For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయులు స్ట్రీట్ ఫుడ్ ని ఇష్టపడడానికి కారణాలు !!

|

మీరు మొదటి సారి ఇండియా సందర్శిస్తుంటే మనుషులు, జంతువులూ కలిసి ఒకే దారిలో ట్రాఫిక్ గుండా నడుస్తూ కనపడితే మీరు ఆశ్చర్య పడతారు. అయితే ఈ మధ్యలో జనం కూడా బజారు తిండి ని ఆస్వాదిస్తూ కనపడతారు. భారత దేశంలో ప్రజలు రుచికరమైన బజారు తిండిని ఇష్టపడతారు – దీనికి చాలా కారణాలు వున్నాయి.

భారత దేశంలోని బజారు వైపు మీరు ఒక సారి చూస్తె చాలా వర్ణరంజితమైన రంగులు, మంచి ఘుమఘుమలు, విభిన్నమైన రుచులతో కనపడుతుంది. మసాలా యుక్తమైన ఈ వంటకాలను ఇష్టపడడానికి ఈ కారణాలు చాలు. భారత దేశంలోని వీధుల్లోకి వెళ్ళడమే ఒక సాహసం, కానీ కనులకు, వీనులకు మీ ఆఘ్రాణ గ్రంధులకు కూడా విందు చేస్తుంది.

మనం తినకూడని హైక్యాలరీ ఇండియన్ ఫుడ్స్:క్లిక్ చేయండి

భారతీయులు బజారు తిండిని ఎందుకు ఇష్ట పడతారో అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్య పోయి వుంటే ఇవిగో జవాబులు. బళ్ల మీద ఆహారం అమ్మే వారి చుట్టూ ట్రాఫిక్ రణగొణల మధ్య, అటు ఇటూ తిరిగే పశువుల మధ్య ఎందుకు వేలాది మంది ఉంటారో చూడండి.

బాగా చవక ధరలు :

బాగా చవక ధరలు :

బజారు తిండి చాలా చవకైనది. అందువల్ల మీరు కటాకటి బడ్జెట్ మీద వున్నప్పుడు అనుకూలమైనది. ఇందులో హాయిగోల్పే విషయం ఏమిటంటే తక్కువ ధరకు మంచి పరిమాణం లో ఆహారం దొరుకుతుంది.

టేబుల్ మర్యాదలు పాటించక్కర్లేదు :

టేబుల్ మర్యాదలు పాటించక్కర్లేదు :

మీరు బజారులో తింటుంటే మీ టేబుల్ మర్యాదలు ఇంటి దగ్గరే వదిలేసి రండి. మీరు వేళ్ళు, అరచేయి చీక్కోవచ్చు, చివరకు కాళ్ళు గూడా - ఎవ్వరూ మీకేసి చూడరు.

పుష్కలంగా దొరుకుతుంది :

పుష్కలంగా దొరుకుతుంది :

బజారు తిండి దొరక్కపోవడం వుండదు. ఈ బజారులో మీకు తిండి దొరక్కపోతే ఆ పక్క బజారులో మీకు నచ్చిన ఆహారం దొరకవచ్చు.

ఇందులో వాడే మసాలా దినుసులు ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఇందులో వాడే మసాలా దినుసులు ఆశ్చర్యం కలిగిస్తాయి.

బజారు తిండిలో వాడే మసాలా దినుసులు ఆశ్చర్యం కలిగిస్తాయి. అందులోని ప్రతి ముద్దను మీరు పూర్తిగా ఆస్వాదిస్తారు. భారతీయులు బజారు తిండిని ఇష్టపడే ప్రధానమైన కారణాల్లో ఇది ఒకటి.

మారు వడ్డనలు పూర్తిగా ఉచితం :

మారు వడ్డనలు పూర్తిగా ఉచితం :

మారు వడ్డనలు పూర్తిగా ఉచితం. మీరు వారివంక ఒక సారి నవ్వుతూ చూసి కాస్త సాంబార్ వేయమంటే, వాళ్ళు కూడా నవ్వుతూ సాంబార్ మళ్ళీ వడ్డిస్తారు.

ఆ ఖాళీని పూరిస్తుంది :

ఆ ఖాళీని పూరిస్తుంది :

తమ కడుపులోని ఖాళీని భర్తీ చేసేలా ఆ ఆహారం రంగు, రూపు, రుచి వుండడం కూడా భారతీయులు బజారు ఆహారాన్ని ఇష్ట పడడానికి మరో ప్రధాన కారణం.

విభిన్నమైన రుచులు :

విభిన్నమైన రుచులు :

ఒక బండికి మరో బండికి కూడా రుచులు మారిపోతాయి. బజారు తిండికి అలవాటు పడితే విభిన్నమైన రుచులు చూడవచ్చు.

మీ కోసమే తయారు చేయబడినది :

మీ కోసమే తయారు చేయబడినది :

మీ కంటి ముందే మీ ఆహారం తయారు చేయడం కనపడుతుంటే ఆ మజాయే వేరు. పొర మీద పొర వేస్తూ దాని మీద అలంకారం చేస్తూ వుంటే ఆ ఆహారం రుచి మరింత పెరుగుతుంది.

మీక్కావలసినట్టుగా చేస్తారు :

మీక్కావలసినట్టుగా చేస్తారు :

భారతీయులు బజారు తిండిని ఇష్ట పడడానికి ఇంకో కారణం ఏమిటంటే అది మీకు కావలసిన రీతిలో తయారు చేస్తారు. మీకు సరిపడేలా ఆ మసాలా దినుసులను అటూ ఇటూ మార్చమని కూడా మీరు బండి అతన్ని అడగవచ్చు.

ఖరీదైన రెస్టారెంట్ల కన్నా మెరుగు :

ఖరీదైన రెస్టారెంట్ల కన్నా మెరుగు :

బజారు తిండి లో ప్రధానమైన విషయం ఏమిటంటే బాగా ఖరీదైన రెస్టారెంట్ లో కన్నా ఇదే రుచిగా వుంటుంది. ఒప్పుకుంటారా ?

English summary

Reasons Why Indians Love Street Food

If you are visiting India for the first time, you will be shocked to see the pile of traffic, animals and people trekking the same path. Of course, amidst all this, you will also get to see people hooked onto street food.
Desktop Bottom Promotion