Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శరీర భాగాల్లో వచ్చే మొటిమలు.. జబ్బులను సూచిస్తాయా ?
చాలామంది ఫేస్ మ్యాపింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని రివీల్ చేస్తుందని తెలుసు. అంటే.. ముఖంపై ఎక్కడ మొటిమ ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యకు సంకేతమో తెలుసు. కానీ ఇది కేవలం థియరీ మాత్రమే కాదు.. పురావస్తు శాస్త్రీయం కూడా వివరిస్తుంది. ఇది కేవలం ముఖంపై ఉండే మొటిమ ద్వారానే కాదు.. శరీరం మొత్తం ఏ లొకేషన్ లో మొటిమ ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యకు సంకేతమో వివరిస్తుంది.
శరీరంలో జరిగే అసమతుల్యతలు, అనారోగ్య సమస్యలన్నింటినీ.. మొటిమ ఏర్పడే భాగాన్ని బట్టి తెలుసుకోవచ్చట. శరీరంలోని వివిధ భాగాల్లో వచ్చే మొటిమలు వివిధ రకాల జబ్బులను సూచిస్తాయి. కాబట్టి.. మీ బాడీ మ్యాప్.. మీ శరీర అనారోగ్యాన్ని ఎలా వివరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. మరి శరీరంలో ఏ భాగంలో మొటిమ.. ఎలాంటి అనారోగ్య సమస్యకు సంకేతమో.. అవగాహనకు వచ్చి.. ముందు జాగ్రత్త తీసుకోండి.

గొంతుపై మొటిమ
గొంతుపై మొటిమలు ఏర్పడ్డాయంటే.. హార్మోన్ల అసమతుల్యతను తెలుపుతుంది. హార్మోన్ గ్లాండ్స్ సజావుగా లేవని సూచిస్తుంది. అలాగే.. సరైన కాలర్ ఉన్న చొక్కాలు, డ్రెస్ లు వేయకపోవడం, ఈ ప్రదేశంలో జుట్టు తరచుగా తగులుండటం వల్ల కూడా మొటిమ వచ్చే అవకాశం ఉంది.

ఒత్తిడి
గొంతు భాగంలో మొటిమలు ఏర్పడుతున్నాయి అంటే.. మీరు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారని సంకేతం. అలాగే.. మీరు ఎక్కువ మోతాదులో పంచదార తీసుకుంటున్నారని తెలుపుతుంది. కాబట్టి.. ఈ ప్రాంతంలో మొటిమలతో బాధపడేవాళ్లు పంచదారను తగ్గించడం మంచిది.

భుజాలపై మొటిమ
భుజాలపై మొటిమలు వస్తున్నాయంటే.. మీరు ఒత్తిడిలో ఉన్నారని తెలుపుతుంది. అలాగే.. మీరు చాలా సున్నితమైనవాళ్లు అని కూడా సూచిస్తుంది. అలాగే హ్యాండ్ బ్యాగ్ స్ట్రాప్ వల్ల కూడా.. భుజాలపై మొటిమ రావచ్చు. హ్యాండ్ బ్యాగ్ హ్యాండిల్ పదే పదే చర్మంపై రాపిడి జరపడం వల్ల మొటిమలు వస్తాయి.

చెస్ట్ భాగంలో
చెస్ట్ కు పైభాగంలో మొటిమలు చాలా అరుదుగా వస్తుంటాయి. పాలిస్టర్, నైలాన్ వంటి బట్టలు, చాలా టైట్ గా ఉండే బట్టలు ధరించడం వల్ల.. శ్వాస ఆడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు చెస్ట్ పై మొటిమలు వస్తాయి. పంగల్ ఇన్ఫెక్షన్, అలర్జీలు ఉన్నవాళ్లకు కూడా చెస్ట్ పై మొటిమలు వస్తాయి.

జీర్ణ సమస్యలు
అసమతుల్య ఆహారం, చెడు ఆహారపు అలవాట్లు, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వంటి అలవాట్లు.. జీర్ణ సమస్యలు తీసుకొస్తాయి. కాబట్టి చెస్ట్ పై మొటిమలు ఏర్పడ్డాయంటే.. మీ జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతోందని గుర్తించి.. డైట్ లో మార్పులు చేసుకోవాలి.

చేతులపై మొటిమలు
చేతులపై చిన్న చిన్న స్పాట్స్ ఏర్పడి, చర్మాన్ని రఫ్ గా మారుస్తాయి. ఇవి రక్త ప్రసరణ సజావుగా లేనప్పుడు, జుట్టులో డెడ్ సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఏర్పడతాయి.

పరిష్కారం
ఇలాంటి సమస్యతో బాధపడేవాళ్లు.. రెగ్యులర్ గా ఎక్స్ ఫోలియేషన్, మాయిశ్చరైజర్స్ ఉపయోగించాలి. అయినా.. మొటిమలు ఇంకా ఉంటే.. మీ శరీరం ఆహారం ద్వారా సరైన మోతాదులో విటమిన్స్ పొందడం లేదని.. గుర్తించాలి. విటమిన్ లెవెల్స్ తగ్గినట్టు సంకేతం.

పొట్టపై మొటిమలు
పొట్టభాగంలో మొటిమలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఒకవేళ మీకు పొట్టపై మొటిమలు ఉన్నాయంటే.. రెండు కారణాలున్నాయి. మీరు చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల లేదా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండటం వల్ల ఏర్పడతాయి. కాబట్టి కారణం తెలుసుకుని జాగ్రత్త తీసుకోండి.

అండర్
మర్మావయవాల ప్రాంతంలో ఇన్ గ్రోన్ హెయిర్ వ్యాక్స్ లేదా షేవింగ్ వల్ల మొటిమలు రావచ్చు. వాటిని తగ్గించుకోవడం చాలా కష్టం. ఇక్కడ పరిశుభ్రత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మీకు ఈ ప్రాంతంలో మొటిమలు వచ్చాయంటే.. సరిగా శుభ్రం చేసుకోవడం లేదని గమనించాలి. ఒకవేళ దురద, మంటగా అనిపిస్తుంటే.. డాక్టర్ ని సంప్రదించాలి.

తొడలపై
తొడలపై మొటిమలు వచ్చాయంటే.. స్కిన్ సెన్సివిటీ వల్ల లేదా అలర్జీలు కారణం. తొడలపై పైభాగంలో మొటిమలు ఉంటే.. బాడీ లోషన్స్, షవర్ జెల్స్, బట్టల డిటర్జెంట్ వంటి కారణాల వల్ల కూడా మొటిమలు రావచ్చు. అదే తొడలకు లోపలి వైపు యాక్నె ఉందంటే.. షేవింగ్, వ్యాక్సింగ్ వల్ల ఏర్పడతాయి. కొన్ని రకాల బాడీ వాష్ లతో వీటిని నివారించవచ్చు.

వీపు భాగంలో
వీపు భాగంలో మొటిమలకు చాలా సందర్భాల్లో అలర్జీలు, ఎక్కువ చెమట పట్టడం, వ్యాయామం తర్వాత స్నానం చేయకపోవడం, బిగుతుగా ఉండే బట్టలు ధరించడం, గాలి అందకపోవడం, జుట్టు, చర్మ సౌందర్య ఉత్పత్తులు, డిటర్జెంట్ కారణమవుతాయి.

మరో కారణం
వీపుపై మొటిమలు రావడానికి మరో కారణం కూడా ఉంది. ఎక్కువ ఫ్రై చేసిన ఆహారాలు, హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం, తక్కువ నిద్రపోవడం వల్ల కూడా.. వీపుపై మొటిమలు వస్తాయి. ఇవి నరాలు, జీర్ణవ్యవస్థ అనారోగ్య సమస్యలకు కూడా సంకేతం. కాబట్టి.. మరీ తరచుగా వస్తున్నాయంటే.. అలర్ట్ అవడం మంచిది.

పిరుదులపై
పిరుదులపై మొటిమలు రావడానికి శుభ్రంగా లేని అండర్ వేర్ ధరించడం కావచ్చు. లేదా మరీ బిగుతుగా ఉండే అండర్ వేర్ ధరించడం కావచ్చు. లేదా చాలా పొడి చర్మం వల్ల కూడా మొటిమలు వస్తాయి. అలాగే పూర్ డైట్, ఎక్కువగా స్పైసీ ఫుడ్, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కూడా.. జీర్ణసమస్యలకు కారణమవుతాయి.



Click it and Unblock the Notifications











