Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
హైట్ ని బట్టి మీ హెల్త్ కండిషన్ తెలుసుకోవచ్చా ?
మీ హైట్ ని బట్టి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చని ఎప్పుడైనా విన్నారా ? అయితే బీఎమ్ఐ గురించి చాలామంది వినే ఉంటారు. హైట్ కి తగ్గట్టు బరువు ఉంటే.. హెల్తీ వెయిట్ గా చెబుతారు. అయితే కేవలం ఎత్తుని పరిగణలోకి తీసుకుని కూడా.. మీ శరీరంలోని ఏ అవయవం హెల్తీగా ఉంటుంది. భవిష్యత్ లో ఎలాంటి హెల్త్ రిస్క్ ఉండవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవచ్చట.
ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పర్ఫెక్ట్ హైట్ లేదు. అయితే.. తక్కువ హైట్ ఉండటం వల్ల కొన్ని రకాల కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కి దూరంగా ఉండవచ్చు. అయితే ఎత్తుగా ఉన్నవాళ్లు, పొట్టిగా ఉన్నవాళ్లలో ఉండే హెల్త్ రిస్క్స్ ఏంటి ? ఎంత హైట్ ఉన్నవాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ? అలాగే మీ హైట్ మీ హెల్త్ గురించి ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

పొట్టిగా ఉండేవాళ్లు
పొట్టి వాళ్లు గట్టివాళ్లు అని వింటూ ఉంటాం. అది నిజమేనేమో. ఎందుకంటే.. పొట్టిగా ఉండే వాళ్లలో క్యాన్సర్, థైరాయిడ్, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ రిస్క్ తక్కువట. 5'10" ఎత్తు ఉండే ఆడవాళ్లలో 5'2" ఎత్తు ఉన్న ఆడవాళ్ల కంటే 30 నుంచి 40 శాతం క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని మూడేళ్లపాటు జరిపిన అధ్యయనాల్లో తేలింది.

ఎత్తుగా ఉండేవాళ్లు
ఎత్తుగా ఉండే ఆడవాళ్లలో అవయవాలు పొడవుగా ఉంటాయి. అలాగే ఎక్కువ కణాలుంటాయి. కాబట్టి.. వీళ్లలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అలాగే హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ క్యాన్సర్ రిస్క్ కి కారణమవుతాయి.

ఎత్తు 5'2"
మీ ఎత్తు 5'2" లేదా అంతకంటే తక్కువ ఉంటే.. మీకు బ్లస్ క్లాట్ రిస్క్ మూడు రెట్లు తక్కువ ఉంటుంది. ఎందుకంటే.. పొడవుగా ఉన్న ఆడవాళ్లలో బ్లడ్ పంప్ అవడానికి చాలా పొడవు సర్క్యులేట్ అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో తగ్గి.. క్లాట్ కి కారణమవుతుంది. హైట్ తగ్గించుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి.. బరువు తగ్గితే బ్లడ్ క్లాట్ నివారించవచ్చు. పొడవుగా ఉన్న ఆడవాళ్లు, బరువు హైట్ కి తగ్గట్టు ఉంటే.. బ్లడ్ క్లాట్ రిస్క్ అంతగా ఉండదు.

90 ఏళ్లు హెల్తీగా
పొట్టిగా ఉన్నవాళ్లు 90 ఏళ్ల వరకు హెల్తీగా, స్ట్రాంగ్ గా ఉండే ఛాన్స్ ఉందని.. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ స్టడీస్ లో తేలింది.

పొడవుగా ఉండేవాళ్లు
5'8" ఎత్తు ఉన్న ఆడవాళ్లు 5'3" ఎత్తు ఉన్న ఆడవాళ్లతో పోల్చితే.. హార్ట్ డిసీజ్ లకు 28 శాతం తక్కువ ఛాన్స్ ఉంటుందని బ్రిటీష్ స్టడీస్ చెబుతున్నాయి.

హార్ట్ డిసీజ్
ఎత్తు రెండున్నర ఇంచులు ఎక్కువ ఉండేకొద్దీ.. వాళ్లలో 14 శాతం హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎత్తుగా ఉన్నాం.. హార్ట్ రిస్క్ లేదని.. స్మోకింగ్, జంక్ ఫుడ్ తినడానికి ఛాన్స్ లేదు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా అవసరం.

పొట్టిగా ఉంటే
పొట్టగా ఉండేవాళ్లలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే రిస్క్ కూడా పొంచి ఉంది.

మెదడు
5'7" ఎత్తు ఉండే ఆడవాళ్లు 5'1" ఎత్తు ఉన్న ఆడవాళ్లతో పోల్చితే.. డిమెంటియా ( మెదడుకి సంబంధించిన )వ్యాధితో మరణించే ఛాన్స్ 50 శాతం తక్కువగా ఉంటుందని స్టడీస్ చెబుతున్నాయి.

డయాబెటిస్
జర్మన్ స్టడీస్ ప్రకారం.. హైట్ హెల్త్ పై సర్ ప్రైజింగ్ ఇంపాక్ట్ చూపిస్తుందని చెబుతోంది. పొడవుగా ఉండేవాళ్లలో డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ తక్కువని స్టడీస్ చెబుతున్నాయి. అలాగే పొడవుగా ఉండేవాళ్ల లివర్ లో కూడా ఫ్యాట్ తక్కువగా ఉంటుంది.

సంతోషం
2009 నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం.. పొడవుగా ఉండే వాళ్లు చాలా పొట్టిగా ఉండేవాళ్ల కంటే చాలా హ్యాపీగా ఉంటారట. వీళ్లలో హ్యాపీనెస్ చాలా ఎక్కువగా ఉంటుందట.



Click it and Unblock the Notifications