Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
కాలేయం పనితీరు సక్రమంగా లేదని తెలిపే హెచ్చరిక సంకేతాలు..!
మన శరీరంలో రెండవ అతి పెద్ద అవయవం కాలేయం. ఇది అత్యంత ముఖ్యమైన పని చేస్తుంది. శరీరంలోని హానికారక మలినాలు, వేస్ట్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ మలినాలు బయటకు పంపకపోతే.. శరీరంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి.. లివర్ పనితీరు సక్రమంగా ఉండటం చాలా అవసరం.
లివర్ టాక్సిన్స్ ను తొలగించే 10 సూపర్ ఫుడ్స్
ఒకవేళ కాలేయం పనితీరు నిదానంగా మారితే.. మలినాలు శరీరంలో పేరుకుపోయి.. ఫ్యాటీ టిష్యూస్ ఏర్పడటానికి కారణమవుతుంది. అలాంటప్పుడు కూడా మళ్లీ లివర్ హెల్తీగా మారి వాటిని బయటకు పంపాల్సి ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు సహాయపడి.. పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ని స్టోర్ చేయడానికి కూడా సహాయపడుతుంది కాలేయం.
లివర్ (కాలేయ)వ్యాధులను ఉత్తమ చికిత్సనందించే 14 హోం రెమెడీస్
అందుకే మన ఆరోగ్యం విషయంలో కాలేయం పనితీరు కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి.. దాన్ని హెల్తీ ఉంచుకోవడం చాలా అవసరం. మంచి ఆహారం, ఆహారపు అలవాట్లు కాలేయం ఆరోగ్యానికి సహాయపడతాయి. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఐదు మందిలో ఒకరు కాలేయవ్యాధితో బాధపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ లివర్ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. కాలేయం పనితీరు సరిగ్గా లేదని తెలిపే కొన్ని సంకేతాలపై అవగాహన కల్పించుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే.. వెంటనే వ్యాధిని నయం చేసుకోవచ్చు.

తలనొప్పి
తరచుగా వచ్చే తలనొప్పులను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ తలనొప్పి కూడా కాలేయం పనితీరు సరిగా లేదని తెలిపే హెచ్చరిక సంకేతం కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.

అలసట
ఉన్నట్టుండి అలసిపోవడం, ఏ పని చేయకపోయినా అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కూడా కాలేయం పనితీరు సరిగ్గా లేదని సూచిస్తాయి.

నిద్రమత్తు
రాత్రంతా నిద్రపోయినా కూడా మళ్లీ ఉదయం ఎక్కువగా, పదేపదే నిద్రమత్తుగా అనిపించడాన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇది కూడా లివర్ ఫంక్షన్ ని సూచిస్తుంది.

జాయింట్ పెయిన్
కండరాలు, కీళ్ల నొప్పులు తరచుగా వేధించడం, వయసుతో సంబంధం లేకుండా రావడం జరిగిందంటే.. కాస్త అలర్ట్ అవ్వాలి. ఇవన్నీ కాలేయం పనితీరు సరిగా లేదని తెలుపుతాయి.

చర్మ సమస్యలు
యాక్నె, చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ సమస్యలు కూడా కాలేయం పనితీరు సక్రమంగా లేదని తెలుపుతాయి.

ఆందోళన
ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారంటే.. ఒక్కసారి లివర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

జీర్ణక్రియ
తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమవకపోవడం, జీర్ణ సమస్యలు తరచుగా వేధిస్తుంటడం వంటివి లివర్ పనితీరు సరిగా లేదని సూచిస్తాయి.

బ్లోటింగ్
గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్లోటింగ్, పొత్తికడుపు నొప్పి, డయేరియా, కాన్ట్సిపేషన్ వంటి సమస్యలన్నీ కాలేయం పనితీరు సరిగా లేనప్పుడు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు రెగ్యులర్ గా మారి ఉంటే.. మీరు ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

హార్మోనల్ ఇంబ్యాలెన్స్
శరీరంలో ప్రతి అవయవం పనితీరుకు హార్మోన్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి ఏమాత్రం అసౌకర్యంగా మారినా.. రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతున్నారంటే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి..

బరువు పెరగడం
ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు పెరగడానికి చాలా కారణాలుంటాయి. కానీ.. పైన చెప్పిన సమస్యలతో పాటు బరువు కూడా పెరుగుతున్నారంటే.. ఒక్కసారి మీ కాలేయం పనితీరు ఎలా ఉందో చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, రెగ్యులర్ గా వ్యాయామం చేస్తున్నా.. బరువు తగ్గలేకపోతారు కొంతమంది. అలాంటప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలున్నాయి.

లివర్ హెల్త్
కాలేయం ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవడం మంచిది. సరిపడా నీళ్లు తాగడం, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవడం వల్ల కాలేయ వ్యాధిని అరికట్టవచ్చు. డ్రైఫ్రూట్స్, ధాన్యాలు, గింజలు, ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి.



Click it and Unblock the Notifications