Latest Updates
-
మన ప్రార్థనలు భగవంతుడికి ఎలా చేరుతాయి? శాస్త్రాలు చెప్పే విశేషాలు -
జూన్ 25: ఈ 5 రాశుల వారికి అదృష్టం వరించనుంది.. మీ రాశి ఉందా? -
తుల, ధనుస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. భారీ లాభాలు! - గురువారం, 25 జూన్ 2026 -
రాజస్థానీ మటన్ కర్రీకి అంత క్రేజ్ ఎందుకు? ఈ సింపుల్ రెసిపీని ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది! -
మా దేశాన్ని అవమానిస్తావా? ఇటలీలో బంగ్లాదేశ్ వెయిటర్ కు చుక్కలు చూపించిన భారతీయ నారీమణులు -
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా.. మీకు కాబోయే భాగస్వామిలో ఈ సంకేతాలు చాలా డేంజర్.! -
ఆల్పైన్ డివోర్స్.. మహిళలను వణికిస్తున్న ఈ కొత్తరకం విడాకులు ఏంటి? -
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్‌కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు?
కాపర్ బ్రాస్లెట్ వేసుకోవడం వల్ల పొందే ఆరోగ్య లాభాలు
చాలామంది భారతీయులు రాగి కంకణాలు ధరిస్తారు. పురుషులు, స్త్రీలు కూడా వేసుకుంటారు. రాగి ఆభరణాలు ధరించటం వల్ల శరీరంపై మంచి ఆరోగ్యప్రభావం ఉంటుందని శతాబ్దాలకు పైగా ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి.
మీకు రాగి అలర్జీ అయితే, మీరు వాడకుండా ఉండవచ్చు కానీ రాగి వల్ల మాత్రం రోగనిరోధక శక్తితో పాటు ఇతర ఆరోగ్యలాభాలు కూడా కలుగుతాయి.
వీటికి శాస్త్రీయ నిరూపణ అంతలేకపోయినా వాటివల్ల చర్మంపై మరే ఇతర దుష్ప్రభావాలు లేకపోవటంతో అందరూ వీటిపై ఆసక్తి చూపిస్తారు. రాగి కంకణాలపై మరికొన్ని విశేషాలు చదవండి..

పట్టేసిన కీళ్ల కండరాలకు ఉపశమనం ఇస్తుంది
రాగి కంకణాల వల్ల పట్టేసిన కీళ్ళకు ఉపశమనం లభిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ కీళ్ళవాతం వస్తుంది.
రాగి కంకణం చేతికి వేసుకున్నాక వారికి విశ్రాంతిగా అన్పిస్తుంది. నిజానికి కంకణం మణికట్టు మీదనే ఉండి మిగతా కీళ్ళనొప్పులను ఎలా తగ్గిస్తుందో ఇంకా రహస్యమే మరి.

నొప్పి తగ్గిస్తుంది
కీళ్ళవాతంతో పాటు ఆర్థరైటిస్ తో బాధపడే వారికి కీళ్ళనొప్పులను ఈ రాగి కంకణాలు తగ్గిస్తాయి. (కొన్ని పరిశోధనల ప్రకారం రాగికి వాపులను తగ్గించే గుణం ఉన్నది)
ఖనిజలవణాలను శరీరం పీల్చుకోవటంలో సాయపడుతుంది
ఒక పరిశోధన ప్రకారం సూక్ష్మలవణాలైన జింక్, ఐరన్ వంటివి కంకణాలలో రాగితో పాటు కలిసి ఉండి, చెమటవల్ల శరీరంలోకి పీల్చుకోబడతాయి. ఒక వ్యక్తికి ఆ ఖనిజాల లేమితో బాధపడుతుంటే, అతని సమస్య తీరినట్టే.

సప్లిమెంట్ల కన్నా మంచిది
కొన్ని పరిశోధనల్లో సప్లిమెంట్ల కన్నా రాగి కంకణాలే మంచివని తేలింది. కొన్ని సూక్ష్మలవణాలు చెమట ద్వారా లోపలికి పీల్చుకోబడితేనే ఎక్కువ ప్రభావం చూపిస్తాయనే కారణం కావచ్చు. కీళ్ళకు, కణజాలాలకు దీర్ఘకాలంలో ఇది మంచిది.

లోపాలను సవరిస్తుంది
రాగి లోపం వల్ల అయోటిక్ అన్యూరిస్మ్ స్ అనే స్థితి ఏర్పడచ్చు. దీనివల్ల చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోయి మీ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. రాగి కంకణం వేసుకోవటం వల్ల మీ హృదయానికి కూడా మంచిది.

ఇతర లాభాలు
రాగి వల్ల ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఇతర లోహాల విషప్రభావాలను ఇది తగ్గించటమే కాక, హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేసే ఎంజైములను ప్రేరేపిస్తుంది కూడా.

వయస్సు మీరకుండా చేస్తుంది
రాగి కంకణం వేసుకున్న వ్యక్తి ఆనందంగా ఉంటాడు. అధిక యాంటిఆక్సిడెంట్ల వల్ల రాగి వయస్సు తొందరగా మీరకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications