Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మీ రక్తప్రసరణను పెంచే 8 ఉత్తమమైన ఆహారపదార్ధాలు ఇవే
మీ రక్తప్రసరణను పెంచే 8 ఉత్తమమైన ఆహారపదార్ధాలు ఇవే
రక్త ప్రసరణ అనేది ధమనులు మరియు సిరలు ద్వారా రక్త ప్రవాహాన్ని సూచిస్తుంది. ఎంత చక్కటి రక్త ప్రసరణ ఉంటుందో, మీ గుండె యొక్క ఆరోగ్యం కూడా అంత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఈ వ్యాసంలో, రక్త ప్రసరణ పెరిగే క్రమంలో ఉపయోగపడే మంచి ఆహారాల గురించిన వివరాలను పొందుపరచబడినది.
రక్త ప్రసరణ ద్వారా శరీరం యొక్క వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది, శరీరం యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, వ్యాధుల తీవ్రత పెరుగకుండా చూడడంలో కూడా ఆరోగ్యకర రక్త ప్రసరణ సహాయం చేస్తుంది.

రక్త ప్రసరణ సరిగ్గా లేని ఎడల, తరచుగా ఆకలి సమస్యలు, అస్పష్టమైన జీర్ణ సమస్యలు, అవయవాల సమస్యలు, చర్మం రంగు తగ్గడం, తరచూ అలసట, అనారోగ్య సిరలు మరియు పెళుసైన వెంట్రుకలు, గోళ్ల నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి.
రక్త ప్రసరణ తగ్గడానికి గల కారణాలు ఏమిటి?
ధూమపానం కారణంగా, మరియు కాలుష్య కోరల కారణంగా శరీరంలో కార్బన్ మోనాక్సైడ్ మూలాలు ఎక్కువవడం మొదలైన అనేక కారణాల వలన రక్తప్రసరణ తగ్గుముఖం పడుతుంది. ఇది కణత్వచ ఫలకాలను దెబ్బతీయడం, మరియు ధమనుల గోడలను దెబ్బతీయడం వంటి చర్యలకు కారణమవుతుంది.
అదేవిధంగా, అనారోగ్యకర జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్స్, అధిక లేదా తక్కువ రక్తపోటు సమస్యలు మరియు కొలెస్ట్రాల్ సమస్యల వలన రక్త ప్రసరణ తగ్గుముఖం పట్టడంలో ముఖ్య కారణాలుగా ఉన్నాయి.
రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి తీసుకోవలసిన ముఖ్యమైన ఆహార పదార్ధాల గురించిన వివరాలను ఇచ్చట పొందుపరచబడ్డాయి:

1. కోల్డ్-వాటర్ ఫిష్
సాల్మోన్, మాకేరెల్, మరియు ఇతర చల్లటి నీటి చేపలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలలో పుష్కలంగా ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు హృదయానికి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇవి గుండె మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మంచిది. ఇవి రక్తంలో ప్లేట్లెట్స్ యొక్క వాపు మరియు అస్థిత్వం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ప్రయోజనాలను పూర్తిగా పొందేందుకు వారానికి రెండుసార్లు చేపను తీసుకోవడం మంచిది.

2. నారింజ పండ్లు
రక్త ప్రసరణ వ్యవస్థలో అద్భుతమైన ప్రభావాన్ని కలిగి ఉండే విటమిన్-సి అధికంగా ఉన్న పండ్లలో నారింజ పండు ముందు వరసలో ఉంటుంది. ప్రత్యేకంగా ధమనుల నుండి కణాలకు రక్తాన్ని సరఫరా చేసే కాపిల్లరీస్ నిక్షేపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా విటమిన్ సి అవసరం. విటమిన్ సి ఉన్న ఇతర ఆహారాలు ముఖ్యంగా నిమ్మకాయలు, కాప్సికం, పైనాపిల్, బ్రొకోలీ మరియు స్ట్రాబెర్రీస్ కూడా రక్త ప్రసరణకు సహాయం చేస్తాయి.

3. నట్స్
నట్స్ మెగ్నీషియం మరియు ఎల్-ఆర్గినైన్ మోతాదులలో పుష్కలంగా ఉన్న కారణాన, శరీరంలో రక్త ప్రసరణకు ఎంతగానో దోహదపడుతుంది. మెగ్నీషియం అనేది శరీరానికి అత్యవసర ఖనిజం, ఇది ధమనులకు విశ్రాంతిని అందించడంలో మరియు రక్త ప్రసరణ సజావుగా సాగే క్రమంలో విస్తరించుటకు సహాయం చేస్తుంది. మరోవైపు, ఎల్- ఆర్గినైన్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసే క్రమంలో సహాయపడుతుంది, ఈ సమ్మేళనాలు ధమనులలో రక్త ప్రసరణకు సహాయపడుతుంది.

4.గ్రీన్ టీ
మీరు తరచూ పాలు, టీ లేదా కాఫీలకు అలవాటు పడిన వాళ్ళైతే, మీ శరీర విధులను, జీవక్రియలను ప్రోత్సహించే క్రమంలో గ్రీన్-టీ కి మారడం మంచిది. గ్రీన్ టీ మీ రక్త నాళాలను విస్తరిస్తుంది. క్రమంగా రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. గ్రీన్-టీ లోని అనామ్లజనకాలు పూర్తిగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

5. వెల్లుల్లి
వెల్లుల్లి రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది మరియు మీ జీర్ణక్రియ ప్రక్రియను ఆరోగ్యకరంగా ఉంచడంలో వెల్లుల్లిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటిమైక్రోబాక్టీరియల్ లక్షణాలు సహాయం చేస్తాయి. వెల్లుల్లి సహజ సిద్దమైన సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉన్న కారణంగా, శరీరంలోని అంటువ్యాధులతో పోరాడే క్రమంలో, మరియు శరీరంలోని విషతుల్య రసాయనాలను బయటకు పంపడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. అల్లం మరియు ఉల్లిపాయలు కూడా రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

6. మూలికలు
మూలికలు రక్త ప్రసరణ మెరుగుపర్చడానికి ఎంతగానో సహాయం చేస్తాయి మరియు అనారోగ్యాలను చికిత్స చేసే క్రమంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. బిల్బెర్రీ, పార్స్లీ, మొదలైన మూలికలు ధమనులలో, సిరలలో రక్తప్రసరణ పెంచగలిగే పోషకాలను కలిగి ఉంటాయి.

7.బీట్రూట్
బీట్రూట్లు నైట్రేట్లో పుష్కలంగా ఉంటాయి, నైట్రేట్లురక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. నైట్రేట్, శరీరంలోకి ప్రవేశించాక “నైట్రిక్ ఆక్సైడ్” గా మారి ధమనుల విస్తరణలో సహాయపడుతుంది.

8. డార్క్ చాక్లెట్
రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచే అనామ్లజనకాలు డార్క్ చాక్లెట్లో పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ చర్యను నివారించగల మరియు వాపును నివారించగల సామర్ధ్యం కలిగిన ఫ్లేవానాయిడ్స్ వంటి శక్తివంతమైన అనామ్లజనకాలు కలిగి ఉంటుంది.
రక్త ప్రసరణ పెంచే ఈ ఆహారాలే కాకుండా, దైనందిక జీవన శైలిలో, ఆహార ప్రణాళికలో ఆరోగ్యకర మార్పులు, క్రమ బద్దమైన వ్యాయామ ప్రణాళిక కూడా ఎంతగానో సహాయం చేస్తుంది. ధూమపానం, మద్యపానం, డీప్ ఫ్రైడ్, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ వంటివి శరీరంలో క్రొవ్వు శాతాలను పెంచడమే కాకుండా, అధిక రక్తపోటు, ఊబకాయం, మూత్ర పిండాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యం, కాలేయ సమస్యలు, ధమనులలో కొవ్వు పేరుకుని పోవడం, క్రమంగా రక్త ప్రసరణ తగ్గుముఖం వంటి సమస్యలకు కారణమవుతుంది. కావున వీటిని తగ్గించడం, వీలయితే పూర్తిగా దూరంగా ఉంచడం మంచిది.
ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవనశైలి, ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications











