Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పంచదారను వాడకాన్ని..స్వీట్స్ తినడం తక్షణం మానేయాలని తెలిపే కొన్ని లక్షణాలు
ఒక వ్యక్తి పంచదారకు అలవాటు పడటం సాధ్యమా ? అంటే అవుననే చెప్పాలి. కొంతమంది రోజుకి ఒక్కసారైనా స్వీట్స్ తినడానికి ఇష్టపడతారు. అలా తినకపోతే అసౌకర్యంగా ఫీలవుతారు. అలాంటి అలవాటే మీకూ ఉంటే.. మీరు పంచదారకు అలవాటు పడ్డారని తెలిపే తీవ్ర లక్షణం.
ఇలా పంచదారకు అలవాటు పడితే.. పంచదార ఉత్పత్తులు ఎక్కువగా తీసుకున్నా.. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీరు ఎక్కువగా షుగర్ తింటున్నారని, వెంటనే పంచదార తినడం మానేయాలని తెలిసే వార్నింగ్ సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకుని.. మీలో కనిపిస్తే.. పంచదారకు దూరంగా ఉండటం మంచిది.

అలసట
పంచదార తీసుకున్న వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే.. కార్బొహైడ్రేట్స్ శక్తిని ఆ క్షణంలో పెంచేస్తాయి. కానీ కాసేపటికే మీలో అలసట మొదలవుతుంది. మీలో ఎనర్జీ లెవెల్స్ కరిగిపోయి.. నీరసిపడిపోతారు. ఇలాంటి లక్షణం కనపడితే.. మీరు పంచదార తినడం మానేయాల్సిందే.

స్వీట్స్ తినాలన్న కోరిక
రోజు ఏదో ఒక స్వీట్ తినకుండా.. రోజు గడపలేకపోతున్నారంటే.. మీరు చాలా తీవ్రంగా పంచదారకు అడిక్ట్ అయ్యారని సంకేతం.

తరచుగా ఫ్లూ
రక్తంలో షుగర్ ఎక్కువైతే తరచుగా జబ్బు పడుతూ ఉంటారు. ఎక్కువగా జలుబు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు మీరు పంచదార ఎక్కువగా తీసుకుంటున్నారని తెలిపే వార్నింగ్ సిగ్నల్.

ఆందోళన
ఎక్కువ ఆందోళనకు గురవుతున్నారంటే.. మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువ స్థాయిలో ఉన్నాయని గుర్తించాలి. ఎక్కువగా చింతించడం, భయం, ఆందోళన వంటి లక్షణాలన్నీ మీరు షుగర్ కి దూరంగా ఉండాలని తెలిపే సంకేతాలే.

చర్మ సమస్యలు
షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతాయి. మీ డైలీ డైట్ లో పంచదారను తగ్గిస్తే.. మీ చర్మ సమస్యలను నివారించవచ్చు. ఆయిలీ స్కిన్, యాక్నే వంటి సమస్యలు షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తాయి.

బరువు
శరీరానికి కావాల్సిన దానికంటే.. ఎక్కువగా పంచదార తీసుకుంటే.. అది ఫ్యాట్ గా మారిపోతుంది. దీని వల్ల మీరు త్వరగా బరువు పెరిగిపోతారు. దీనివల్ల ఒబేసిటీ సమస్యలు మొదలవుతాయి.

అధిక రక్తపోటు
రక్తంలో సోడియం లెవెల్స్ వల్ల మాత్రమే కాదు.. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగినా.. అధిక రక్తపోటుకి కారణమవుతుంది. హైపర్ టెన్షన్ కి, అధిక మోతాదులో షుగర్ తీసుకోవడానికి లింక్ ఉన్నట్లు అధ్యయనాలు నిరూపించాయి.

దంత సమస్యలు
మీరు తరచుగా దంత సమస్యలతో బాధపడుతున్నా, ఎక్కువగా డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి వస్తున్నా.. మీరు పంచదారకు అడిక్ట్ అయ్యారని గ్రహించాలి. షుగర్ ఎక్కువగా తీసుకుంటే.. పంటినొప్పి సమస్యలు వస్తాయి.

డయాబెటిస్
బరువు పెరిగే సమస్య మొదలైంది అంటే.. మీకు డయాబెటిక్ సమస్య మొదలవుతుందని గుర్తించాలి. ఎక్కువ ఆకలి, దప్పిక కూడా మధుమేహం లక్షణాలే. ఇలాంటి లక్షణాలన్నీ డయాబెటిక్ మొదటి దశ లక్షణాలు.

హార్ట్ సమస్యలు
ఎక్కువ మోతాదులో పంచదార తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. హై ఫ్యాట్ డైట్స్ కంటే.. షుగర్ ఫుడ్స్ మరింత ప్రమాదమని ఈ స్టడీస్ చెబుతున్నాయి.



Click it and Unblock the Notifications