Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ హైట్ మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
ఒక వ్యక్తి ఎత్తుని బట్టి.. ఆ వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎలాంటి రిస్క్ లు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే దానిపై రకరకాల అధ్యయనాలు జరిగాయి. మరి.. హైట్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..
మీరు చాలా పొట్టిగా లేదా చాలా పొడవుగా లేదా యావరేజ్ హైట్ కలిగి ఉన్నారా ? సాధారణంగా.. హైట్ ఎక్కువగా ఉంటే.. చూడట్టానికి చాలా అందంగా కనిపిస్తారని భావిస్తారు. అయితే.. మీకు తెలుసా ? మన హైట్.. మన ఆరోగ్యంపై రకరకాలుగా ప్రభావం చూపుతుంది ?
విభిన్నమైన హైట్స్ లో ఉండే వ్యక్తులు.. వాళ్ల ఎత్తుని బట్టి.. వాళ్ల ఆరోగ్యం డిసైడ్ చేయవచ్చట. సాధారణంగా.. మగవాళ్లు ఆడవాళ్ల కంటే పొడవుగా ఉంటారు. ఒక వ్యక్తి ఎత్తు వారసత్వం, జెండర్, పోషకాలపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు.. తల్లిదండ్రులు ఇద్దరూ పొట్టిగా ఉంటే.. పుట్టబోయే పిల్లలు కూడా.. పొట్టిగా ఉండటానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఒక వ్యక్తి హైట్,. వాళ్ల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందట.
మరి ఒక వ్యక్తి ఎత్తుని బట్టి.. ఆ వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఎలాంటి రిస్క్ లు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే దానిపై రకరకాల అధ్యయనాలు జరిగాయి. మరి.. హైట్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

హార్ట్ డిసీజ్
5.8 లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉండేవాళ్లకు చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ హైట్ ఉండేవాళ్లకు 5.3 కంటే తక్కువ హైట్ ఉండే వాళ్లతో పోల్చితే.. గుండె సంబంధిత వ్యాధులు రావడానికి తక్కువ రిస్క్ ఉంటుందట.

డయాబెటిస్
యావరేజ్ హైట్ ఉండే ఆడవాళ్లతో పోల్చితే... ఎత్తుగా ఉండే ఆడవాళ్లలో.. టైప్ టు డయాబెటిస్ రిస్క్ తక్కువగా ఉంటుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

క్యాన్సర్ రిస్క్
ఎత్తుగా ఉండేవాళ్లలో ముఖ్యంగా ఎత్తుగా ఉండే ఆడవాళ్లలో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయట. అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్, మెలనోమా, ఒవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తాయి.

బ్లడ్ క్లాట్స్
పొట్టిగా ఉండేవాళ్లలో బ్లడ్ క్లాట్స్ సమస్య వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు 5.3 కంటే తక్కువ హైట్ ఉంటే.. బ్లడ్ క్లాట్ రిస్క్ తక్కువగా ఉంటుంది.

ప్రెగ్నన్సీ
5.2 కంటే తక్కువ హైట్ ఉండే ఆడవాళ్లు.. ప్రెగ్నన్సీ టైంలో.. చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వీళ్లకు ప్రెగ్నన్సీ టైంలో గెస్టేషనల్ డయాబెటిస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

అల్జీమర్స్
మగవాళ్లు 5.10 కంటే ఎక్కువ, ఆడవాళ్లు 5.7 కంటే ఎక్కువ హైట్ ఉన్నవాళ్లలో.. 5.8 కంటే తక్కువ హైట్ ఉన్న మగవాళ్లు, 5.1 కంటే తక్కువ హైట్ ఉన్న ఆడవాళ్లతో పోల్చితే.. అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువని స్టడీస్ చెబుతున్నాయి.

స్ట్రోక్
యావరేజ్ హైట్ కంటే.. తక్కువ ఉన్నవాళ్లలో.. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications