Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
డేంజర్: ఫ్రిడ్జ్ లో ఈ ఆహారపదార్థాలు పెడితే విషపూరితంగా మారుతాయి..!!
ఆహార పదార్ధాలు ఫ్రిజ్ లో పెట్టడం ఎంత వరకు మంచిది?ఈ ప్రశ్నను మీకు మీరు ఎప్పుడైనా అడిగారా?వారానికి సరిడా కూరలు, పండ్లు సర్ధేస్తుంటారు, వాటిలో కొన్ని ఫ్రిడ్జ్ లోపెట్టడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచన.
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ కంపల్సరీ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో ఆహారాలు, కూరగాయలు, పండ్లు పెట్టడం వల్ల తాజాగా ఉంటాయని అందరూ భావిస్తాం. ఏ మాత్రం ఫుడ్ మిగిలినా.. వెంటనే ఫ్రిడ్జ్ లో తోసేయడం అందరికి అలవాటు. అలాగే ఫ్రూట్స్, బ్రెడ్, వెజిటబుల్స్, సాస్, సరుకులు కూడా కొంతమంది పెట్టేస్తుంటారు. ఇంట్లో ఉండే ఆహార పదార్థాలన్నింటినీ ఫ్రిడ్జ్ లో చేర్చడం చాలామందికి అలవాటుగా మారిపోయింటుంది.

ఇలా దాచే పదార్ధాలు ఫ్రిజ్ లో పెట్టడం ఎంత వరకు మంచిది? ఈ ప్రశ్నను మీకు మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ మధ్య అందరి ఇళ్ళల్లో టీవీ తో పాటు ఫ్రిజ్ కూడా ఉంటుంది. సాధారణంగా దీనిలో వారానికి సరిపడ కూరగాయలు, పండ్లు లాంటివి నింపేస్తారు. వీటిలో కొన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవడం మంచిది కాదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్ తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు ఎలాంటి పదార్థాలు పెట్టాలి, ఎలాంటి ఆహాార పదార్థాలను పెట్టకూదని అవగాహనక పొందడం చాలా అవసరం. ఎలాంటి ఆహారాలు, ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం..

కాఫీ:
కాఫీని ఎయిర్ టైట్ కంటెయినర్ లో పెట్టడం వల్ల చాలా మంచి వాసన, తాజాగా ఉంటుంది. కానీ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది.అంతే కాదు, కాఫీబీన్స్ ను ఫ్రిజ్ లోపెట్టడం వల్ల తేమను పీల్చుకుని, బంకగా మారుతాయి. అంతే కాకుండా ఫ్రిజ్ లోని మిగిలిన ఆహార పదార్థాలకు కూడా కాఫీ వాసన అంటుకుని, ఆహారపదార్థాలన్నీ కాఫీ వాసన వస్తాయి. కాబట్టి, వీటిని ఫ్రిజ్ లో పెట్టుకోవడమే సురక్షితం. కాఫీ బీన్ ను గాలి చొరబడని సిరామిక్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవడం మంచిది. అలాగే కాఫీ పొడిని కానీ, బీన్ కానీ తక్కువగా కొనుగోలు చేయడం మంచిది.

టమోటో:
టమోటాలను ఫ్రిజ్ లో పెట్టటం వలన వాటిపై ఉన్న పలుచని పొర ముడతలు పడి విటమిన్ సి కోల్పోయే అవకాశం ఉంది. అలాగే రుచి కూడా తగ్గిపోతుంది. టమోటాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఆశ్చర్యంగా ఉందా ? నిజమే వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ మిస్సవుతుంది. అలాగే త్వరగా పండుతాయి. కాబట్టి బయటే పేపర్ బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిది.

ఉల్లిపాయలు:
పేపర్ బ్యాగ్ లో పెట్టడం వల్ల ఉల్లిపాయలు తాజాగా ఉంటాయి. అయితే చాలామంది ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి పెడుతూ ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. బంగాళాదుంపలు విడుదల చేసే మాయిశ్చరైజర్ వల్ల ఉల్లిపాయలు దెబ్బతింటాయి.ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచటం మంచిది కాదు. ఎందుకంటే ఉల్లిపాయలో అధిక నీటి శాతం ఫ్రిజ్ లో ఉండే చల్లదనానికి ఐస్ గా మారి వాటి పొరలను దగ్గరకు చేస్తుంది. దాంతో ఉల్లిపాయలు సహజత్వం కోల్పోయి పోషకాలు తగ్గిపోతాయి.

అరటిపండ్లు:
అరటిపండ్లు ఫ్రిజ్ లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది. అయితే మీరు చల్లగా తినాలి అనుకుంటే.. తినడానికి అరగంట ముందు పెట్టుకోవాలి. అయితే ఆరంజ్, నిమ్మకాయలను రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవడం మంచిది. కట్ చేసిన అవకాడో ఫ్రూట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

తేనె:
తేనె ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చా లేదా అనేది చాలా మందికి డౌట్. అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే.. గట్టిగా అవుతుంది. కాబట్టి రూం టెంపరేచర్ లో పెట్టుకోవాలి. అయితే సూర్య రశ్మి తగలకుండా పెట్టడం మంచిది.తేనెను ఫ్రిజ్ లో ఉంచుట వలన చిక్కగా మారటమే కాకుండా స్పటికంగా మారుతుంది. దాంతో వాడుకోవటానికి కష్టం అవుతుంది. రుచిలో కూడా తేడా వస్తుంది.

మస్క్ మెలోన్:
పుచ్చకాయ,పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్ లో ఉంచితే వాటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్ పూర్తిగా పోతాయి. అంతేకాక పుచ్చకాయ తీపి దనం కోల్పోయి చప్పగా మారుతుంది. వాటర్ మెలాన్, మస్క్ మెలాన్ వంటి ఫ్రూట్స్ ని బయటపెట్టడం మంచిది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెడితే.. పౌడరీగా తయారవుతాయి. దీనివల్ల రుచి మారిపోతుంది. కాబట్టి రూమ్ టెంపరేచర్ లోనే పెటట్డం మంచిది. కట్ చేసిన తర్వాత అయితే.. మూడు నుంచి నాలుగు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఉండే ఫ్లేవర్, సువాసన ఫ్రిడ్జ్ లో పెడితే తగ్గిపోతుంది. అలాగే త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటే పెట్టుకోవాలి.లేదా తాజా వెల్లుల్లిపాయలను పొట్టు తీసి, గాలి చొరబడని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవాలి. కేవలం తక్కవు సమయం నిల్వచేసుకోవడానికి మాత్రమే ఈ పద్దతని అనుసరించాలి. వీటిని కూడా తక్కువ పరిమానంలో కొనుగోలు చేయడాలి. ఎక్కువగా తీసుకుని నిల్వ చేసుకోవడం వల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications