ్య వయసువారు, -యువకులలో కుడా ఈ సమస్య పెరుగుతుంది.
జీవన శైలి లో మార్పు, అంటే ఒకే భంగిమలో కూర్చుని ఆపకుండా పనిచేయడం లేదా ఎవరికైతే తరచుగా వంగి చేసే పనులు ఉంటాయో, వారు తరచుగా ఈ వెన్నునొప్పి నుండి బాధపడుతుంటారు.
అందుకని, మన వెన్నుని గట్టిపరచడం ఎలా, ఈ పనికి సంబంధించిన భంగిమ వెన్నుకి ప్రమాదం కలిగించదా?

వైద్యం, విటమిన్ల తోపాటు శారీరక వ్యాయామాలు కూడా వెన్నునొప్పి ని నియంత్రిస్తాయి. కానీ, అన్ని పద్ధతులలోకి వెన్ను నొప్పి నివారణకు శాశ్వత పరిష్కారానికి యోగా సహాయపడుతుంది.
సుఖాసన లేదా తేలికైన భంగిమ, ఇది వెన్నుని గట్టిపరిచి, మరింత శక్తివంతంగా చేస్తుంది.
సుఖాసన అనేది 'సుఖం' అనే సంస్కృత పదం నుండి వచ్చింది, దీనర్ధం తేలిక లేదా ఇష్టమైన అని, 'ఆసన' అంటే భంగిమ అని అర్ధం.
సుఖాసన అన్ని ఆసనాలలో కి తేలికైనది, దీనిని ఏ వయసు వారైనా చేయవచ్చు. దీనిని వైద్య ప్రయోజనాలకు కూడా ఉపయోగిస్తారు.
మొదటగా చేసేవారు, ప్రారంభంలో గోడను ఆధారంగా చేసుకోవాలి. ఎక్కువసార్లు దీన్ని చేయడం వల్ల నిదానంగా ఎటువంటి ఆధారం లేకుండా చేయగలుగుతారు.
అయితే, మీరు ఈ సుఖాసన ఫలితాలను పొందాలి అంటే, వీటిని చేసే పద్ధతిని తెలుసుకోవాలి.
సుఖాసన చేయడానికి ఒకదాని తరువాత ఒకటి చేసే పద్ధతి:

1.మీ పాదాన్ని ముందుకు వంచి నిటారుగా కూర్చోండి.
2.మీ మోకాళ్లను వెడల్పు చేసి, వంచి, మీ కాళ్ళను దూరంగా ఉంచండి.
3.మీ పాదం అవతలి భాగం నేలకు ఆన్చి ఉండాలి.
4.మీ పాద౦ వదులుగా ఉండాలి, మీ పాదానికి పెల్విస్ కి మధ్య తగినంత స్థలం ఉండాలి.
5.మీ అరచేతులు మీ వొళ్ళో ఉండాలి.
6.వెన్నుని బాలెన్స్ గా ఉంచుకోండి. మీ టైల్ బోన్, ప్యూబిక్ బోన్ నేల నుండి సమాంతర దూరంలో ఉండాలి.

7.మీ భుజాలను చక్కగా ఉంచండి.
8.సౌకర్యంగా ఉన్నంత సేపూ ఈ భంగిమలో కూర్చోండి.
9.క్రాసింగ్ భంగిమలో ఉన్న కాళ్ళను మధ్యలో అటూ ఇటూ మార్చుకోవచ్చు.
సుఖాసనం వల్ల ఇతర ప్రయోజనాలు:
మనసుకి ఉపశమనాన్ని ఇస్తుంది
శరీర కదలికలను మెరుగుపరుస్తుంది
రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
శక్తివంతంగా ఉన్న భావనను కలుగచేస్తుంది
జాగ్రత్తలు:
డిస్క్ సమస్యలు లేదా మోకాళ్ళు లేదా తొడలు దెబ్బతిన్నవారు ఈ ఆసనం చేసేటపుడు జాగ్రత్తగా ఉండాలి. యోగా నిపుణుడి శిక్షణలో ఈ ఆసనాన్ని చేయడం ఎల్లపుడూ మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications