Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఒక్క నెలలో బుడ్డ చెక్కిళ్ళలో ఫ్యాట్ ను కరిగించే సర్ ప్రైజింగ్ మార్గాలు..!!
సహజంగా ఎవరికైనా ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖం వాపుగా, బుగ్గులు ఉబ్బుగా, స్కిన్ టోన్ మెరుస్తూ కనబడుతుంది. అయితే ఈ వాపుకానీ, ఉబ్బుకొని ఉండటం కానీ కొద్ది సేపటి తర్వాత కనబడదు. క్రమంగా తగ్గిపోయి, నార్మల్ గా కనబడుతుంది. అయితే కొంత మందికి మాత్రం ముఖం ఎప్పుడూ , ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉబ్బుకుని ఉండటం, బుగ్గలు నిండుగా చబ్బీగా కనిపిస్తుంటే అద్దంలో చూసినప్పుడల్లా చిరాకుగా అనిపిస్తుంది? ఉబ్బుకున్న ముఖంను చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది? ఎందుకు ఇలా ముఖం వాచిందని మీలో మీరే ఆలోచిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కుంటున్నవారు, టోన్డ్ ఫేస్ పొందడానికి పరిష్కార మార్గం కోరుకుంటే, చీక్స్ ఫ్యాట్ (బుగ్గల్లో కొవ్వు)కరిగించుకోవాలనుకుంటే కొన్ని సర్ ప్రైజ్ చేసే మార్గాలున్నాయి. ఈ మార్గాలను అనుసరించడం వల్ల ఒక నెలలో బుగ్గలను కరిగించుకోవచ్చు.
ముఖంలో వాపు రావడానికి గల ముఖ్య కారణమేంటి? ఇటువంటి సమస్య కేవలం ఓవర్ వెయిట్ ఉన్న వారికి మాత్రమే కాదు, సన్నగా ఉన్న వారిలో కూడా ఈ సమస్య కనబడుతుంది.
ముఖంలో కొన్ని కొన్ని బాగాల్లో కొవ్వు చేరడం వల్ల, లేదా కొవ్వు కణాలు అధికంగా ఉండటం వల్ల ముఖం ఉబ్బుకుని, చబ్బీగా కనిపిస్తుంది. అంతే కాదు సమతుల్య ఆహారం తినకపోవడం కూడా ఒక ముఖ్య కారణం.
ఉబ్బుకుని , అసహ్యంగా కనిపించే ఫ్యాట్ ను కరిగించుకోవడానికి స్నేహితులు, లేదా బంధువులు వివిధ రకాలా చిట్కాలను మరియు హోం రెమెడీస్, మెడికేషన్స్ ను సూచించి ఉంటారు? అయితే, చీక్ ఫ్యాట్ (బుగ్గల్లో కొవ్వు)కరిగించుకోవడానికి నేచురల్ మార్గాలు గ్రేట్ గా సహాయపడుతాయి.
ఈ చిట్కాలతో పాటు, కొన్ని ఫేస్ ఎక్సర్ సైజ్ లు కూడా ఉన్నాయి. చీక్ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి ఈ చిట్కాలను మీరు ప్రాక్టీస్ చేయవచ్చు.
ఒక్క నెలలో చీక్ ఫ్యాట్ (బుగ్గల్లో కొవ్వు)కరిగించుకోవడానికి 10 సర్ ప్రైజింగ్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి .

ఎక్కువ నీళ్ళు తాగాలి:
శరీరంలో ఎక్కువగా నీరు తగ్గితే, నీరు ఏఏ బాగాల్లో ఉంటుందో అక్కడి నుండి ఎక్కువగా నీరు ఆభాగాల్లో చేరుతుంది. శరీరంలో అన్ని భాగాలన్నింటిలోకి, ముఖంలో కూడా వాటర్ ఎక్కువగా నిల్వచేరుతుంది. దాంతో ముఖం ఉబ్బుగా , బుగ్గలు నిండుగా వాపుతో కనబడుతుంది. కాబట్టి, బుగ్గల్లో ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎక్కువ నీరు తాగడం వల్ల వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుంది.

ప్రొసెస్ ఫుడ్స్ తినడం నివారించాలి:
మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లో తగినంత న్యూట్రీషియన్స్ లేకపోవడం వల్ల ముఖం ఉబ్బుగా కనబడుతుంది. రెడీ టు ఈట్ నూడిల్స్, ఫ్రోజోన్ మీట్, చిక్స్, వంటి ప్రొసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వీటిలో ఉండే సోడియం కంటెంట్ ముఖంతో పాటు శరీరంలో ఇతర భాగాల్లో ఫ్యాట్ నిల్వచేరడానికి కారణమవుతుంది.

సోడ కలిసిన డ్రింక్స్ తాగడం వల్ల :
సోడ మరియు ఇతర ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్సెస్ స్వీట్నర్స్ ఉంటాయి. ఇవి శరీరంలో, ముఖంలో ఫ్యాట్ సెల్స్ పెరగడానికి కారణమవుతాయి. దాంతో ముఖం ఉబ్బుగా కనిపిస్తుంది. కాబట్టి, సోడా కలిసిన డ్రింక్స్ కు దూరంగా ఉండంటం మంచిది.

ఆల్కహాల్ మానేయాలి:
రోజూ ఆల్కహాల్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల, అది డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. ఇది శరీరంలో వాటర్ రిటన్షన్ కు కారణమవుతుంది. అలాగే బుగ్గల్లో ఫ్యాట్ సెల్స్ ఏర్పడుతాయి. దాంతో ముఖం ఉబ్బుగా పఫీగా కనిపిస్తుంది.

షుగర్ తినడం తగ్గించాలి:
మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే, ఇది బుగ్గలు చుట్టు ఫ్యాట్ కరగడానికి కారణమవుతుంది. పాస్టీస్, చాక్లెట్స్, క్యాండీస్ మరియు షుగర్ కలిసిన బెవరేజెస్ తీసుకోవడం వల్ల ముఖంలో మరియు బుగ్గల్లో ఫ్యాట్ ఎక్కువగా చేరుతుంది.కాబట్టి షుగర్ ఫుడ్స్, స్వీట్స్ ను తగ్గించడం వల్ల బుగ్గల్లో ఫ్యాట్ నేచురల్ గా తగ్గుతుంది.

ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి:
ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్స్ ను తినడం వల్ల , బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ను కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖంలో కూడా ఫ్యాట్ కరగుతుంది.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఆకుకూరలు, బ్రొకోలీ మొదలగు వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారాలను తినడం వల్ల శరీరంలో వివిధ బాగాలతో పాటు, ముఖంలో కూడా ఫ్యాట్ కరిగిస్తుంది .

నువ్వులు:
క్యాల్షియంకు గట్టి మూలం నువ్వులు. నువ్వులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఫ్యాట్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది ,. ముఖ్యంగా బుగ్గుల్లో ఫ్యాట్ ఏర్పడదు.

ఉప్పు తగ్గించాలి:
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో , ముఖంలో నీరు ఎక్కువ చేరుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకూ ఉప్పు తగ్గించాలి. శరీరంతో పాటు , ముఖంలో వాపు తగ్గించుకోవడానికి మరో బెస్ట్ నేచురల్ రెమెడీ ఉప్పు తగ్గించాలి.

నట్స్ తినాలి:
శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ కరిగించుకోవడానికి హెల్తీ నట్స్ తినాలి. నట్స్ ను జోడించడం వల్ల ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది, . వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే శరీరంలో వివిధ భాగాలతో పాటు, ముఖం, బుగ్గల్లో కొవ్వు కరిగించుకోవచ్చు.



Click it and Unblock the Notifications