పొట్ట దగ్గర కొవ్వు ఉందా? ఇలా చేస్తే కొవ్వు కరిగిపోతుంది.. పొట్ట ఉండదు

ప్రస్తుతం చాలా మంది కొవ్వుతో బాధపడుతుంటారు. దీంతో చాలా రకాల జబ్బులు వస్తుంటాయి. ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యకరమైన కేలరీలతో నిండిన జంక్ ఫుడ్ తింటున్నారు.పొట్ట దగ్గర కొవ్వు, బెల్లీ, నడుము దగ్గర కొవ్వు

ప్రస్తుతం చాలా మంది కొవ్వుతో బాధపడుతుంటారు. దీంతో చాలా రకాల జబ్బులు వస్తుంటాయి. ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యకరమైన కేలరీలతో నిండిన జంక్ ఫుడ్ తింటున్నారు. చాలా మందికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం సాధ్యం కాదు. దీంతో సౌకర్యవంతంగా లభించే ప్యాక్డ్ ఆహారం లేదా జంక్ ఫుడ్ తింటునారు. ఫలితంగా, అధిక కొవ్వు, లెక్క లేని కేలరీలు సంపాదిస్తున్నారు .

పొట్ట దగ్గర కొవ్వు(బెల్లీ ఫ్యాట్) పేరుకుపోవడం ప్రధామనైన ఆరోగ్య సమస్య. కొవ్వు, అధిక బరువు, ఊబకాయం చాలా మంది బాధపడుతుంటారు. దీని వల్ల వివిధ వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది.

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

ఇక పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకోవడం.. అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. సన్నగా, నాజుకుగా దృఢంగా ఉంటూ చదునైన పొట్టని కలిగి ఉండి, మంచి ఆహార్యాన్ని కలిగి ఉండటం ఏ వ్యక్తికైనా ముఖ్యం. మన శరీరంలో మిగతా శరీరభాగాల కంటే పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ పేరుకుపోతుంది. అంతేకాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుని కరిగించడం కష్టం.

అంత సులభం కాదు

అంత సులభం కాదు

శారీరక వ్యాయామ నిపుణులూ పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కరిగించాలంటే అంత సులభమైన విషయం కాదంటున్నారు. ఏ వ్యక్తులకైతే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉంటుందో, అటువంటి వ్యక్తుల ఆరోగ్యంపై అది తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు వల్ల స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్‌ లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు వస్తుంది

పొట్ట దగ్గర కొవ్వు ఎందుకు వస్తుంది

హార్మోన్ల మార్పులు: మహిళలో మెనోపాజ్ తర్వాత శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పుల కారణంగా కడుపు చుట్టూ కొవ్వు వృద్ధి చెందుతుంది. హార్మోన్ల మార్పుతో, జీవక్రియ బలహీనమైన కారణంగా కడుపు చుట్టూ కొవ్వు వృద్ధి చెందుతుంది.

జన్యువులు

జన్యువులు

మన జన్యువులలో ఊబకాయం ఎవరికైనా వుంటే, మనకి ఊబకాయం రావచ్చు. అలాగే అదనపు జంక్ ఫుడ్ ,అదనపు కేలరీలు తీసుకోవడంతో, అవి కొవ్వులుగా మారతాయి; చాలా క్యాలరీలను బర్న్ చేయడం కష్టంగా తయారవుతుంది, ఫలితంగా కొవ్వు పెరుగుతుంది.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడిలో చాలా ఎక్కువ తినడం మానవ స్వభావం, చివరకు కొవ్వు వృద్ధికి దారితీస్తుంది.అలాగగే కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు వివిధ పనులు చేయటానికి శక్తిని ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. అదనపు కొవ్వు,కొవ్వు కణాల్లో నిల్వచేస్తుంది.

నడుము, ఛాతీ

నడుము, ఛాతీ

కొవ్వు ప్రధానంగా నడుము, ఛాతీ ప్రాంతాల్లో ఉంటుంది. మరియు కణాలలో ఎక్కువ స్థలం లేనప్పుడు, ఇది కండరాల లైనింగ్లలో ఒక ఫ్లాబ్ కు దారితీస్తుంది.పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడానికి వ్యాయామంతో పాటు , సరైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం.

పండ్లు

పండ్లు

విటమిన్లు, ఖనిజాలు పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. పండ్లు తక్కువ కాలరీలు కలిగి ఉంటాయి. పొట్ట దగ్గర కొవ్వును కరిగించడానికి రోజూ మీ ఆహారంలో పండ్లను భాగం చేసుకోండి. నారింజ, నిమ్మకాయ, క్వివి, టాన్జేరిన్, తాజా లైమ్స్ వంటి సిట్రస్ పండ్లు, మెటబాలిజాన్నిపెంచుతాయి.

అలాగే ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష మరియు స్ట్రాబెర్రీలు కూడా బాగా పని చేస్తాయి.

కూరగాయలు

కూరగాయలు

కూరగాయాల్లో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.క్యాబేజీ, బ్రోకలీ, టమోటాలు, పాలకూర, బీన్స్. బఠానీలు వంటివి ఎక్కువగా తినాలి.

వ్యాయామం

వ్యాయామం

అనారోగ్య కొవ్వు, తీపి ఎక్కువగా ఉండే పదార్థాలను పూర్తిగా నిషేధిస్తే మంచిది. అంతేకాకుండా రోజూ 40 నిముషాలు వ్యాయామం చేయడం ఉత్తమం. పొట్ట సంబంధిత వ్యాయామాలైన, గుంజీలు మొదలైన వ్యాయామాలూ క్రమం తప్పకుండా చేయాలి. అందువల్ల కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉంది.

దోసకాయ

దోసకాయ

దోసకాయ రసంలో విటమిన్‌ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువ. ఇది జీవక్రియను బాగా పెంపొందించి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని చాలా త్వరితగతిన తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

అల్లంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలో ఉన్న కొవ్వుని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

అలోవెరా

అలోవెరా

అలోవెరాలో ఒక శక్తివంతమైన పదార్థం ఉంది. అది కొవ్వుకు సంబంధించిన ఎన్నో ఎంజైములను శరీరం నుండి దూరం చేసి, నాశనం చేస్తుంది.

డాల్డా

డాల్డా

డాల్డాతో తయారు చేసే వంటకాలను తినడం తగ్గించాలి. ముఖ్యంగా కూరలను ఆవిరిమీద ఉన్నప్పుడే ఆరగించడం ఆరోగ్యకరం. కూరలలో నూనెవాడకం వీలైనంత తగ్గించాలి. నూనెలో వేయించే బజ్జీల వంటి పిండివంటలకు దూరంగా ఉండడమే మంచిది. ఎప్పుడూ ఒకే రకం నూనె వాడకుండా రెండు రకాల ఆయిల్స్‌ను కలిపి వాడాలి.

జీడిపప్పు, వేరుశనగ

జీడిపప్పు, వేరుశనగ

జీడిపప్పు, వేరుశనగ వంటివి ఎక్కువగా తినకుండా కాయగూరలు, పండ్లు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు కాస్త పరిమితంగానే తినడం శ్రేయస్కరం. రోజుకు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఒక ఉల్లిపాయ తినడం వల్ల కొవ్వును నెమ్మదిగా కరిగించుకోవచ్చు.

గుడ్లు, పచ్చళ్లు

గుడ్లు, పచ్చళ్లు

నూనెలో వేయించే పూరిల కన్నా నూనెలేకుండా చేసే పుల్కాలే ఆరోగ్యానికి మంచివి. గుడ్లు, పచ్చళ్లు, అప్పడాలు, స్వీట్లు, కేకులు, ఫిజ్జాలు, చాక్లెట్లు.. చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే పూర్తిగా మానేయవచ్చు. కొవ్వు తీసేసిన పాలు తాగడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగకుండా నియంత్రించవచ్చు.

ప్రోటీన్లు

ప్రోటీన్లు

ప్రోటీన్లను బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. పెరుగు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లను ఎక్కువగా తినడం మంచిది. ఫ్రై ఫిష్, చికెన్, సోయా, కాయధాన్యాలు, మొలకలు, పుట్టగొడుగుల ద్వారా కూడా ప్రోటీన్లు ఎక్కువగా పొందొచ్చు.

గుడ్లు

గుడ్లు

గుడ్డు అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్. కొవ్వు తక్కువగా ఉంటుంది. మాంసకృత్తులు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్ల ఎక్కువ ఉంటాయి. గుడ్డులో లెసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది అదనపు కొవ్వును కరిగించగలదు. కాబట్టి అల్పాహారం సమయంలో రోజూ ఒక గుడ్డును తీసుకోండి.

ఓట్స్

ఓట్స్

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. శరీరంలో కొవ్వు పదార్ధాలను కరిగిస్తాయి. ఓట్మీల్ తీసుకోవడం చాలా మేలు. అలాగే విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవాలి:నారింజ, నిమ్మకాయ, సున్నం, గంట మిరియాలు, బ్రోకలీ, కాలే, ద్రాక్షపండు, కివి వంటి వాటలో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ విటమిన్ సి ఉన్న ఒక పండును తినడంవల్ల పొట్ట దగ్గర వున్నా కొవ్వు తగ్గుతుంది.

డైరీ ఫుడ్స్

డైరీ ఫుడ్స్

పాలు, పెరుగు, మజ్జిగ, జున్ను వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటి వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలను బలంగా మారుతాయి. అదనపు కొవ్వు కరిగిపోతుంది.

సరైన నిద్ర

సరైన నిద్ర

సరైన నిద్ర పోవడం వల్ల కూడా పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. సరైన నిద్ర పొందకపోవడం వలన గ్రెర్లిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొవ్వును కరిగించేస్తుంది. అలాగే సరైన సమయానికి భోజనం తినాలి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ పొట్ట దగర కొవ్వు తగ్గించే ఒక అద్భుతమైన పానీయం. ఇది కేట్చిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను పెంచుతుందది. రోజు 2 కప్పుల గ్రీన్ టీ తాగడం వలన పొట్ట దగ్గర కొవ్వు మొత్తం తగ్గిపోతుంది.

Desktop Bottom Promotion