Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే!
మీ హార్ట్ బీట్ మీ ఆరోగ్యం గురించి ఏం సూచిస్తుంది...!?
సాధారణంగా మనం హార్ట్ బీట్ ను ఎలా తెలుసుకుంటాము? చాలా మందికి ఈ విషయం తెలియదు?!. డాక్టర్ వద్దకు వెళ్ళినప్పడు చేతి మనికట్టు వద్ద నాడీ పట్టుకుని పల్స్ చెక్ చేస్తాడు. లేదా సెతస్కోప్ తో చెస్ట్ వద్ద హార్ట్ బీట్ ను చెక్ చేస్తుంటారు. ఇంకా మెడ వద్ద నాడులు కొట్టుకోవడాన్ని గమనిస్తుంటారు. ఇలా ఎందుకు చూస్తారు? హార్ట్ రేట్, లేదా పల్స్ రేట్ ను బట్టి మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. హార్ట్ రేటు మన శరీర ఆరోగ్యాన్ని సూచిస్తుంది.
హార్ట్ రేట్ మన ఆరోగ్యాన్ని ఎలా సూచిస్తుందో మీకు తెలుసా..? గుండె ఒక నిముషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందో తెలుసుకోవడమే హార్ట్ రేట్ . సహజంగా, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు హార్ట్ ఒక నిముషానికి 60 -80 సార్లు కొట్టుకుంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం హార్ట్ బీట్ 100 టైమ్స్ ఉంటుంది. అయితే ఈ నార్మల్ నెంబర్స్ కంటే తక్కువగా హార్ట్ బీట్ ఉన్నా లేదా నార్మల్ నెంబర్స్ కంటే ఎక్కువ సార్లు హార్ట్ బీట్ ఉన్నా ..శరీరంలో ఏదో అనర్థం జరగుతున్నట్లు సంకేతం.
మీరూ ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది. హార్ట్ బీట్ ఎక్కువగా లేదీ మరీ తక్కువగా ఉన్నట్లై అందుకు కొన్ని బలమైన..ముఖ్యమైన కారణాలున్నాయి. అవేంటో ఒక సారి తెలుసుకుందాం...

టిప్ # 1
డయాబెటిక్ తో బాధపడే వారిలో అసాధారణ హార్ట్ రేట్ ఉంటుంది. డయాబెటిక్ వారు ఇన్ యాక్టివ్ గా ఉండటం వల్ల హార్ట్ రేట్ లో అబ్ నార్మల్ హార్ట్ బీట్ ను సూచిస్తుంది.

టిప్ # 2
వ్యాయామ లోపం కూడా హార్ట్ రేట్ నూ సూచిస్తుంది. ఇంకా ఓబేసిటి కూడా చాలా ప్రమాధకరమైనది. శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు హార్ట్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సివస్తుంది . శరీరంలో మొత్తానికి రక్తప్రసరణ అందివ్వడానికి హార్ట్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అటువంటి సమయంలో హార్ట్ ఎక్కువ సార్లు పంప్ అవుతుంది. కాబట్టి, ఫ్రీక్వెంట్ గా వర్కౌట్స్ చేయడం వల్ల హార్ట్ రేట్ ఆరోగ్యంగా నార్మల్ లెవల్స్ కు వస్తుంది.

టిప్ # 3
డీహైడ్రేషన్ : కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో మెగ్నీషియం, క్యాల్షియం, మరియు పొటాషియంలో కోల్పోవడం జరగుతుంది. అప్పుడు హార్ట్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి.

టిప్ # 4
స్ట్రెస్ : సహజంగా ఒత్తిడి ఆరోగ్య పరంగా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు బ్లడ్ ప్రెజర్ విపరీతంగా పెరుగుతుంది. హార్ట్ బీట్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటుంది . అందువల్ల క్రోనిక్ స్ట్రెస్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాధకరం. ఎక్కువ రోజుల నుండి స్ట్రెక్ గురౌతుంటే దీర్ఘ కాలంలో హార్ట్ కు చాలా ప్రమాదం.

టిప్ # 5
థైరాయిడ్ కారణంగా:
హార్ట్ సరిగా పనిచేయాలంటే థైరాయిడ్ గ్రంథులు ఆరోగ్యంగా పనిచేయాలి. అబ్ నార్మల్ హార్ట్ రేట్ ఉన్నప్పడు డాక్టర్ ను కలిసి, థైరాయిడ్ గ్రంథుల పనితీరును తెలుసుకోవాలి.

టిప్ # 6
హార్ట్ బీట్ మరీ స్లోగా ఉంటే, బాడీలో హార్ట్ కు సంబంధించిన సిస్టమ్ (ఎలక్ట్రికల్ సిస్టమ్ ) లో లోపాలున్నట్లుగా గుర్తించాలి. హార్ట్ బీట్ చాలా స్లోగా ఉన్నట్లైతే వెంటనే డాక్టర్ ను కలవండి.

టిప్ # 7
డ్రగ్స్ : డ్రగ్స్ కూడా హార్ట్ రేట్ ను తెలుపుతాయి. కొన్ని మెడిసిన్స్, కెపిన్ , డ్రింక్స్ , ఆహారాలు, టీలు, చాక్లెట్ మరియు ఎనర్జీ డ్రింక్ లు కొన్ని సందర్భాల్లో హార్ట్ రేటును అలర్ట్ చేస్తాయి.



Click it and Unblock the Notifications