Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అలర్ట్ : ఎలాంటి అలర్జీలనైనా ఎఫెక్టివ్ గా నివారించే యాంటీ అలర్జిక్ ఫుడ్స్
వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఆటోమ్యాటిక్ గా మన శరీరంలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా అలర్జీలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాతావరణంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఆటోమ్యాటిక్ గా మన శరీరంలో మార్పులు వస్తాయి. ముఖ్యంగా అలర్జీలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత మందికి వాతావరణంలో మార్పుల వల్ల శరీరంలో మార్పులు, అలర్జీలకు గురైతే, మరికొొంత మంది తినే ఆహారాల వల్ల అలర్జీలకు గురి అవుతుంటారు. ఉదాహరణకు : కొంత మందికి పాలు, చీజ్ , బట్టర్, పీనట్స్ వంటివి అలర్జీలకు గురిచేస్తాయి.

అయితే , మన కిచెన్ లో ఉండే కొన్ని రకాల ఆహారాలు ఈ అలర్జీలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. వీటినే యాంటీ అలర్జీక్ ఫుడ్స్ అని కూడా పిలుస్తారు. ఈ యాంటీ అలర్జిక్ ఫుడ్స్ తినడం వల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, పొట్ట మరియు స్కిన్ అలర్జీలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.ఒకసారి అలర్జీలకు గురైతే అసౌకర్యానికి గురి అవ్వడం మాత్రమే కాదు, చర్మంలో చీకాకు వల్ల దినచర్య మీద ప్రభావం చూపుతుంది.
ముక్కుకారడ, గొంతు నొప్పి, శ్వాస సరిగా ఆకపోవడం, వంటి చిన్న చిన్న లక్షణాలు కనబడుతాయి. అలాగే కొన్ని సీరియస్ లక్షణాలు కూడా కనబడుతాయి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సీరియస్ గా మారే అవకాశం ఉంది.మరి అలర్జీలను నివారించే ఫుడ్స్ గురించి తెలుసుకుందాం..

వెల్లుల్లి:
వెల్లులిల్లో యాంటీబయోటికస్, యాంటీ అలర్జీ, యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అలర్జీలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని మెత్తగా చేసి, రోజూ రెండు తినాలి.

అల్లం:
అల్లంలో యాంటీఆక్సిడెంట్,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలర్జిక్ లక్షణాలున్నాయి. కాబట్టి,అ ల్లంతో తయారుచేసిన టీని రోజుకు ఒకటి రెండు కప్పులు తాగాలి. ఇది అలర్జీలను నివారిస్తుంది.

పసుపు:
పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ కంటెంట్ అధికంగా ఉంది, ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంది. ఒక టీస్పూన్ పసుపు , ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని, ప్రతి రోజూ తాగాలి.

ఫ్లాక్స్ సీడ్స్ :
ఫ్లాక్స్ సీడ్స్ లో సెలీనియం మరియు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మరో రెండు ముఖ్యమైన పదార్థాలున్నాయి. ఇవి అలర్జీలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ , ఒక గ్లాసు వేడి నీటిలో మిక్స్ చేయాలి. దీన్ని రోజుకు ఒకసారి తాగితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

అల్లం టీ:
అల్లం టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది, సీజనల్ అలర్జీలను నివారిస్తుంది. రోజుకు రెండు కప్పులు గ్రీన్ టీని తాగాలి.

నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్స్ నివారించడంలో అలర్జీలను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు లెమన్ వాటర్ ను రోజూ తాగడం మంచిది.

యాపిల్స్:
రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల అలర్జీలను దూరం చేస్తుంది. యాపిల్స్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి అలర్జీలతో పోరాడుతుంది.

స్వీట్ పొటాటో:
స్వీట్ పొటాటోలో విటమిన్ సి, విటమిన్ బి6, బీటాకెరోటిన్, పొటాషియం, మరియు మ్యాంగనీస్ లు అధికంగా ఉన్నాయి. ఇది వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది.కాబట్టిరెగ్యులర్ గా స్వీట్ పొటాటో తినడం మంచిది.



Click it and Unblock the Notifications