Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
స్పెర్మ్ కౌంట్ ను పెంచే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...
సంతానం లేకపోవడానికి స్పెర్మ్ కౌంట్ తక్కువగా వుండడం కూడా ఒక కారణం.మగవారిలో సంతాన సాఫల్యత కలగకపోయేందుకు పలు రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండేందుకు, వాటి మొబిలిటీ (చలనం) తక్కువగా ఉండేందుకు లేదా అండాన్ని ఫలదీకరించే శక్తి తక్కువగా ఉండేందుకు ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చు. వీర్యం ఉత్పత్తిలో లేదా పనితీరులో చోటు చేసుకునే అసాధరణత్వాలు, సాధారణ ఆరోగ్యం, జీవనశైలి సంబంధిత అంశాలు, కొన్ని రకాల పరిస్థితులకు ఎక్కువగా లోను కావడం ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. చాలా వరకు సమస్యలు వీర్యానికి సంబంధించినవే అయి ఉంటాయి.
స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ (వీర్యం సాంద్రత) తక్కువగా ఉండడం కూడా ఓ ముఖ్యమైన సమస్యనే. సాధారణంగా వీర్యసాంద్రత మిల్లీలీటర్ సెమెన్‌కు 20 మిలియన్ల స్పెర్మ్‌గా లేదా అంతకన్నా ఎక్కువగా ఉండాలి. 10 మిలియన్ల కౌంట్ లేదా అంతకన్నా తక్కువ కౌంట్‌ను స్పెర్మ్ కాన్‌సెంట్రేషన్ తక్కువగా ఉండడం (సబ్‌ఫెర్టిలిటీ)గా వ్యవహరిస్తారు. ఈ కౌంట్ 40 మిలియన్లకు మించడాన్ని అధిక సంతానసాఫల్యతగా గుర్తిస్తారు. వృషణాలు వీర్యాన్ని అసలుకే ఉత్పత్తి చేయకపోవడం అనేది అత్యంత అరుదు.

మీ స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి వివిధ మార్గాలు ఇక్కడ వివరించాం, మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి లాంటివి.
ఇవి మీ స్పెర్మ్ కౌంట్ సహజంగా పెంచే మార్గాలు, తద్వారా మీ సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి.

వెల్లుల్లి: వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి, స్పెర్మ్ క్వాలిటీని స్ట్రాంగ్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఇంకా వెల్లుల్లి ఉండే విటమిన్ బి6, సెలీనియం వంటి కాంపౌంట్స్ సెక్స్ హార్మోనులను తిరిగి ఉత్పత్తి అయ్యేలా క్రమబద్దం చేస్తుంది . మరియు స్పెర్మ్ డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

శక్తివంతమైన వీర్యకణాలను పొందలనుకునేవారికి ఆక్రోట్లు వైద్యుల ద్వారా సిఫార్సుచేయబడింది. ఆక్రోట్లు టేస్తోస్టేరాన్ పద్ధతిని అభివృద్ది పరిచే జింక్ ను కలిగి ఉంటాయి, ఇది వీర్యకణాలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. జింక్ ఉండే అరటిపండ్లు, బాదం కూడా సిఫార్సుచేయబడిన ఇతర ఆహార పదార్ధాలు.
వాల్ నట్స్ : రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ మరియు క్వాంటిటీ పెరుగుతుందని నిరూపించారు. వాల్ నట్స్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ స్పెర్మ్ ను చురుకుగా మరియు క్వాలిటీగా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఫొల్లెట్ : ఫొల్లెట్ అనేది మహిళలకు మాత్రమే అవసరం అయినది కాదు, పురుషులకు కూడా అవసరమే . మన శరీరంలో ఫొల్లెట్ మంచిగా ఉంటుంది. ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తోనే శరీరానికి అందుతుంది . దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ తో క్యాలిక్యులేట్ చేస్తారు . ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉన్నప్పుడు స్మెర్మ్ లో అసాధారణ క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి, ఫొల్లెట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.

టమోటో: అత్యంత సాదారణంగా వాడె ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్(carotinoids),లైకోపాన్(Licopan) చక్కని వీర్య శక్తి , మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఎదో విదంగా దీనిని బాగం చేసుకోవాలి.

క్యాలీఫ్లవర్, క్యాబేజీ క్యాబేజ్, బ్రూసెల్, స్ర్పౌట్స్, బ్రొకోలీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్పెర్మ్ క్యాలిటీ పెరుగుతుంది. ఇవి కాలేయాన్ని శుభ్రపరిచి టాక్సిన్స్ ని తొలగిస్తాయి. దీనివల్ల స్పెర్మ్ క్యాలిటీ మెరుగవుతుంది.

ఆస్పరాగస్: విటమిన్ సి ఎక్కువగా అందించడంలో గ్రీన్ వెజిటేబుల్స్ లోని ఆస్పరాగస్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది స్పెర్మ్ క్వాలిటి పెంచి ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది . శరీరంలో ప్రీరాడికల్స్ ను నివారిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications