Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
తరచుగా ఎక్కిళ్లు రావడానికి అనారోగ్య సమస్యలే కారణమా ?
ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో.. ఎక్కిళ్లను ఎక్స్ పీరియన్స్ చేసి ఉంటారు. ఎక్కిళ్లు రావడం చాలా సాధారణం. అయితే కొన్నిసార్లు.. ఎక్కిళ్లు.. కొన్ని అనారోగ్య సమస్యలు, వ్యాధులను సూచిస్తాయట ? ఆశ్చర్యంగా ఉన్నా.. ఎక్కిళ్లు మన ఆరోగ్యంలో మార్పు వల్ల వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
శ్వాస సంబంధిత అవయవాల్లో.. ఆకస్మికంగా వచ్చే మార్పుల వల్ల ఎక్కిళ్లు శబ్ధం చేస్తూ.. నోట్లో నుంచి వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరిలో.. ఎక్కిళ్లు తరచుగా వస్తుంటాయి.
కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్లు.. ఎక్కువగా తినడం, త్వరగా తినడం, త్వరగా ఎక్కువ నీళ్లు తాగడం, స్పైసీ ఫుడ్ తినడం, ఎసిడిటీ వంటి కారణాల వల్ల ఎక్కిళ్లు వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఎక్కిళ్లు వచ్చినప్పుడు నొప్పి లేదా ఎలాంటి కారణం లేకుండా రావడం అనేది కొన్ని సందేహాలకు కారణమవుతుంది.
ఇలా ఎక్కిళ్లు రావడం వెనక కొన్ని డేంజరస్ డిజార్డర్స్ సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి.. ఎక్కిళ్లు మీ హెల్త్ కండిషన్ ని ఎలా సూచిస్తాయో మీరే తెలుసుకోండి.

యాసిడ్ రిఫ్లక్స్
వెంటవెంటనే ఎక్కిళ్లు వస్తున్నాయంటే.. మీరు యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడుతున్నారని సూచిస్తుంది. పొట్టలో ఉండే యాసిడ్స్ ని నోరు, ఆహార నాళం వెనక్కి లాగడం ద్వారా.. బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. అలా.. ఎక్కిళ్లు వస్తాయి.

ఒత్తిడి
ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వాళ్లలో చాలా తరచుగా ఎక్కిళ్లు వస్తాయట. కాబట్టి.. ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచిస్తుంది.

క్యాన్సర్
ఒకవేళ మీకు చాలా కాలం నుంచి ఎక్కిళ్లు రాకపోవడం లేదా ప్రతి రోజూ ఎక్కిళ్లు రావడం అనేది.. బ్రెయిన్ లేదా పొట్ట క్యాన్సర్ సంకేతం అవుతుంది.

న్యుమోనియా
దీర్ఘకాలం నుంచి.. ఎక్కిళ్లు వస్తున్నాయంటే.. మీరు న్యుమోనియాతో బాధపడుతున్నారని సంకేతం కావచ్చు. ముఖ్యంగా చలి, జ్వరం, చెస్ట్ పెయిన్ వంటి లక్షణాలు.. న్యుమోనియాను సూచిస్తాయి.

ఎన్ఎమ్ఓఎస్ డి
ఒకవేళ మీకు ఎక్కిళ్లతో పాటు వికారం, వాంతులు, చూపు మందగించడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయంటే.. ఎన్ఎమ్ఓఎస్ డి వ్యాధితో బాధపడుతున్నారని సంకేతం. ఇది నరాలవ్యవస్థలో ఇన్ల్ఫమేటరీ డిజార్డర్.

స్ట్రోక్
ఒకవేళ మీకు హఠాత్తుగా తరచుగా.. ఎక్కిళ్లు వస్తున్నాయంటే.. పెరాలసిస్ స్ట్రోక్ కి సంకేతం కావచ్చు. కాబట్టి మీకు వెంటనే.. మెడికల్ చెక్ అప్ అవసరం అవుతుంది.

హార్ట్ ఎటాక్
హార్ట్ ఎటాక్ కి ఎవరికీ తెలియని సంకేతం.. ఎక్కిళ్లు. ముఖ్యంగా ఎక్కిళ్లతోపాటు చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్ వస్తోందంటే.. హార్ట్ ఎటాక్ లక్షణంగా గుర్తించాలి.

కిడ్నీ
ఒకవేళ కిడ్నీలపై.. ఒత్తడి పెరిగింది అంటే.. మీ శరీరం ఎక్కిళ్లతో సంకేతాలు పంపిస్తుంది. కేవలం ఎక్కిళ్లు కాకుండా.. ఇతర లక్షణాలు కనిపించాయంటే.. కిడ్నీకి సంబంధించిన సమస్య అని గుర్తించాలి.



Click it and Unblock the Notifications