Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
జ్ఞాపకశక్తిని, దృష్టిని మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే 9 ప్రధాన మూలికలు!
జ్ఞాపకశక్తిని, దృష్టిని మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే 9 ప్రధాన మూలికలు!
ఒత్తిడికి లోనవ్వడం, నిద్ర లేకపోవడం, పని లేదా ఇతర కారణాల చేత కంప్యూటర్ స్క్రీన్, లేదా చరవాణులకి రోజంతా అంకితమైపోవడం, నిస్తేజమైన మెదడు వంటి సమస్యలు తరచుగా ఎదురవడం పరిపాటి. క్రమంగా అధిక పని ఒత్తిడి కారణంగా లేదా సరైన పోషకాహారం అందకపోవడం మూలంగా ఆలోచనా శక్తి తగ్గడం, సరైన సమయానికి మెదడు చురుకుగా స్పందించకపోవడం మొదలైన సమస్యలకు కూడా గురవుతూ ఉంటారు. ఇటువంటి సమస్యలను దూరంచేసేందుకు, కొన్ని సహజసిద్దమైన మూలికలు ఎంతగానో సహాయపడగలవు.
ఇక్కడ పొందుపరచబడిన తొమ్మిది మూలికలు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి మరియు పనియందు పూర్తి దృష్టి పెట్టేందుకు సహాయపడతాయి.

1. రోజ్మేరీ
రోజ్మేరీ ఒక సహజసిద్దమైన బ్రెయిన్ - బూస్టర్ వలె పనిచేస్తుంది, ముఖ్యంగా దీనిని తైలమర్ధనంలో ఉపయోగిస్తారు. రోజ్మేరీ నూనె యొక్క సువాసన మానసిక ఉల్లాసాన్ని పెంచడంలో మెరుగ్గా పనిచేస్తుంది. మరియు జ్ఞాపకశక్తి పెరుగుదలలో కూడా సహాయం చేస్తుంది.

2. అశ్వగంధ
ఆరోగ్యకరమైన శరీరం మరియు మానసిక ప్రశాంతతను ప్రోత్సహించడానికి అవసరమయ్యే రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో అశ్వగంధ సంపూర్ణ మద్దతునిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మరియు మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి సహాయం చేస్తుందని నమ్ముతారు. అశ్వగంధ, ఆలోచనా మరియు జ్ఞాపక శక్తి పనితీరును పెంచడంలో దోహదపడుతుంది.

3. జింక్గోబిలోబా
జింక్గోబిలోబా, దాని సహజ వైద్యలక్షణాలు వందల సంవత్సరాలుగా తన ప్రయోజనాలను మానవాళికి అందిస్తూనే ఉంది. ఈ హెర్బ్ మానసిక పెరుగుదలను ప్రోత్సహించేందుకు మరియు మెదడులోని కణాలను పునరుజ్జీవించేలా చేసేందుకు ఎంతగానో సహాయపడగలదని తెలుపబడింది. క్రమంగా మెదడు ఆరోగ్యవంతంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషించగలదు.

4. గిన్సెంగ్
గిన్సెంగ్, మానసిక పనితీరును మెరుగుపరచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఒక అడాప్టజెన్ వలె పనిచేస్తుందని చెప్పబడింది. ముఖ్యంగా అడ్రినలిన్ గ్రంధి సరిగ్గా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. క్రమంగా శరీరం మరియు మెదడును ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించుటలో సహాయం చేస్తుంది. గిన్సెంగ్ అనేది వయస్సు సంబంధ మానసిక క్షీణత నుండి, మెదడు కణాల నష్టం నుండి కూడా కాపాడగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

5. బ్రాహ్మి
జ్ఞాపకశక్తి, మేధస్సు, దృష్టి మరియు అభ్యాసన సామర్థ్యాన్ని పెంచడానికి బ్రహ్మి కనుగొనబడింది. ఇది ఆందోళనల నుండి ఉపశమనం కలిగించడంలో మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయంచేయడంలో, అడ్రినలిన్ మద్దతు తీసుకుని ఆలోచనాశక్తిని పెంచడంలో కీలకపాత్రను పోషించగలదని చెప్పబడింది.

6. వాచ
వాచ అనే మూలికను తరచుగా నాడీవ్యవస్థ రుగ్మతల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది దృష్టి మరియు మానసిక ఏకాగ్రతను మెరుగుపరచే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది . వాచ, మెదడు కణజాలం నిర్విషీకరణలో అత్యంత సహాయం చేయగలదని నమ్మబడినది.

7. తులసి
తులసిని హోలీ బాసిల్ అని కూడా పిలుస్తారు. మెదడుకు ఎక్కువ ప్రాణవాయువును అందించడం ద్వారా మెదడులో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పెరిగిన రక్త ప్రసరణ మొత్తం ఆలోచనా శక్తి పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. మరియు సహజ సిద్దమైన మూడ్-బూస్టర్ వలె పనిచేసి, మెదడు క్రియాశీలంగా పనిచేసేలా దోహదం చేస్తుంది.

8. గోటు కోలా
గోటు కోలా, మొత్తం మెదడు ఫంక్షన్ క్రియాశీలంగా పనిచేయడానికి ఒక టానిక్ వలె ఉపయోగించవచ్చు. ఇది శరీరంలో రక్త ప్రసరణను విస్తరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు జ్ఞాపక శక్తి సామర్ధ్యాన్ని పెంచుతుంది. గోటు కోలా కూడా ఒక అడాప్టోజన్, ఇది కూడా అడ్రినలిన్ గార్మోన్ల ఉత్పత్తికి దోహదం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించగలదు.

9. రోడియోలా
రోడియోలా సాంకేతికంగా ఒక వేరు మాదిరి ఉన్నప్పటికీ, ఇది సహజసిద్దమైన ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతూ ఉంది. ఇది ఒత్తిడి తగ్గించడానికే కాకుండా శరీరం బలహీనంగా ఉన్నప్పుడు శారీరక మరియు మానసిక పనితీరును మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుందని చెప్పబడింది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవనశైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications