Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అమేజింగ్: వెనిగర్ తో కిడ్నీల్లో స్టోన్స్ కరిగించడం ఈజీ..!
కిడ్నీల్లో స్టోన్స్ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. కిడ్నీల్లో స్టోన్స్ మినరల్స్, ఎసిడ్ సాల్ట్స్ ద్వారా ఏర్పడతాయి. ఇవి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి, కిడ్నీ డ్యామేజ్ కి కూడా కారణమవుతాయి. కొన్ని సందర్భాల్లో కిడ్నీ స్టోన్స్ యూరినరీ ట్రాక్ ని బ్లాక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
మహిళ్లలో నిర్లక్ష్యం చేయకూడని కిడ్నీ స్టోన్ యొక్క లక్షణాలు
కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి సర్జరీనే పరిష్కారం కాదు. హొం రెమిడీస్ ద్వారా కూడా కిడ్నీల్లో స్టోన్స్ నివారించవచ్చు. హోం రెమిడీస్ ద్వారా కిడ్నీల్లో ఏర్పడిన రాళ్లు కరిగించడం ఈజీనే అని స్టడీస్ చెబుతున్నాయి. కిడ్నీ స్టోన్స్ తొలగించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే ఎసిడిక్ నేచర్ స్టోన్స్ ని కరిగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
జీర్ణప్రక్రియను వేగవంతం చేసి, మలినాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను కిడ్నీల్లో స్టోన్స్ తొలగించడానికి ఉపయోగించడానికి చాలా పద్ధతులున్నాయి. వెనిగర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

వాటర్
కిడ్నీల్లో స్టోన్స్ కరిగించడానికి ఇదో చక్కటి మార్గం. 2స్పూన్ల వెనిగర్ ను 8 ఔన్సుల నీటిలో కలపాలి. రోజుకి ఒక్కసారి ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ నివారించవచ్చు. దీంతో పాటు ఎక్కువమొత్తంలో నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగించవచ్చు.

బేకింగ్ సోడా
వెనిగర్ ను బేకింగ్ సోడాలో కలపడం ద్వారా కిడ్నీల్లో స్టోన్స్ కరిగించవచ్చు. సోడాలో ఉండే అల్కలైజింగ్ ఎఫెక్ట్ శరీరంలోని యాసిడ్ ని తొలగిస్తుంది. 2 స్పూన్ల వెనిగర్ కు, అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి.. ఒక గ్లాసు నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తేనె
తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కిడ్నీల్లో స్టోన్స్ నివారించడానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక స్పూన్ వెనిగర్, 2 స్పూన్ల తేనె కలిపి తీసుకుంటే.. త్వరిత ఉపశమనం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్, నిమ్మరసం
నిమ్మలో ఉండే ఎసిడిక్ స్వభావం యూరిన్ లో ఎసిడిటీ లెవెల్ ని తగ్గిస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. అలాగే కిడ్నీల్లో బ్యాక్టీరియా చేరకుండా కాపాడవచ్చు. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం సమానంగా తీసుకుని, ఒక స్పూన్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో కలపాలి. ఈ జ్యూస్ ని తాగడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ నివారించవచ్చు.

కొబ్బరినూనె
కొబ్బరినూనె జుట్టు, చర్మానికే కాదు.. కిడ్నీల్లో స్టోన్స్ నివారించడానికి కూడా సహాయపడుతుంది. 2 స్పూన్ల వెనిగర్, 2 స్పూన్ల కొబ్బరినూనెనుఒక గ్లాసు నీటిలో కలపాలి. రెగ్యులర్ గా ఈ డ్రింక్ తాగుతూ ఉండటం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ నివారించవచ్చు.

తేనె, బేకింగ్ సోడా
ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ తేనె, అరస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటిలో కలపాలి. బాగా మిక్స్ చేసి.. తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు నివారించవచ్చు. రెగ్యులర్ గా ఈ చిట్కా ఫాలో అవడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ పూర్తీగా కరిగించవచ్చు.



Click it and Unblock the Notifications