Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చర్మ సమస్యలు.. అత్యంత భయంకరమైన వ్యాధులకు సంకేతాలా ?
మీకు తెలుసా కొన్ని రకాల సమస్యల గురించి మన శరీరం వార్నింగ్ ఇస్తుంది. దాన్నిబట్టి.. మనం సమయానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నిజమే.. మన చర్మం బయటపెట్టే కొన్ని లక్షణాలు డేంజరస్ డిసీజ్ లకు సంకేతాలు.
సాధారణంగా.. ర్యాషెస్, యాక్నె వంటి సమస్యలను ఫేస్ చేసినప్పుడు.. కొన్ని రెమిడీస్ ఫాలో అవుతాం. వాటిని నివారించిన తర్వాత.. వాటి గురించి మరిచిపోతాం. నిజమే కదా..
అయితే అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ సీరియస్ కాదు. కానీ అవి సాధారణంగా కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయంటే... నిర్లక్ష్యం చేయకూడదు. అవి డేంజరస్ డిజార్డర్స్ సంకేతాలుగా గుర్తించాలి. మరి అలాంటి సంకేతాలేంటో చూద్దాం..

ఎగ్జిమా
ఎగ్జిమా అనే చర్మ సమస్య.. డిప్రెషన్ లేదా ఆందోళనకు సంకేతం. ఇలాంటప్పుడు చర్మం చాలా డ్రైగా, స్కేలీగా, దురదగా అనిపిస్తుంది.

సోరియాసిస్
అత్యంత బాధాకరమైన డిజార్జర్ సోరియాసిస్. ఇది హార్ట్ డిసీజ్ రిస్క్ ఉందని తెలిపే భయంకరమైన లక్షణం. సోరియాసిస్ లక్షణాలు, గుండె సంబంధిత సమస్యలకు సంకేతం. కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలి.

రొసాసీ
ఇదోరకమైన చర్మ సమస్య. ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లు.. చర్మంలో ఇన్ల్ఫమేషన్, రెడ్ నెస్ వంటి లక్షణాలను ఫేస్ చేస్తారు. ఇది అల్జీమర్స్ వ్యాధికి సంకేతమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రెయిన్ సెల్స్ పై జరిగిన అధ్యయనాల్లో ఇది బయటపడింది.

విటిలిగో
చర్మం న్యాచురల్ పిగ్మెంట్స్ ని కోల్పోయినప్పుడు విటిలిగ అనే చర్మ వ్యాధి వస్తుంది. ఈ పరిస్థితి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ కి కారణమవుతుంది.

స్కిన్ క్యాన్సర్
స్కిన్ క్యాన్సర్ ఇతర ప్రాణాంతక క్యాన్సర్లకు కారణమవుతుంది. మొదట్లోనే గుర్తించడం చాలా కష్టమైన బ్రెస్ట్ క్యాన్సర్, ప్రొస్టెట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలుంటాయి.

డ్రై స్కిన్
డ్రై స్కిన్ కూడా.. మెంటల్ డిజార్డర్ కి సంకేతం. ఈ సమస్యతో బాధపడేవాళ్లు.. ఏకాగ్రతను కోల్పోతారు.

యాక్నె
చాలా తరచుగా.. యాక్నె సమస్యతో బాధపడుతున్నారంటే.. హార్మోనల్ డిజార్డర్ తో బాధపడుతున్నారని సంకేతం. ఇది పీసీడీఓ వ్యాధిని సూచిస్తుంది.



Click it and Unblock the Notifications