For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాంటి తలనొప్పి శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి..?

తలనొప్పి అనేది చాలా మందికి భరించలేనిది ఇబ్బందిపెడుతుంది. తలనొప్పి లక్షణాలు, వివిధ రకాల కారణాల వలన వివిధ రకాల చికిత్సలు అవసరం అవ్వవచ్చు.

By Super Admin
|

తలనొప్పి అనేది చాలా మందికి భరించలేనిది ఇబ్బందిపెడుతుంది. తలనొప్పి లక్షణాలు, వివిధ రకాల కారణాల వలన వివిధ రకాల చికిత్సలు అవసరం అవ్వవచ్చు. ఈ తలనొప్పి మీ శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపవచ్చు. మీరు తలనొప్పి రకాన్ని కనుగొన్న, డాక్టర్ సాయంతో తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

types of headache

మీ శరీరం మీద ప్రభావితం చేసే తలనొప్పి రకాలు
టెన్షన్ తలనొప్పి
టెన్షన్ తలనొప్పిని దీర్ఘకాలిక డైలీ తలనొప్పి అని పిలుస్తారు. ఇది పెద్దలు, యువకుల్లో రకరకాల లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ తలనొప్పి తేలికపాటి వచ్చి రోజంతా అలా ఉండిపోతుంది.

migrain

మైగ్రేన్
ఈ తలనొప్పి తరచుగా వస్తూ విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ తలనొప్పి రోజుకి నాలుగు గంటల చొప్పున మూడు రోజులు ఉంటుంది. ఇది సాధారణంగా నెలలో నాలుగు సార్లు వస్తుంది. ఈ నొప్పి ఉన్న వ్యక్తుల్లో కాంతి, శబ్ద సున్నితత్వం, వాసన, వికారం, వాంతులు, ఆకలి లేకపోవటం, కడుపు అప్సెట్, పొట్ట నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

యువకుల్లో మైగ్రేన్ కారణంగా తల తిరగడం, కంటి చూపు అస్పష్టంగా ఉండటం, జ్వరం, కడుపు అప్సెట్ వంటి లక్షణాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో నెలకోసారి వచ్చే ఈ మైగ్రేన్ కారణంగా జీర్ణక్రియ లక్షణాలు, వాంతులు వంటివి ఉంటాయి.

headache

మిక్సిడ్ తలనొప్పి సిండ్రోమ్
ఇది రూపాంతరం చెందే మైగ్రేన్లు కావడంతో పాటు, ఈ పరిస్థితిలో మైగ్రేన్ మరియు ఉద్రిక్తత తలనొప్పి కలిసి ఉంటాయి. ఈ రకమైన తలనొప్పి చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

headache

క్లస్టర్ తలనొప్పి
ఈ రకమైన తలనొప్పిలో కళ్ల మంటలు, విపరీతమైన పోటు నిరంతరాయంగా ఉంటుంది. ఇది సాధారణమే అయినా ఈ తలనొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి వ్యక్తులను బట్టి తీవ్రత మారుతుంది. ఈ తలనొప్పి ఉన్న సమయంలో ఆలా నాలుగు అడుగులు వేస్తె మంచిది.

headahce

ఈ క్లస్టర్ తలనొప్పి గ్రూప్ ధోరణి కలిగి ఉంటుంది. రోజులో ఒకటి నుంచి మూడు సార్లు రావచ్చు. అలాగే రెండు వారాల నుంచి మూడు నెలల వరకు ఉండవచ్చు. ఈ తలనొప్పి నెలలు లేదా సంవత్సరాలకు మాయం అయ్యి మరల రావచ్చు. ఈ రకమైన తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.

English summary

Types Of Headache That Affects Your Body

Types Of Headache That Affects Your Body. These headaches can end up affecting you badly.
Desktop Bottom Promotion