Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అలర్ట్ : ఆరోగ్యానికి హాని కలిగించే 6 ఇండియన్ యమ్మీ స్ట్రీట్ ఫుడ్స్
స్ట్రీట్ ఫుడ్ అంటే నగరవాసులు పడిచస్తారు. ఆరోగ్యస్పృహ ఉన్నవారు సైతం..శుభ్రతను పట్టించుకోకుండా వీధుల్లో దొరికే ఫుడ్ కోసం ఎగబడుతుంటారు. గ్రేటర్‌లోని గల్లీల్లోనూ, బస్తీల సెంటర్లలోనూ దొరికే ఫుడ్ జాబితాలో టిఫిన్లు, స్నాక్స్, ఫాస్ట్‌పుడ్స్‌తోపాటు జ్యూస్‌లు, సలాడ్‌లు చేరాయి. తోపుడుబండ్లు, చిన్న బంకుల్లో దొరికే సలాడ్‌లు ఎక్కువమంది తింటున్నారు.
స్ట్రీట్ ఫుడ్స్ ను కూడా వివిధ రకాలుగా, ప్రాంతాల వారిగా తయారుచేసి అమ్ముతుంటారు. స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రదేశంలో ప్రత్యేకమైన ఆహారాలు తయారుచేయడం వల్ల వాటికి బాగా ప్రసిద్ది. అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ ను సంప్రదాయంగా ఇండ్లలో కాకుండా, బయట తయారుచేసి అమ్ముతుంటారు.ఇలాంటి ఫుడ్స్ కు నగర వాసులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు.
భారతీయులు స్ట్రీట్ ఫుడ్ ని ఇష్టపడడానికి కారణాలు !!
స్ట్రీట్ ఫుడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ :
బయట తినే స్ట్రీట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ ఖచ్చితంగా ఆరోగ్యానికి హానిక చేస్తాయి. ఇంట్లో ఆహారాలు కాకుండా బయట తినే ఆహారాలను రెగ్యులర్ గా తినడం వల్ల ఆరోగ్యం రిస్క్ లో పెట్టినట్లే.వాటిని వండటంలో శుభ్రత పాటించకపోవడం, వాటి తయారికి ఎక్కువ హానికరమైన పదార్థాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తాయి. మరి అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

పానీపూరీ :
మన దేశంలో పలు ప్రదేశాల్లో ఇష్టం పడే స్ట్రీట్ ఫుడ్ పానీ పూరీ ఆయిల్ గా ఉన్న పూరీలను ఫిల్ చేయడానికి ఉపయోగించే నీళ్ళు కలుషితమైతాయి. కాబట్టి వైరల్ వ్యాధులకు కారణమవుతాయి. ఆయిల్ కంటెంట్ వల్ల శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ చేరుతుంది.

పపాడ్ చాట్ :
ఆయిలీ పపాడ్స్, పొటాటో, పెరుగు, మసాలాలు, పపాడ్ చాట్ ను తయారుచేస్తారు. ఇవి చూడటానికి హెల్తీగా అనిపించినా, ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఈ స్ట్రీట్ ఫుడ్స్ సరిగా కుక్ చేయకపోవడం వల్ల బ్యాక్టీరియావ్యాధులకు కారణమవుతుంది.

కచోరీ సమోసా :
స్ట్రీట్ ఫుడ్స్ లో బాగా ఫేమస్ అయినది కచోరీ సమోసా వీటిని నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన ఫ్యాట్ ఉంటుంది. ఇది అనారోగ్యానికి గురిచేస్తుంది. బరువు పెంచుతుంది. గొంతు ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది.

మమూస్ :
అజినామోటో, సాల్ట్ ను ఉపయోగించే మమూస్ తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ రిస్క్ బారినా పడాల్సి వస్తుంది. మమూస్ లో ఉపయోగించే మైదా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

చోలే బతూర :
చోలే బతూర అనారోగ్యకరమైనది కాదని అనుకున్నా వీటి కోసం ఉపయోగించే శెనగల్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి త్వరగా బరువు పెంచేలా చేస్తాయి.

ఐస్ గొలాస్ :
కలర్ ఫుల్ ఐస్ క్యాండీ స్నాక్స్ బాగా పాపులర్. కానీ వీటిలో హానికారక డైస్ ఉండటం వల్ల శరీరానికి హాని కలిగిస్తాయి. గొంతు నొప్పికి దారితీస్తాయి.



Click it and Unblock the Notifications