Latest Updates
-
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది? -
ధనుస్సు, సింహం, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 07 మే 2026 -
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
వేసవి ఆరోగ్యం కోసం తీసుకోవల్సిన జాగ్రత్తలు
కాలం గడిచేకొద్దీ సూర్యుడి ప్రతాపం పెరుగుతోంది ఒకప్పుడు మండే ఎండలూ అంటే 35డిగ్రీలు దాటాలి. అదీ మే నెలలో మాత్రం ఉండేది కానీ, ఇప్పుడు మరింత ముందుగానే వేసవి మొదలవుతోంది. మార్చినుంచే భానుడు మరీ మండిపడుతున్నాడు. 40-48 వరకూ డిగ్రీల వేడి మామూలైపోతొంది. మన జీవన విధానమూ మారే ప్రకృతికి అనుగుణంగా మారక పోతే ప్రణాలకే ప్రమాదం రావొచ్చు. వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద ఉంచండి. ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. కానీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. కారణం.. అధిక ఉష్ణోగ్రత వల్ల, కలుషితమైన నీరు, ఆహారం వల్ల, వేడిని అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బుపడుతూ వుంటారు. అలా కాకుండా వేసవి సెలవులు ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
వేసవి వేడి తోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి చిట్కాలు:--

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.

సింపుల్ టిప్స్ తో వేసవిలో ఆరోగ్యం..ఉల్లాసం..
వేసవిలో భయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి

సమ్మర్ హెల్త్ కేర్ టిప్స్
ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications