Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
క్యాన్సర్ నివారించే సత్తా జీడిపప్పుదే
జీడిపప్పుని సాధారణంగా స్వీట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తాం. వీటినే కాజు అని పిలుస్తాం. స్వీట్స్ లో మంచి అలంకరణతో పాటు.. మంచి రుచిని కూడా అందిస్తాయి. జీడిపప్పులో అమోఘమైన విటమిన్స్, మినరల్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు ఫ్యాట్ అని చాలామందిలో అపోహ ఉంది. అయితే.. వీటిని మరీ ఎక్కువగా కాకుండా.. తక్కువ పరిమాణంలో తీసుకుంటే.. ఎలాంటి హాని కలుగదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రెగ్యులర్ గా జీడిపప్పు తీసుకోవాలని అనడానికి అనేక కారణాలున్నాయి. అవి తెలుసుకుంటే.. మీరు ఇకపై జీడిపప్పుకి నో చెప్పే ఛాన్సే లేదు.
గుండె ఆరోగ్యం
జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒలిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది.

క్యాన్సర్
జీడిపప్పు ప్రో ఆంతోసైయనైడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాప్తి చెందించే కారకాలతో వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ పెరుగుదలను నివారిస్తాయి. కోలన్ క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించడంలోనూ జీడిపప్పు కీలకపాత్ర పోషిస్తాయి.
కండరాలు
జీడిపప్పు ద్వారా మెగ్నీషియం పొందవచ్చు. దీనివల్ల బ్లడ్ ప్రెజర్, మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో పాటు, క్యాల్షియం లోపంతో వచ్చే కండరాలు, ఎముకల నొప్పుల నుంచి బయటపడవచ్చు.

బరువు తగ్గడానికి
జీడిపప్పు అంటే.. ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు హానికరమైనవి కాదు.. ఆరోగ్యానికి మంచిది. కాబట్టి జీడిపప్పుని డైట్ చేర్చుకుంటే బరువు పెరిగే ఛాన్సే లేదు. అలాగే జీడిపప్పు తినని వారితో పోల్చితే.. తినేవాళ్లు బరువు తక్కువగా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications